న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బుమ్రా బౌలింగ్ ఇప్పటికీ విస్మయమే.. అతడు తరానికి 'ఒకే ఒక్కడు'!!

Ian Bishop compares current Indian pace unit to intimidating West Indies bowlers of past

జమైకా: టీమిండియా పేస్‌ దళంపై వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ బిషప్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుత భారత పేస్‌ దళం ఒకప్పటి కరీబియన్‌ పేసర్లను గుర్తుకు తెస్తోందన్నారు. విదేశాల్లో గెలవాలన్న కసితోనే దుర్భేద్యమైన పేస్‌ బృందాన్ని భారత్‌ తయారు చేసిందని ఆయన పేర్కొన్నారు. జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్ ఇప్పటికీ విస్మయం కలిగిస్తోందని, తక్కువ పరుగెత్తి అంత వేగం ఎలా వేస్తున్నాడో అర్ధం కావట్లేదు అని బిషప్‌ ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

భారత్ నాకు రెండో ఇల్లు.. కేకేఆర్‌ నా కుటుంబం: స్టార్ స్పిన్నర్భారత్ నాకు రెండో ఇల్లు.. కేకేఆర్‌ నా కుటుంబం: స్టార్ స్పిన్నర్

టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ ఉత్తమం:

టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ ఉత్తమం:

నిజానికి టీమిండియా పేస్ విభాగం పటిష్టంగా ఉంది. జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, భువనేశ్వర్‌ కుమార్‌, ఇషాంత్‌ శర్మ, ఉమేశ్‌ యాదవ్‌లతో పాటు యువ పేసర్లు కూడా సత్తాచాటుతున్నారు. ఇక సీనియర్లు వైవిధ్యంగా బౌలింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిక్‌బజ్ ఇన్ సంభాషణలో ఇయాన్‌ బిషప్‌ మాట్లాడుతూ... 'ప్రస్తుత టీమిండియా ఫాస్ట్ బౌలింగ్ ఉత్తమం. మంచి ప్రతిభావంతులు ఉన్నారు. కపిల్ ‌దేవ్‌, జవగళ్‌ శ్రీనాథ్‌ తర్వాత జహీర్‌ ఖాన్‌, ఆర్పీసింగ్‌, మునాఫ్‌ పటేల్‌ వంటి పేసర్లు వచ్చారు. ఇప్పుడు బుమ్రా, షమీ, భువనేశ్వర్‌, ఇషాంత్‌, ఉమేశ్‌. ఎప్పట్నుంచో టీమిండియాకు అద్భుతమైన పేసర్లు ఉన్నప్పటికీ ఒక దళంగా మాత్రం లేరు. ఇప్పుడు బాగుంది' అని అన్నారు.

కరీబియన్‌ పేస్‌దళాన్ని గుర్తుకుతెస్తున్న భారత్:

కరీబియన్‌ పేస్‌దళాన్ని గుర్తుకుతెస్తున్న భారత్:

'బ్యాట్స్‌మెన్‌ బాగున్నా విదేశాల్లో గెలవాలంటే ఎంఆర్‌ఎఫ్‌ పేస్‌ ఫౌండేషన్‌, ఎన్‌సీఏ నుంచి బౌలర్లు అవసరమని భారత్‌ గుర్తించింది. వారిని ప్రోత్సహించేందుకు స్పిన్‌ పిచ్‌లు కాకుండా.. పేస్‌ పిచ్‌లు రూపొందించాలి. ప్రస్తుతం ఫాస్ట్‌ బౌలర్లు, అద్భుతమైన స్పిన్నర్‌తో కూడిన భారత బౌలింగ్‌ దళం మార్షల్‌, హోల్డింగ్‌, గార్నర్‌, రాబర్ట్స్‌, కొలిన్‌ క్రాఫ్ట్‌తో కూడిన నాతరం కరీబియన్‌ బౌలర్లను గుర్తుకు తెస్తోంది' అని బిషప్‌ చెప్పారు.

తక్కువ రన్నప్ ఎలా సాధ్యం:

తక్కువ రన్నప్ ఎలా సాధ్యం:

'భారత జట్టులో ఇద్దరు పోతే మరో ఇద్దరు వస్తున్నారు. పరుగులేమీ ఇవ్వడం లేదు. అందరూ కలిసి ప్రత్యర్థికి ముప్పు కలిగిస్తున్నారు. భౌతిక దాడి చేయడం లేదు. ఇవన్నీ ఈ ఫాస్ట్‌ బౌలర్ల బృందాన్ని అద్భుతంగా మార్చాయి. నేను క్రికెట్‌ పరిణామ క్రమాన్ని పరిశీలించాను. ఎక్కడైనా, ఎప్పుడైనా పేసర్లు దూరం నుంచి పరుగెత్తుకొస్తారు. వెస్‌ హాల్‌, రిచర్డ్‌ హెడ్లీ, డెన్నిస్‌ లిల్లీ, మార్షల్‌, హోల్డింగ్‌ ఎవరైనా సరే ఇందుకు మినహాయింపు లేదు. బుమ్రా మాత్రం ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాడు. అతడిది తక్కువ రన్నప్‌' అని బిషప్‌ పేర్కొన్నారు.

బుమ్రా తరానికి ఒక్కడు:

బుమ్రా తరానికి ఒక్కడు:

'ఈ రోజుకీ బుమ్రాకు అంత వేగం ఎలా వస్తుందో అర్ధం కావట్లేదు. అంతేకాకుండా అతడి నైపుణ్యాలు అద్భుతం. బంతిని స్వింగ్‌ చేసే విధానం, నియంత్రణ చాలా బాగుంటుంది. ఫిట్‌గా ఉంటే అతడికి తిరుగులేదు. ఇంకా చెప్పాలంటే బుమ్రా తరానికి ఒక్కడు' అని విండీస్ కామెంటేటర్ ఇయాన్‌ బిషప్‌ ప్రశంసల జల్లు కురిపించారు.

Story first published: Thursday, May 28, 2020, 8:05 [IST]
Other articles published on May 28, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X