న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మంచి స్నేహితులం: కోహ్లీతో ఉన్న అనుబంధంపై తొలిసారి నోరువిప్పిన ఏబీ

AB de Villiers Lauds Virat Kohli's Captaincy || Oneindia Telugu
I have always been a big fan of the way Virat Kohli plays the game: AB de Villiers


హైదరాబాద్:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ ఆటకు తాను ఎప్పుడూ పెద్ద అభిమానినని డివిలియర్స్ అన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 2011 నుండి వీరిద్దరూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.

తాజాగా ఓ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ "విరాట్ కోహ్లీ చాలా ప్రతిభ కలిగి ఉండటం అదృష్టం. చాలా అనుభవం ఉన్న ఆటగాళ్ళు, ఇంతకుముందు చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఐపీఎల్‌లో ఆడారు. అతను కూడా ఆశీర్వదించబడ్డాడు, కానీ కోహ్లీ జట్టుని ముందుండి నడిపించిన నాయకుడు" అని అన్నాడు.

వార్నర్ సూపర్ త్రో.. తల బాదుకున్న బాబర్ అజామ్ (వీడియో)!!వార్నర్ సూపర్ త్రో.. తల బాదుకున్న బాబర్ అజామ్ (వీడియో)!!

సెంచరీలు చేయడం జట్టుకు మంచిదే

సెంచరీలు చేయడం జట్టుకు మంచిదే

"కెప్టెన్‌గా ఉన్న వ్యక్తి మైదానంలోకి వెళ్లి భారీ సెంచరీలు సాధించడం ఆ జట్టుకు ఎల్లప్పుడూ మంచిది. అతను మాట్లాడటం మాత్రమే కాదు, అందరితో చర్చిస్తాడు కూడా. విరాట్ కోహ్లీ ఓ లీడర్. తన బాడీ లాంగ్వేజ్‌తోనే జట్టుని ముందుండి నడిపిస్తాడు" అని ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు.

కోహ్లీతో ఉన్న అనుబంధంపై

కోహ్లీతో ఉన్న అనుబంధంపై

కోహ్లీతో ఉన్న అనుబంధంపై కూడా డివిలియర్స్ స్పందించాడు. ఇటీవలే దక్షిణాఫ్రికా జట్టుపై కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా టెస్టు సిరిస్‌ను 3-0తో గెలవడంపై అతడికి అభినందనలు తెలిపాడు. డివిలియర్స్ మాట్లాడుతూ "మేమిద్దరం మంచి స్నేహితులం. ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉంటాము. బాగా కలిసిపోతాము" అని అన్నాడు.

కోహ్లీ ఆటకు పెద్ద అభిమానిని

కోహ్లీ ఆటకు పెద్ద అభిమానిని

"కోహ్లీ ఆటకు నేనుఎప్పుడూ పెద్ద అభిమానిని. దక్షిణాఫ్రికా సిరిస్ తర్వాత అతడిని అభినందించడం తప్ప నాకు వేరే ఛాయిస్ లేదు. ఆ సిరిస్‌లో అతడు అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే, దురదృష్టవశాత్తు మాకు వ్యతిరేకంగా చేశాడు. నేను చివరగా కోహ్లీతే మాట్లాడింది అప్పుడే. అప్పుడు నేను అతడిని హెచ్చరించాను, మళ్లీ అలా జరగదు(నవ్వుతుంది)" అని ఏబీ చెప్పుకొచ్చాడు.

సఫారీ పర్యటన తర్వాత

సఫారీ పర్యటన తర్వాత

ఇదిలా ఉంటే, సఫారీ పర్యటన తర్వాత బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో పర్యటిస్తోంది. బంగ్లాతో మూడు టీ20ల సిరిస్‌ నుంచి సెలక్టర్లు విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. వరల్డ్‌కప్ తర్వాత నుంచి తీరిక లేకుండా క్రికెట్ ఆడుతోన్న నేపథ్యంలో పనిభారాన్ని దృష్టిలో పెట్టుకుని కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. బుధవారం కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా తన భార్యతో కలిసి భూటాన్ పర్యటనకు వెళ్లాడు.

Story first published: Wednesday, November 6, 2019, 15:20 [IST]
Other articles published on Nov 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X