న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జట్టుకు భారమైతే తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నాను: దినేశ్ కార్తీక్

I took it in my stride: DK on Test axe

చెన్నై: పరిమిత ఓవర్ల క్రికెట్‌ కోసం ఫస్ట్‌క్లాస్‌కు దూరం కాబోనని టీమిండియా క్రికెటర్‌ దినేశ్‌ కార్తీక్‌ స్పష్టం చేశాడు. భారత్ జట్టులోకి పునరాగమనం తర్వాత దినేశ్ కార్తీక్ అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. వన్డే, టీ20ల్లో నిలకడగా రాణిస్తున్న ఈ వికెట్ కీపర్.. ఇటీవల టెస్టుల్లో మాత్రం కాస్త తడబడుతున్నాడు. ఈ నేపథ్యంలో.. అంబటి రాయుడి తరహాలో.. ఫస్ట్ క్లాస్‌ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించి.. వన్డే, టీ20లపై దృష్టి సారించబోతున్నాడని వార్తలు వచ్చాయి.

సొంత రాష్ట్రానికి ఆడుతుంటే మజానే వేరు

సొంత రాష్ట్రానికి ఆడుతుంటే మజానే వేరు

దినేశ్‌కి అలాంటి ఆలోచనలేదని తాజాగా చెప్పుకొచ్చిన దినేశ్ కార్తీక్.. జట్టుకి భారమైనప్పుడు కచ్చితంగా వైదొలుగుతానని స్పష్టం చేశాడు. ‘దేశవాళీ క్రికెట్‌లో తమిళనాడు టీమ్‌కి ఆడటాన్ని నేను చాలా ఆస్వాదిస్తాను. వీడ్కోలు ఆలోచనలు నాకు లేవు. ఇంకా చెప్పాలంటే.. సొంత రాష్ట్రానికి ఆడుతున్నప్పుడు ఆ మజానే వేరుగా ఉంటుంది. ప్రస్తుతానికి ఫస్ట్‌క్లాస్‌ ఫార్మాట్‌కి రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచనైతే లేదు.'

భారంగా అనిపిస్తే .. కచ్చితంగా నిర్ణయం

భారంగా అనిపిస్తే .. కచ్చితంగా నిర్ణయం

‘కానీ.. ఒకవేళ తమిళనాడు జట్టుకి నేను భారంగా మారినట్లు అనిపిస్తే మాత్రం.. కచ్చితంగా నిర్ణయం తీసుకుంటా. నా కెప్టెన్సీలో తమిళనాడుకు రంజీ ట్రోఫీ అందించాలన్నది కల. దాని కోసం తీవ్రంగా శ్రమిస్తా. ఈ ఏడాది అద్భుతంగా గడిచింది. ప్రస్తుత హోదాలో ఉన్నందుకు సంతోషంగా ఉంది. వచ్చే సంవత్సరం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. ' అని దినేశ్ కార్తీక్ వెల్లడించాడు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌పై దృష్టి

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌పై దృష్టి

‘రాష్ట్రానికి ఆడటం ఒక గొప్ప ఘనత. నేను ఆడటం భారమని తమిళ అభిమానులు అంటే అప్పుడు వెనక్కి తగ్గుతా. ప్రపంచకప్‌ గురించి ఆలోచించడం లేదు. అలా చేస్తే అనవసర ఒత్తిడి నాపై ఉంటుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ సిరీస్‌పై దృష్టి సారిస్తా. మ్యాచ్‌లను ముగించడం చాలా కీలకం. అందుకే సుదీర్ఘంగా బ్యాటింగ్‌ చేయడానికి కృషి చేస్తున్నా' అని కార్తీక్‌ అన్నాడు.

Story first published: Thursday, December 6, 2018, 8:40 [IST]
Other articles published on Dec 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X