న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు సెలెక్ట్ కావాలని లేదు కానీ ఫినిషర్ అంటే ధోనీ తర్వాత నా పేరే గుర్తుకురావాలి : Riyan Parag

I dont want to be selected to Teamindia Now, I want to Become a player like Dhoni: Ryan Parag

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా జట్టు పెద్ద పెద్ద స్టార్లు లేకుండానే బరిలోకి దిగింది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరగబోయే టీ20 ప్రపంచ‌కప్‌లో జట్టులో ఉన్న ప్లేయర్ల బలాబలాలను తెలుసుకోవడానికి సెలెక్టర్లు అంతగా అనుభవం లేని ఆటగాళ్లను జట్టులో ఆడిస్తున్నారని ఓ వాదన ఉంది. ఇదిలా ఉండగా.. భారత జట్టుకు రానున్న రోజుల్లో బ్యాటర్‌గా ఎంపికయ్యే అవకాశం ఉన్న రియాన్ పరాగ్ ఇటీవల మాట్లాడుతూ.. తనకు ఇప్పుడే జాతీయ జట్టులో చోటు కావాలని ఆశించట్లేదని పేర్కొన్నాడు.

ఒకే సీజన్లో అర డజను మ్యాచ్‌లు గెలిపించాలి

ఒకే సీజన్లో అర డజను మ్యాచ్‌లు గెలిపించాలి

రియాన్ పరాగ్ ఐపీఎల్లో 2022 రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడాడు. ఇక ఫైనల్లో చివర్లో బ్యాటింగ్ దిగి హిట్టింగ్ చేయలేకపోయాడు. మంచి అటాకింగ్ గేమ్ ఆడగలిగే పరాగ్.. బ్యాటింగ్లో ఈసారి అంతగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే అతను ఫీల్డింగ్‌లో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉన్నాడు. ఈ ఏడాది అత్యధికంగా 17క్యాచ్‌లను అందుకున్నాడు. అయినప్పటికీ 20ఏళ్ల పరాగ్ అతను తన బ్యాటింగ్ ద్వారా తన జట్టుకు మరింత ప్రభావవంతమైన సహకారం అందించాలని భావిస్తున్నాడు. ఒక సీజన్‌లో దాదాపు 5,6 మ్యాచ్‌లను గెలిపించేలా తాను ఆడాలనే పట్టుదలతో ఉన్నాడు.

ఇప్పుడు నన్ను సెలెక్ట్ చేసినా నేను హ్యాపీగా ఫీల్ కాను

ఇప్పుడు నన్ను సెలెక్ట్ చేసినా నేను హ్యాపీగా ఫీల్ కాను

రియాన్ మాట్లాడుతూ.. 'జట్టుకు మ్యాచ్‌లను గెలిపించడం అంటే నాకిష్టం. నేను రెండు మ్యాచ్‌లలో అది చేయగలిగాను. కానీ అది సరిపోదు. జట్టు తరఫున 5, 6 మ్యాచ్‌లు మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేయాలి. అప్పుడే నేను ఓ లెక్కించదగ్గ ప్లేయర్ అవుతాను. ఇప్పుడే భారత జట్టుకు సంబంధించిన ప్రాబబుల్స్ (జాబితా)లో నా పేరు వచ్చినా కూడా నేను సంతోషించను. అది నిజానికి బాగుండదు, నేను ప్రస్తుతం టీమిండియాకు సెలెక్ట్ కావడానికి అర్హుణ్ని కాను. రాబోయే సీజన్‌లో నా జట్టుకు మరిన్ని విజయాలు అందించగలిగితే నా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పుడు నా ఆట చూసి వాళ్లే నన్ను తీసుకుంటారు. అని పరాగ్ స్పోర్ట్స్ టాక్‌తో తెలిపాడు.

ఫినిషర్ అనగానే ఇప్పుడు ధోనీ.. తర్వాత నా పేరు గుర్తుకురావాలి

ఫినిషర్ అనగానే ఇప్పుడు ధోనీ.. తర్వాత నా పేరు గుర్తుకురావాలి

ఇక ఐపీఎల్ 2022లో రాజస్థాన్ జట్టు తరఫున రియాన్ పరాగ్ కేవలం 183 పరుగులు మాత్రమే చేశాడు. అతను ఇంత తక్కువ స్కోరు చేయడానికి ప్రధాన కారణం.. అతను 5, 6 స్థానాల్లో బ్యాటింగ్ దిగడం వల్ల చాలా తక్కువ బంతులు మాత్రమే ఎదుర్కొవాల్సి వచ్చింది. అయినప్పటికీ తన బ్యాటింగ్ పట్ల ఏమాత్రం పరాగ్ హ్యాపీగా లేడు. "నా బ్యాటింగ్ స్థానం పట్ల కచ్చితంగా నాకు హ్యాపీగా ఉంది.

కానీ నేను బ్యాటింగ్‌ చేసిన తీరు పట్ల మాత్రం సంతోషంగా లేను. నేను 6-7 స్థానంలో స్థిరమైన ప్లేయర్‌గా పేరొందాలనుకుంటున్నాను. ఫినిషర్ అనగానే మనకు ఎంఎస్ ధోనీ పేరు మాత్రమే గుర్తుకు వస్తుంది. అలా ఓ ఫినిషర్‌గా నన్ను నేను తీర్చదిద్దుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, వచ్చే సంవత్సరం నుంచి మంచి బ్యాటింగ్ అమలు చేయగలనని ఆశిస్తున్నాను' అని పరాగ్ పేర్కొన్నాడు.

Story first published: Tuesday, June 14, 2022, 16:09 [IST]
Other articles published on Jun 14, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X