న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీని చాలా మిస్సవుతున్నా.. మళ్లీ ఆ రోజులు రావాలి: స్టార్ క్రికెటర్

He likes to sit with everyone and have dinner: Mohammed Shami says players miss MS Dhoni’s presence

ఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీని చాలా మిస్సవుతున్నా అని భారత జట్టు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ పేర్కొన్నాడు. తాను మాత్రమే కాదు జట్టులోని చాలా మంది ఇదే భావనలో ఉన్నట్లు చెప్పాడు. మహీ భాయ్ అందరితో కూర్చొని డిన్నర్‌ చేయడానికి ఇష్టపడతాడని, ఆ విషయం తనకెంతో నచ్చుతుందని షమీ తెలిపాడు. గత సంవత్సరం 2019 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ తరవాత నుంచి ధోనీ క్రికెట్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.

'విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ చూసి.. నా మీద నాకే సిగ్గేసింది''విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్ చూసి.. నా మీద నాకే సిగ్గేసింది'

 ధోనీని చాలా మిస్సవుతున్నా:

ధోనీని చాలా మిస్సవుతున్నా:

మంగళవారం ఇన్‌స్టా లైవ్‌లో పాల్గొన్న మొహమ్మద్ షమీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఐపీఎల్ మినహా అన్ని ఫార్మాట్లలో ఎంఎస్ ధోనీతో కలిసి ఆడాను. మనం అతడితో ఉన్నప్పుడు ధోనీతో ఉన్న భావన సహచరులలో కలిగేలా ప్రవర్తించరు. అతడు చాలా పెద్ద ఆటగాడు. నాకు అతడితో చాలా అనుభవాలున్నాయి. ధోనీని చాలా మిస్సవుతున్నా. ఇప్పుడు కూడా మహీ భాయ్ మళ్లీ వస్తాడని అనుకుంటున్నాం. అతడితో ఆడటం సరదాగా ఉంటుంది' అని ధోని వ్యక్తిత్వాన్ని షమీ పొగిడాడు. జూనియర్స్‌కు ధైర్యం చెబుతాడు, అదేవిధంగా సీనియర్స్‌కు వారి బాధ్యతలను గుర్తుచేస్తాడని పేర్కొన్నాడు.

మళ్లీ ఆ రోజులు రావాలని కోరుకుంటున్నా:

మళ్లీ ఆ రోజులు రావాలని కోరుకుంటున్నా:

మాజీ కెప్టెన్ ధోనీ ఎప్పుడూ ఒంటరిగా ఉండడని, అతడి చుట్టూ ఎవరోఒకరు ఉంటారని పేసర్ షమీ చెప్పాడు. 'ధోనీ అందరితో కూర్చొని డిన్నర్‌ చేయడానికి ఇష్టపడతాడు. ఆ విషయం నాకెంతో నచ్చుతుంది. అతడి చుట్టూ ఎప్పుడూ ఇద్దరు లేదా నలుగురు వ్యక్తులు ఉంటారు. రాత్రంతా మేము మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్కోసారి మ్యాచ్ ప్రణాళికల గురించి, మరోసారి సరదాగా మాట్లాడుకుంటాం. అవన్నీ ఇప్పుడు మిస్‌ అవుతున్నాం. మళ్లీ ఆ రోజులు రావాలని కోరుకుంటున్నా' అని ఈ ఫాస్ట్ బౌలర్‌ షమీ చెప్పుకొచ్చాడు.

 ధోనీ నెవర్ రిటైర్స్:

ధోనీ నెవర్ రిటైర్స్:

గత బుధవారం 'ధోనీ రిటైర్స్' అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ ‌మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాక్షి స్పందించారు. అవన్నీ పుకార్లే అని.. ఈ లాక్‌డౌన్‌ కారణంగా కొందరి మానసిక స్థితి దెబ్బతిన్నది అంటూ సాక్షి ట్వీట్ చేసారు. కొంత సమయం తర్వాత సాక్షి ఆ ట్వీట్‌ని డిలీట్ చేసారు. ఆ మరుసటి రోజు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీతో పాటు ధోనీ అభిమానులు 'ధోనీ నెవర్ రిటైర్స్' అనే హ్యాష్‌ట్యాగ్‌ని వైరల్ చేసి.. ధోనీ రిటైర్‌మెంట్‌పై వచ్చిన వార్తలకు చెక్ పెట్టారు.

అప్పటినుండి టీమిండియా జెర్సీ ధరించలేదు:

అప్పటినుండి టీమిండియా జెర్సీ ధరించలేదు:

ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌-2019 అనంతరం ఎంఎస్ ధోనీ మళ్లీ టీమిండియా జెర్సీ ధరించలేదు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో మహీ ప్రదర్శన ఆధారంగా తిరిగి జట్టులోకి వస్తాడని అందరూ భావించారు. కానీ కరోనా వైరస్ లాక్‌డౌన్‌ కారణంగా ఐపీఎల్‌ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ పునరాగమనంపై సస్పెన్స్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ధోనీ రిటైర్మెంట్‌పై, భవిష్యత్‌ ప్రణాళికలపై సోషల్‌ మీడియాలో అనేక వార్తలు వస్తున్నప్పటికీ అతడు ఇప్పటిరకు స్పందించలేదు. జులై నుంచి క్రికెట్‌ మ్యాచ్‌లు తిరిగి ప్రారంభంపై చర్చలు జరుగుతున్నాయి. కానీ ఐపీఎల్ విషయంలో ఏం జరుగుతుందన్నది తెలియాల్సి ఉంది.

Story first published: Wednesday, June 3, 2020, 13:11 [IST]
Other articles published on Jun 3, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X