న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'న్యూజిలాండ్‌లో ఎక్కువ మంది అసహ్యించుకునే తండ్రిని నేనే'

I could be the most hated father in New Zealand, says dad of Ben Stokes

హైదరాబాద్: న్యూజిలాండ్ ఓటమి తనను తీవ్రంగా నిరాశపరించిందని ఇంగ్లాండ్ విజయంలో కీలకపాత్ర పోషించిన బెన్ స్టోక్స్ తండ్రి గెరార్డ్ అన్నాడు. ఆదివారం లార్డ్స్ వేదికగా చివరి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ తొలిసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఈ ఫైనల్‌కు ముందు మూడు ఫైనల్స్ ఆడిన ఇంగ్లండ్ జట్టు ఒక్కసారి కూడా కప్ గెలవలేకపోయింది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఆదివారం నాటి మ్యాచ్‌లో విజయం సాధించి 44 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ గెలవాలన్న కలను నెరవేర్చుకుంది. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ ఓటమికి కారణమైన బెన్ స్టోక్స్... ఈసారి మాత్రం సహచర క్రికెటర్లు ఒక్కొక్కరిగా వెనుదిరుగుతున్నా... అద్భుత ప్రదర్శన చేసిన ఇంగ్లీషు అభిమానుల ప్రపంచకప్ కలను నెరవేర్చాడు.

ఈ క్రమంలో ప్రపంచకప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుని కూడా అందుకున్నాడు. ఇంగ్లాండ్ విజయంపై బెన్ స్టోక్స్ తండ్రి గెరార్డ్ మాత్రం భిన్నంగా స్పందించాడు. ఈ సందర్భంగా గెరార్డ్ మాట్లాడుతూ "న్యూజిలాండ్‌లో ఎక్కువ మంది చేత ద్వేషింపబడే తండ్రిని నేనే కావొచ్చు. న్యూజిలాండ్ ఓటమి నన్నెంతో నిరాశకు గురిచేసింది" అని అన్నాడు.

"న్యూజిలాండ్ ట్రోఫీ లేకుండా వెనుదిరగడం నిజంగా సిగ్గుచేటు. ఇంగ్లాండ్‌ను గెలిపించిన స్టోక్స్‌ తండ్రిగా ఆనందంలో తేలియాడుతున్నా. బెన్ స్టోక్స్‌ కఠిన శ్రమకు ఈ మ్యాచ్‌తో ప్రతిఫలం లభించింది. అయితే, న్యూజిలాండ్‌ మద్దుతుదారుడిగా తీవ్ర నైరాశ్యంలో ఉన్నా" అని గెరార్డ్ తెలిపాడు. ఫైనల్లో గెరార్డ్ మాత్రం న్యూజిలాండ్ జట్టే గెలవాలని ప్రార్ధించాడు.

లార్డ్స్ వేదికంగా జరిగిన ఈ మ్యాచ్‌ని అయన స్వయంగా వీక్షించారు. ప్రతి నిమిషం న్యూజిలాండ్ జట్టు కోసం అయన దేవున్ని ప్రార్ధించాడు. కానీ చివరికి విజయం ఇంగ్లాండ్‌నే వరించింది. కాగా, బెన్ స్టోక్స్ న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో జన్మించిన సంగతి తెలిసిందే. స్టోక్స్‌కు పన్నెండేళ్లు వయసు వచ్చే సమయానికి గెరార్డ్ కుటుంబం నార్తర్న్‌ ఇంగ్లండ్‌కు వచ్చింది.

రగ్బీ లీగ్‌ కోచింగ్‌ కాంట్రాక్ట్‌ నిమిత్తం అతడి తండ్రి గెరార్డ్‌ కుటుంబంతో సహా ఇంగ్లాండ్‌కు వచ్చి స్థిరపడిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌కు వలస వచ్చిన బెన్ స్టోక్స్ ఇక్కడ స్టార్‌ ఆల్‌రౌండర్‌గా ఎదిగాడు.

Story first published: Monday, July 15, 2019, 18:49 [IST]
Other articles published on Jul 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X