వేడి పుట్టిస్తోంది!: బికినీలో అనుష్క శర్మ, అర్ధనగ్నంగా విరాట్ కోహ్లీ

Virat Kohli Hottest Selfie With Anushka Sharma || Oneindia Telugu

హైదరాబాద్: వెస్టిండిస్ పర్యటన అనంతరం లభించిన విశ్రాంతి సమయాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. వెస్టిండిస్ పర్యటనను ముగించుకుని భారత్‌కు చేరుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం సరదాగా గడుపుతున్నాడు.

చేతికి వేసుకున్న పట్టీలతో: డేవిడ్ వార్నర్ గురించి కుక్ బయోగ్రఫీలో సంచలనం

ఇందులో భాగంగా విరాట్ కోహ్లీ తన ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఫోటో ఓ బీచ్ దగ్గర దిగినది కావడం విశేషం. అందులో అనుష్క శర్మ బికినీని ధరించగా... విరాట్ కోహ్లీ అర్ధనగ్నంగా కనిపిస్తున్నాడు. అంతేకాదు కోహ్లీ అనుష్క ఒడిలో సేదతీరుతున్నాడు.

విండిస్ పర్యటనను క్లీన్ స్వీప్

కాగా, వెస్టిండిస్ పర్యటనను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా త్వరలో సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో తలపడనుంది. సెప్టెంబర్ 15న ధర్మశాల వేదికగా జరగనున్న తొలి టీ20తో భారత్‌లో సఫారీ పర్యటన ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా దక్షిణాఫ్రికా జట్టు 3 టీ20లు, 3 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.

తొలుత మూడు టీ20ల సిరిస్

తొలుత మూడు టీ20ల సిరిస్

ఈ పర్యటనలో భాగంగా తొలుత మూడు టీ20ల సిరిస్ జరుగుతుండగా.. ఆ తర్వాత అక్టోబర్ 2 నుంచి మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది. టీ20 సిరిస్‌కు ధర్మశాల, మొహాలి(సెప్టెంబర్ 18), బెంగళూరు(సెప్టెంబర్ 22) వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో తొలి టెస్టుకు విశాఖపట్నం(అక్టోబర్ 2-6) ఆతిథ్యమిస్తోంది.

రేడియోలో లైవ్‌ కామెంటరీ

రేడియోలో లైవ్‌ కామెంటరీ

ఆ తర్వాత పుణె(అక్టోబర్ 10-14), రాంచీ(అక్టోబర్ 19-23) వేదికలు ఆతిథ్యమిస్తున్నాయి. ఇదిలా ఉంటే, టీమిండియా మ్యాచ్‌లను లైవ్ కామెంటేటరీగా అందించేందుకు గాను అల్ ఇండియా రేడియోతో బీసీసీఐ రెండేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకుంది. 15న ధర్మశాలలో భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగే తొలి టీ20తో రేడియోలో లైవ్‌ కామెంటరీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

బీసీసీఐతో ఆల్ ఇండియా రెండేళ్ల ఒప్పందం

అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు రంజీ, సయ్యద్‌ ముస్తాక్‌ అలీ, ఇరానీ, మహిళల చాలెంజర్స్‌ కప్‌ వంటి దేశవాళీ మ్యాచ్‌ల లైవ్‌ కామెంటరీని కూడా ఆలిండియా రేడియో అందించనుంది. బీసీసీఐతో ఆల్ ఇండియా రెండేళ్ల ఒప్పందం సెప్టెంబర్ 10, 2019 నుంచి ఆగస్టు 31, 2021 వరకు ఉంటుంది.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, September 11, 2019, 13:09 [IST]
Other articles published on Sep 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X