న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆకలి అని అడిగిన వాళ్లకు ఈ పార్శిల్ ఇవ్వండి: హార్దిక్ పాండ్యా

Heart of Gold! When Hardik Humble Pandya Won Hearts of Hotel Staff After Loss

హైదరాబాద్: భారత యువ క్రికెటర్‌ హార్దిక్‌ పాండ్యా తను తినడానికి తిండి కూడా లేకుండా గడిపిన రోజులు చాలా ఉన్నాయంటూ పలు సందర్భాల్లో చెప్పాడు. అలాంటి పాండ్యా సాధ్యమైనంత వరకూ ఏదో ఒకలా సాయం చేస్తూనే ఉంటాడు. తాజాగా ఓ హోటల్‌కు వెళ్లిన పాండ్య అక్కడి నుంచి ఓ ఫుడ్‌ పార్శిల్‌ తీసుకువచ్చి ఎవరైనా భోజనం కోసం వస్తే ఈ ప్యాకెట్‌ ఇవ్వండని సిబ్బందికి చెప్పాడట.

కోహ్లీకి చక్కని భాగస్వామ్యం అందించి మంచి పరుగులు

కోహ్లీకి చక్కని భాగస్వామ్యం అందించి మంచి పరుగులు

ప్రస్తుతం పాండ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ కోసం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తోన్న టీమిండియాలో ఒకడిగా రాణిస్తున్నాడు. సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య శనివారం బర్మింగ్‌ హామ్‌ వేదికగా తొలి టెస్టు ముగిసింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ సేన 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అంతా అవుట్ అయిపోతున్నా.. క్రీజులో పాతుకుపోయిన కోహ్లీకి చక్కని భాగస్వామ్యం అందించి మంచి పరుగులు వచ్చేలా తోడ్పడ్డాడు.

పార్శిల్ ఎలా వచ్చిందంటే:

పార్శిల్ ఎలా వచ్చిందంటే:

ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న పాండ్య ఒక రోజు సహచర ఆటగాళ్లు కేఎల్‌ రాహుల్‌, ఇషాంత్‌ శర్మతో కలిసి డిన్నర్‌కి బయటకు వెళ్లాడు. కొన్ని గంటల తర్వాత వారు తిరిగి బస చేసిన హోటల్‌కు వచ్చారు. కారులో నుంచి దిగిన ఇషాంత్‌, కేఎల్‌ రాహుల్‌ వారి వారి గదులకు వెళ్లారు. చేతిలో ఓ కవర్‌తో హోటల్‌లోకి వచ్చిన పాండ్య నేరుగా అక్కడ ఉన్న సిబ్బంది వద్దకు వెళ్లాడు.

పార్శిల్‌లో భోజనం మేము ముట్టుకోలేదు

పార్శిల్‌లో భోజనం మేము ముట్టుకోలేదు

‘ఈ పార్శిల్‌లో భోజనం ఉంది. మేము దీన్ని ముట్టుకోలేదు. ఎవరైనా మీ హోటల్‌ వద్దకు వచ్చి తినడానికి ఏదైనా పెట్టండి అని అడిగితే దీన్ని వారికి అందజేయండి' అని చెప్పి ప్యాకెట్‌ను పాండ్య వారికి అందజేశాడట. దీనికి వారు ‘అలాగే సార్‌... తప్పకుండా'అని బదులిచ్చారట. జులై 30న చోటు చేసుకున్న ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

పూజారాని తప్పించడంపై విమర్శలు రావడంతో

పూజారాని తప్పించడంపై విమర్శలు రావడంతో

ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పాండ్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆగస్టు 9న రెండో టెస్టు ప్రారంభంకానుంది. లండన్‌లో ఈ టెస్టు జరగనుంది. మొదటి టెస్టుపై పూజారాని తప్పించడంపై విమర్శలు రావడంతో రెండో టెస్టుకు అతన్ని జట్టులోకి తీసుకుంటారేమోనని టీమిండియా అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే యథావిధిగా పాత జట్టునే కొనసాగించమని మాజీ కెప్టెన్ గంగూలీ చెప్తుంటే.. మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీసుకోమని సూచిస్తున్నాడు.

Story first published: Monday, August 6, 2018, 15:18 [IST]
Other articles published on Aug 6, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X