న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆప్ఘనిస్థాన్‌తో మ్యాచ్: ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా బోణీ చేసేనా?

ICC Cricket Cricket World Cup 2019: South Africa, Afghanistan Hunt For Opening Win of World Cup

హైదరాబాద్: ప్రపంచకప్‌లో భాగంగా శనివారం దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు జరిగే ఈ మ్యాచ్‌కి కార్డిఫై వేదిక అవుతుంది. ఈ ప్రపంచకప్‌లో ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోరు జరుగనుండటంతో ఏదో ఒక జట్టు గెలిచే అవకాశం ఉంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా పరిస్థితి దారుణంగా ఉంది. గత ప్రపంచకప్‌ల్లో ఎప్పుడైనా క్వార్టర్సో, సెమీస్‌లోనో దురదృష్టంతో దూరమయ్యే సఫారీలు ఈసారి మాత్రం ఆరంభం నుంచే కష్టాలు ఎదుర్కొంటున్నారు. సఫారీలు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్‌ ఓడిపోయారు. వరుసగా ఇంగ్లండ్, బంగ్లాదేశ్, భారత్‌ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా విండీస్‌తో వర్షం వల్ల ఆడలేకపోయింది.

దీంతో కేవలం ఒకే పాయింట్‌తో దక్షిణాఫ్రికా కింది నుంచి రెండో స్థానంలో ఉంది. సెమీస్‌ రేస్‌లో నిలవాలంటే దక్షిణాఫ్రికా మిగతా ఐదు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. మరోవైపు పసికూన అప్ఘనిస్తాన్‌ కూడా వరుసగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాడ్ జట్లను ఎదుర్కోలేకపోయింది.

ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి టోర్నీలో బోణీ చేయాలని దక్షిణాఫ్రికా గట్టు పట్టుదలగా ఉంది. అయితే, నిలకడలేని బ్యాటింగ్‌ లైనప్‌ సఫారీ ఓటమికి కారణమైంది. ఓపెనర్ ఆమ్లా వరుసగా విఫలమవుతున్నాడు. కెప్టెన్‌ డు ప్లెసిస్, ఓపెనర్, కీపర్‌ డికాక్‌ రాణిస్తే ఈ మ్యాచ్‌లో సఫారీలు విజయం సాధించడం ఖాయం.

జట్ల అంచనా:
దక్షిణాఫ్రికా: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), ఐడెన్ మార్క్రమ్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), హషీమ్ అమ్లా, రసియే వాన్ డెర్ డస్సెన్, డేవిడ్ మిల్లెర్, క్రిస్ మోరిస్, ఆండిల్ ఫెహ్లక్వేవో, జెపి డుమిని, డ్వైన్ ప్రీటోరియస్, బెయురాన్ హెండ్రిక్స్, కగిసో రాడాడ, లుంగి ఎన్గిడి, ఇమ్రాన్ తాహిర్, తబ్రేజ్ షంసీ.

ఆఫ్ఘనిస్తాన్: గుల్బాదీన్ నాయిబ్ (కెప్టెన్), నూరు అలీ జద్రన్, హజ్రుతల్లా జజాయ్, రహ్మాత్ షా (వికెట్ కీపర్), అస్ఘర్ ఆఫ్ఘన్, హష్మతుల్లా షహీది, నజీబుల్లా జద్రన్, సాముల్లా షిన్వారీ, మొహమ్మద్ నబీ, రషీద్ ఖాన్, దౌలాత్ జద్రన్, అఫ్తాబ్ ఆలం, హమీద్ హసన్, ముజీబ్ యు రెహమాన్, ఇక్రమ్ అలీ ఖిల్

సాయంత్రం 6 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌-3లో ప్రత్యక్ష ప్రసారం

1
43663
Story first published: Saturday, June 15, 2019, 10:32 [IST]
Other articles published on Jun 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X