న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాత్రికి రాత్రే కెప్టెన్ కాలేదు.. నన్ను చాలా కాలం పరిశీలించారు: కోహ్లీ

He played a big role: Virat Kohli names the person who helped him become captain

ముంబై: తాను భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌ కావడం రాత్రికి రాత్రి జరగలేదని విరాట్‌ కోహ్లీ అన్నాడు. ఆ ప్రక్రియ ఆరేడేళ్ల పాటు సాగిందని, అందులో మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ కీలకంగా వ్యవహరించాడన్నాడు. ధోనీ కెప్టెన్సీలో చాన్నాళ్లు క్రికెట్‌ ఆడటం తనకు ఉపయోగ పడిందని ప్రస్తుత కెప్టెన్‌ కోహ్లీ పేర్కొన్నాడు. ధోనీ వారసుడిగా జట్టు పగ్గాలు చేపట్టిన కోహ్లీ.. ఇప్పటికే తన సత్తాను నిరూపించుకున్నాడు. అద్భుత ఆటతీరుతో పాటు కెప్టెన్‌గానూ టీమిండియాను ఉన్నత స్థానంలో నిలిపాడు.

ఖేల్‌ రత్నకు రోహిత్ శర్మ‌.. అర్జునకు శిఖర్ ధావన్!!ఖేల్‌ రత్నకు రోహిత్ శర్మ‌.. అర్జునకు శిఖర్ ధావన్!!

కెప్టెన్‌ కావడంలో కీలక పాత్ర ధోనీదే

కెప్టెన్‌ కావడంలో కీలక పాత్ర ధోనీదే

భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ ద్వారా విరాట్‌ కోహ్లీ శనివారం ముచ్చటించాడు. ఈ సందర్భంగా పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. 'నేను కెప్టెన్‌ కావడంలో కీలక పాత్ర ఎంఎస్ ధోనీదే. అయితే ధోనీ నేరుగా సెలక్టర్ల వద్దకెళ్లి ఇతను తర్వాతి కెప్టెన్‌ అంటూ నా పేరు చెప్పడం జరగలేదు. నన్ను చాలా కాలం పరిశీలించాడు. ఇతను బాధ్యత తీసుకుంటాడా లేదా అని చూసి, తర్వాత ఏం చేయాలో నేర్పిస్తూ కెప్టెన్సీ బదిలీ ప్రక్రియను నెమ్మదిగా కానిచ్చారు' అని కోహ్లీ తెలిపాడు.

రాత్రికి రాత్రే ఎవరు నాయకులు కాలేరు

రాత్రికి రాత్రే ఎవరు నాయకులు కాలేరు

'ధోనీ, జట్టు యాజమాన్యం ఆరేడేళ్ల పాటు నమ్మకాన్ని చూరగొన్నారు. నేనెప్పుడూ మహీ భాయ్ పక్కనే ఉంటూ ఆయా సందర్భాల్లో ఏం చేయొచ్చో చెప్పేవాణ్ని. అభిప్రాయాలడిగేవాణ్ని. ధోనీ తీసుకునే నిర్ణయాలను గమనిస్తూ ముందుకు సాగా. అయితే నేను చెప్పే చాలా ఆలోచనల్ని మహీ వ్యతిరేకించేవాడు. అలాగే ఎన్నో విషయాలు నాతో చర్చించేవాడు. చివరికి తన తర్వాత నేను బాధ్యత తీసుకోగలని అతడికి నమ్మకం కలిగింది. అంతేకాని అంతేకాని రాత్రికి రాత్రే ఎవరు నాయకులు కాలేరు' అని విరాట్ చెప్పాడు.

మంచి వ్యక్తిగా అనుష్కనే మార్చింది

మంచి వ్యక్తిగా అనుష్కనే మార్చింది

తన భార్య అనుష్క శర్మపై విరాట్‌ మరోసారి ప్రశంసల వర్షం కురిపించాడు. తనను మరింత మంచి వ్యక్తిగా అనుష్కనే మార్చిందని అన్నాడు. అనుష్కకు దేనిపైన అయినా నమ్మకం కుదిరితే ఏమాత్రం భయం లేకుండా ముందుకెళ్లిపోతుంది. మనుషుల్ని చాలా బాగా అర్థం చేసుకుంటుంది. కొన్నిసార్లు నేను ఏం మాట్లాడకున్నా.. నా శరీర భాషను బట్టి నా మనసు తెలుసుకుంటుంది. మా ఇద్దరి ఆలోచనలు కూడా ఒకే రకంగా ఉండటం కూడా ఇందుకు దోహదపడుతుంది' అని కోహ్లీ పేర్కొన్నాడు. తనకు గ్రహాంతర వాసులకు సంబంధించిన అంశాలంటే అమితమైన ఆసక్తి అని, ఎగిరే పళ్లేలను చూడాలన్నది తన లక్ష్యమని విరాట్‌ చెప్పుకొచ్చాడు.

 అంతర్జాతీయ క్రికెట్‌లో 21,901 పరుగులు

అంతర్జాతీయ క్రికెట్‌లో 21,901 పరుగులు

విరుష్క జోడీ 2013లో ఓ షాంపూ ప్రకటన కోసం చేసిన చిత్రీకరణలో మొదటిసారి కలుసుకున్నారు. 4 సంవత్సరాల తరువాత 2017, డిసెంబర్ 11 విరాట్-అనుష్క ఇటలీలో వివాహం చేసుకున్నారు. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.

Story first published: Sunday, May 31, 2020, 9:48 [IST]
Other articles published on May 31, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X