న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అరంగేట్ర టెస్టు లార్డ్స్‌లో సెంచరీ చేయడంపై భయపడలేదన్న సౌరవ్ గంగూలీ

 I had no fear, just went and played: Sourav Ganguly on his hundred on Test debut at Lords

హైదరాబాద్: తన టెస్టు అరంగేట్రంలో భాగంగా లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో సాధించిన సెంచరీ తన కెరీర్‌లోనే ఉత్తమ ఇన్నింగ్స్ అని టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పాడు. ప్రముఖ క్రికెట్ ఎక్స్‌పర్ట్ బొరియా మజుందార్‌కి ఇచ్చిన ఇంటర్యూలో రెండు దశాబ్దాల క్రితం తన అరంగేట్ర టెస్టులో చేసిన తొలి సెంచరీని నెమరువేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ(131)తో చెలరేగడంతో టెస్టు డ్రాగా ముగిసింది. ఆ తర్వాత నాటింగ్ హామ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో సైతం గంగూలీ సెంచరీ సాధించాడు. దీంతో రెండో టెస్టు కూడా డ్రాగా ముగిసింది. అయితే, ఆ సిరిస్‌ను టీమిండియా 0-1తో చేజార్చుకుంది. అయితే, అరంగేట్రం టెస్టు మ్యాచ్‌ అనే భయం తనకు లేదని దాదా చెప్పుకొచ్చాడు.

Yearender 2019: అత్యధిక పరుగులు, సెంచరీలు, అవార్డులు: ఈ దశాబ్ధం కోహ్లీదే!Yearender 2019: అత్యధిక పరుగులు, సెంచరీలు, అవార్డులు: ఈ దశాబ్ధం కోహ్లీదే!

పూర్తి స్థాయిలో సిద్ధమై

పూర్తి స్థాయిలో సిద్ధమై

తాను పూర్తి స్థాయిలో సిద్ధమై ఇంగ్లాండ్‌కు వెళ్లినట్లు సౌరవ్ గంగూలీ వెల్లడించాడు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ "1996లో లార్డ్స్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌కు అసాధారణమైన మైండ్‌సెట్‌తో ఉన్నా. భయం లేకుండా, ఆ పర్యటనకు వెళ్లి ఆడాను. ఇంగ్లండ్‌ పర్యటనలో తొలి వార్మప్‌ మ్యాచ్‌కు బ్రిస్టల్‌ వెళ్లగా ఆ మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయ్యా" అని అన్నాడు.

రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 70 పరుగులు చేశా

"ఇక, రెండో ఇన్నింగ్స్‌లో అజేయంగా 70 పరుగులు చేశా. ఇలా ఆ సిరీస్‌లో పరిణితి చెందుతూనే ముందుకు సాగా" అని గంగూలీ తెలిపాడు. గుడ్ ఫామ్ లేదా బ్యాడ్ ఫామ్... నేను ఫాస్ట్‌ బౌలింగ్‌ను ఆడలేనని అభిమానులు ఎక్కువగా మాట్లాడుకునేవారు. నా చేతికి బ్యాట్‌ ఇస్తే పరుగులు చేయడమే తెలుసు. అది ఫాస్ట్‌ బౌలింగా.. స్పిన్‌ బౌలింగ్‌ అనేది నాకు తెలీదు" అని గంగూలీ అన్నాడు.

2002 నుంచి 2005 వరకు

2002 నుంచి 2005 వరకు

2002 నుంచి 2005 వరకు భారత టెస్ట్ జట్టుకు నాయకత్వం వహించి అత్యధిక టెస్ట్ విజయాలు (21) సాధించిపెట్టిన భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. అయితే, సౌరవ్ గంగూలీ తన అద్భుతమైన 16 ఏళ్ల కెరీర్‌లో భారత జట్టులో అనేక సార్లు పునరాగమనం చేశాడు. 1992లో ఫామ్ లేమి కారణంగా తొలిసారి జట్టు నుండి తొలగించబడ్డాడు.

దేశవాళీ క్రికెట్‌లో తానెంటో నిరూపించుకు

దేశవాళీ క్రికెట్‌లో తానెంటో నిరూపించుకు

ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో తానెంటో నిరూపించుకుని మళ్లీ భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక, తన కెరీర్ చివరి దశలో అంటే 2005లో తాను కెప్టెన్సీని కోల్పోయినప్పుడు మరోసారి జట్టులో నుంచి తొలగించబడ్డాడు. విమర్శకులు గంగూలీ పని అయిపోయిందని... అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి పనికిరాడని విమర్శించారు.

విమర్శలను ఓ సవాల్‌గా తీసుకుని

విమర్శలను ఓ సవాల్‌గా తీసుకుని

అయితే ఆ విమర్శలను ఓ సవాల్‌గా తీసుకుని ప్రపంచానికి తానెంటో చూపించాలని నిశ్చయించుకున్నాడు. దీంతో మరోసారి దేశీయ క్రికెట్‌లోకి వెళ్లి, బెంగాల్ తరఫున చాలా పరుగులు చేయడంతో 2007లో భారత జట్టులో తిరిగి అడుగుపెట్టాడు. 2008 అక్టోబరులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Story first published: Tuesday, December 24, 2019, 15:47 [IST]
Other articles published on Dec 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X