న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆఫ్ఘనిస్థాన్‌తో ఆస్ట్రేలియా ఢీ.. ఆసీస్‌ను ఆఫ్ఘన్ ఆపేనా?

ICC Cricket World Cup 2019: Afghanistan vs Australia | Match Preview | Oneindia Telugu
ICC Cricket World Cup 2019: Afghanistan vs Australia: Afghanistan face Australia in their first World Cup 2019 match at Bristol

ప్రపంచకప్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. తొలి రెండు రోజులూ ఒకే మ్యాచ్‌ జరగగా.. శనివారం రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో అబిమానులు టీవీలకు అతుక్కుపోనున్నారు. బ్రిస్టల్‌లో డిపెండింగ్ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాతో అఫ్గానిస్థాన్‌ తలపడనుండగా.. కార్డిఫ్‌లో శ్రీలంకతో న్యూజిలాండ్‌ పోటీపడనుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

వార్నర్, స్టీవ్ పునరాగమనం:

వార్నర్, స్టీవ్ పునరాగమనం:

శనివారం బ్రిస్టల్ వేదికగా ఆస్ట్రేలియా, సంచలన జట్టు ఆప్ఘనిస్థాన్ మధ్య పోరు జరుగనుంది. బలబలాల పరంగా తమకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఆఫ్ఘన్‌పై ఆసీస్ విజయం ఖాయం. దీంతో తొలి మ్యాచులో బోణీ కొట్టేందుకు ఆసీస్ తహతహలాడుతుంది. ఏడాది నిషేధం అనంతరం జట్టులోకి వచ్చిన డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ సత్తాచాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఐపీఎల్‌లో పరుగుల వరద పారించిన వార్నర్ ఆసీస్ తరఫున అదే రీతిలో ఘనంగా పునరాగమనం చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. రెగ్యులర్ ఓపెనర్, కెప్టెన్ ఆరోన్ ఫించ్‌తో కలిసి వార్నర్ ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.

పటిష్టంగా పేస్ బౌలింగ్:

పటిష్టంగా పేస్ బౌలింగ్:

గత కొంత కాలంగా ఉస్మాన్ ఖవాజ మూడో స్థానంలో మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. ఇక షాన్ మార్ష్, స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్‌తో కంగారూల మిడిలార్డర్ బలంగా ఉంది. బౌలింగ్లో కూడా మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్‌కు తోడుగా నాథన్ కౌల్టర్‌నైల్, ఆడమ్ జంపాలు సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. స్టోయినిస్‌ కూడా బంతిని పంచుకోనున్నాడు. ఆసీస్ పేస్ బౌలింగ్ ఎదుర్కోవడం ఆప్ఘనిస్థాన్ జట్టుకు సవాలే.

బౌలింగే బలం:

బౌలింగే బలం:

సంచలన విజయాలు సాధిస్తూ తాము పసికూనలం కాదని.. ఎంతటి మేటి జట్టునైనా మట్టికరిపిస్తామని ఆఫ్ఘన్ నిరూపిస్తోంది. అత్యుత్తమ ఆటతీరుతో ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన ఆఫ్ఘన్ వీరులు సంచలనాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఆఫ్ఘన్ జట్టుకు బౌలింగ్ విభాగం బాగున్నా.. బ్యాటింగ్ మాత్రం బాగాలేదు. గుల్బోడిన్ నాయిబ్, మొహమ్మద్ షహజాద్, రహ్మాత్ షా, నజీబుల్లా జద్రన్, ఆఫ్ఘన్లు బ్యాటింగ్ విభాగం మోయనున్నారు. మరి వీరు స్టార్ పేసర్లను ఎలా ఎదుర్కొంటారన్నదే అసలు సమస్య. రషీద్, ముజీబ్, నబీలు స్పిన్నర్లుగా సేవలందించనున్నారు. హమీద్ హస్సన్, దావ్లత్ జద్రన్, అఫ్తాబ్ ఆలం పేస్ విభాగం పంచుకోనున్నారు. ఆఫ్ఘన్ విజయం బ్యాట్స్‌మన్‌ల చేతుల్లోనే ఉంది.

జట్లు అంచనా:

జట్లు అంచనా:

ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), వార్నర్, ఖవాజ, స్మిత్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, క్యారీ, కౌల్టర్‌నైల్, కమ్మిన్స్, స్టార్క్, జంపా.

ఆఫ్ఘనిస్థాన్:

షహజాద్, హజ్రతుల్లా, రెహ్మత్ షా, అస్ఘర్, నబీ, నైబ్ (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, రషీద్ ఖాన్, ముజీబ్, హమీద్ హసన్, దౌలత్.

Story first published: Saturday, June 1, 2019, 9:19 [IST]
Other articles published on Jun 1, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X