న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఆరాధించే వ్యక్తితో కోహ్లీని పోల్చొద్దు'

He idolised Sachin, dont compare both: Kohlis childhood coach

హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్, దిగ్గజ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌తో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పోల్చవద్దని అతని చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అన్నారు. ప్రముఖ ఇంగ్లీష్ మీడియాతో ఆయన శనివారం మాట్లాడారు. కోహ్లీ గురించి పలు విషయాలను పంచుకున్నారు.

 వేర్వేరు తరాల ఆటగాళ్లని పోల్చి చూడలేం

వేర్వేరు తరాల ఆటగాళ్లని పోల్చి చూడలేం

‘వాళ్లిద్దరినీ పోల్చి చూడాలని నేను అస్సలు అనుకోను. సచిన్ గొప్ప బ్యాట్స్‌మన్. అతని పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. విరాట్ మూడు ఫార్మాట్లలోనూ నిలకడగా రాణిస్తున్నాడు. ఇది అతనికి గొప్ప విజయం. కానీ విరాట్‌కు సచిన్ ఆరాధ్యుడు. ఇద్దరు వేర్వేరు తరాల ఆటగాళ్లు. వారిద్దరినీ పోల్చి చూడలేం' అని రాజ్‌కుమార్ వెల్లడించారు.

ధావన్, రోహిత్ కచ్చితంగా చెలరేగి

ధావన్, రోహిత్ కచ్చితంగా చెలరేగి

‘టీ20 ఫార్మాట్ వాళ్లకు(వెస్టిండీస్) బాగా సరిపోతుంది. ఈ ఫార్మాట్‌‌లో వాళ్లు చాలా ప్రమాదకరం. ఇటీవల జరిగిన వన్డే సిరీస్ తొలి మూడు మ్యాచుల్లో వాళ్లు ఎలా ఆడారో చూశాం. ఇప్పుడు అండ్రీ రసెల్, కార్లోస్ బ్రాత్‌వైట్, కీరన్ పొలార్డ్ జట్టులోకి వచ్చారు. ఈ ఆటగాళ్లు వాళ్లదైన రోజున చేతుల్లో మ్యాచ్‌ను లాగేసుకుంటారు. మిడిలార్డర్ బలహీనంగా ఉంది కాబట్టి శిఖర్ ధావన్, రోహిత్ శర్మ కచ్చితంగా చెలరేగి ఆడాలి' అని రాజ్‌కుమార్ తెలిపారు.

టీ20 సిరీస్‌కు ఎంపికైన కృనాల్‌ను పొగడ్తలతో

టీ20 సిరీస్‌కు ఎంపికైన కృనాల్‌ను పొగడ్తలతో

వెస్టిండీస్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శిఖర్ ధావన్, రోహిత్ శర్మలపై పెద్ద బాధ్యతే ఉందని రాజ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. టీ20 సిరీస్‌కు ఎంపికై షాబాజ్ నదీమ్, కృనాల్ పాండ్యను రాజ్ కుమార్ పొగడ్తలతో ముంచెత్తారు. అలాగే, రాబోయే ఆస్ట్రేలియా పర్యటనలో విరాట్ కోహ్లీ ఆట ఎలా ఉండబోతోందో కూడా రాజ్ కుమార్ వెల్లడించారు.

విరాట్ దూకుడుగా ఆడగలడు

విరాట్ దూకుడుగా ఆడగలడు

‘ఆస్ట్రేలియా గడ్డపై అగ్రెసివ్ క్రికెట్ ఆడాలి. అక్కడ వికెట్‌పై బంతి ఏ విధంగా వస్తుందో అంచనా వేయాలి. విరాట్ అక్కడ దూకుడుగా ఆడగలడు. అక్కడ వికెట్‌పై బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. కానీ అది అతనికి అడ్డంకి కానేకాదు' అని తన శిష్యుడిపై రాజ్ కుమార్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.

Story first published: Sunday, November 4, 2018, 14:02 [IST]
Other articles published on Nov 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X