న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తొలి ఆటగాడిగా చరిత్ర: స్మిత్‌పై ఏడాది నిషేధం కోహ్లీకి కలిసొచ్చింది

ICC Awards: Steve Smith one year ban helped virat kohli to bag icc test cricketer of the year 2018

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. మంగళవారం ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ, ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను కోహ్లీ గెలుచుకున్నాడు. తద్వారా ఒకే ఏడాది ఈ మూడు అవార్డులను దక్కించుకున్న తొలి ఆటగాడిగా కోహ్లి చరిత్ర సృష్టించాడు.

బాల్ టాంపరింగ్ ఉదంతం వల్ల

గతేడాది ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు మినహా మిగతా రెండు అవార్డులను కోహ్లీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 2017 సంవత్సరానికి గాను టెస్టు ప్లేయర్‌ ఆఫ్ ద ఇయర్ అవార్డును స్టీవ్ స్మిత్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బాల్ టాంపరింగ్ ఉదంతం వల్ల క్రికెట్ ఆస్ట్రేలియా స్టీవ్ స్మిత్‌పై ఏడాది పాటు నిషేధం విధించడం కోహ్లీకి 2018లో కలిసొచ్చిందా? అంటే అవుననే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.

కోహ్లీ ఐసీసీ టెస్టు ప్లేయర్‌గా నిలవడానికి

2018 సంవత్సరానికి గాను విరాట్ కోహ్లీ ఐసీసీ టెస్టు ప్లేయర్‌గా నిలవడానికి తన అద్భుత ప్రదర్శన కారణమైనప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్‌కు స్టీవ్ స్మిత్ ఏడాది పాటు దూరం కావడం కూడా కోహ్లీకి కలిసొచ్చింది. 2017లో టెస్ట్ ప్లేయర్‌గా నిలిచిన స్టీవ్ స్మిత్.. 947 పాయింట్లతో టెస్టు ర్యాంకుల్లో అగ్రస్థానంతో ఆ ఏడాదిని ముగించాడు.

కోహ్లీ కంటే స్మిత్ మెరుగైన ప్రదర్శన

2017లో విరాట్ కోహ్లీ టెస్టుల్లో ఎక్కువ పరుగులు సాధించినప్పటికీ.. కోహ్లీ కంటే మెరుగైన ప్రదర్శనను స్టీవ్ స్మిత్ చేయడం విశేషం. గతేడాది మార్చిలో సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ బాన్‌క్రాప్ట్ బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడటం.. ఆ తర్వాత స్మిత్, వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాదిపాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

టాప్-5లో నిలిచిన స్టీవ్ స్మిత్

దాదాపు 9 నెలలపాటు ఆటకు దూరమైనా స్టీవ్ స్మిత్ 2018లో ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-5లో నిలవడం గమనార్హం. స్టీవ్ స్మిత్‌పై నిషేధం వేటు పడిన తర్వాత.. గతేడాది ఆగస్టులో కోహ్లీ టెస్టుల్లో అగ్రస్థానానికి చేరుకోగలిగాడు. 2018లోనూ స్మిత్ క్రికెట్ ఆడి ఉంటే టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ రేసులో కోహ్లీకి గట్టి పోటీ ఇచ్చేవాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Story first published: Tuesday, January 22, 2019, 16:56 [IST]
Other articles published on Jan 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X