న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

3-0తో గెలిచాం.. సంతోషంగా బ్రేక్‌ తీసుకుంటా: వన్డే సిరిస్ విజయానంతరం కోహ్లీ

India Vs New Zealand : Virat Kohli After India Win ODI Series Vs New Zealand | Oneindia Telugu
I can enjoy my break now: Virat Kohli after India win ODI series vs New Zealand

హైదరాబాద్: ఆతిథ్య జట్టు న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా క్లీన్‌స్వీప్‌ చేస్తుందని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. సోమవారం జరిగిన మూడో వన్డేలో భారత్‌ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో మరో రెండు వన్డేలు మిగిలుండగానే టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది.

India vs New Zealand: 'గిల్‌లో 10 శాతం కూడా లేను'India vs New Zealand: 'గిల్‌లో 10 శాతం కూడా లేను'

టీమిండియాకు ఇది వరుసగా రెండో సిరిస్ విజయం. వన్డే సిరీస్‌ గెలవడంతో సంతోషంగా బ్రేక్‌ తీసుకుంటానని విరాట్ కోహ్లీ చెప్పాడు. మూడో వన్డే అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ "చివరి రెండు వన్డేల్లోనూ మేము విజయం సాధిస్తాం. చాలా రోజుల నుంచి బ్రేక్‌ తీసుకోలేదు. ఆస్ట్రేలియా పర్యటనతో ఊపిరి సలపకుండా గడిపాం. అందుకే విరామం తీసుకుంటున్నాను" అని అన్నాడు.

వన్డే సిరీస్‌ను 3-0తో గెలిచాం

వన్డే సిరీస్‌ను 3-0తో గెలిచాం

"న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను 3-0తో గెలిచాం కాబట్టి సంతోషంగా బ్రేక్‌ తీసుకుంటా. విరామ సమయాన్ని బాగా గడుపుతాను. ఎవరో ఒకరు మన స్థానాన్ని భర్తీ చేస్తారు. మనం ఉన్నా లేకున్నా ఆట కొనసాగుతుంది. ప్రస్తుతానికి జట్టు కూర్పు గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని కోహ్లీ వెల్లడించాడు.

నాలుగో నంబర్‌లో

నాలుగో నంబర్‌లో

"నాలుగో నంబర్‌లో బలమైన బ్యాట్స్‌మన్ ఉండాలని భావించాం. ఆ స్థానంలో రాయుడు ఆడుతున్న తీరు అద్భుతం. దినేశ్ కార్తీక్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఏ క్షణమైనా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉంటాడు. మిడిలార్డర్‌లో ధోనీ బంతిని బాగా బాదుతున్నాడు. ఈ మూడు మ్యాచ్‌లను బట్టి చూస్తే ఇక బ్యాటింగ్ బాధలు తీరినట్లే" అని కోహ్లీ వెల్లడించాడు.

పాండ్యా రాకతో జట్టులో సమతుల్యం

పాండ్యా రాకతో జట్టులో సమతుల్యం

"పాండ్యా రాకతో జట్టులో సమతుల్యం వచ్చింది. అతను తల దించుకునే ఉన్నాడు. కానీ, జట్టుకు ఏం అవసరమో అది చేసి చూపించాడు. ఈ రోజు బాధ్యతగా అతను ఆడిన తీరు అమోఘం. శుభ్‌మాన్, విజయ శంకర్ వంటి యువ ప్రతిభావంతులు జట్టుతో చేరడం చాలా ఆనందాన్నిస్తున్నది. కుర్రాళ్లకు మరిన్ని అవకాశాలు ఇచ్చి వాళ్ల సేవలను మరింతగా వినియోగించుకోవాలి" అని కోహ్లీ అన్నాడు.

కోహ్లీ స్థానంలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ

కోహ్లీ స్థానంలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ

సెలెక్టర్లు విశ్రాంతి కల్పించడంతో చివరి రెండు వన్డేలతో పాటు మూడు టీ20ల సిరిస్‌కు కోహ్లీ అందుబాటులో ఉండడం లేదు. కాగా, కోహ్లీ స్థానంలో భారత జట్టుకు కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ వ్యవహరించనున్నాడు.

Story first published: Tuesday, January 29, 2019, 10:55 [IST]
Other articles published on Jan 29, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X