న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హెచ్‌సీఏ గౌరవానికి భంగం.. అంబటి రాయుడిపై చట్టపరమైన చర్యలు?

HCA set to take legal action against Ambati Rayudu over alleged defamatory tweet

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ)కు వ్యతిరేకంగా టీమిండియా సీనియర్ క్రికెటర్‌ అంబటి రాయుడి చేసిన వ్యాఖ్యలు అతనిపై చర్యలు తీసుకునేలా చేశాయి. తాజాగా హెచ్‌సీఏ అవినీతిని ప్రశ్నించిన రాయుడిపై నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటామని హెచ్‌సీఏ సభ్యులు తెలిపారు. హెచ్‌సీఏలో అవినీతిపై అంబటి రాయుడు తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ట్విటర్‌లో విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

'ఏడాదిలో చాలా మ్యాచ్‌లు ఉంటాయి.. ఫిట్‌గా ఉంటే అవకాశం తప్పకుండా వస్తుంది''ఏడాదిలో చాలా మ్యాచ్‌లు ఉంటాయి.. ఫిట్‌గా ఉంటే అవకాశం తప్పకుండా వస్తుంది'

రాయుడిపై చర్యలు:

రాయుడిపై చర్యలు:

'హెచ్‌సీఏ గౌరవానికి భంగం కలిగించిన రాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. నిబంధనల ప్రకారమే మేము నడుచుకుంటాం. మొదటగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సీఈవోను ఆదేశిస్తాం. నివేదిక సమర్పించిన తర్వాత అత్యున్నత మండలి అతనిపై అవసరమైన చర్యలు తీసుకుంటుంది' అని హెచ్‌సీఏ కార్యదర్శి ఆర్‌ విజయానంద్‌ మీడియాకు తెలిపారు.

రాయుడికి మద్దతు:

రాయుడికి మద్దతు:

ఇదిలా ఉంటే.. హెచ్‌సీఏలోని కొందరు అధికారులు, క్రికెటర్లు రాయుడికి మద్దతుగా నిలుస్తున్నారు. 'రాయుడు తప్పు చేయలేదు. శిక్షించే బదులు అసలు నిజమేంటో తెలుసుకోవాలి. ఇంతకు రాయుడు ఏం తప్పు చేశాడు?. ఏమైనా అవినీతికి పాల్పడ్డాడా?. అతడు తన బాధను వ్యక్తీకరించాడు. అధికారులు అతడి మాటలను వినాలి' అని హైదరాబాద్‌ మాజీ స్పిన్నర్‌ కవల్‌జీత్‌ సింగ్‌ పేర్కొన్నాడు.

ఫిర్యాదులే నిదర్శనం:

ఫిర్యాదులే నిదర్శనం:

'సెలక్షన్‌ వ్యవహారాల్లో అవినీతి ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. గత ఏడాదిగా ఆటగాళ్లు, తల్లిదండ్రుల నుంచి అందుతున్న ఫిర్యాదులే అందుకు నిదర్శనం. మంచి ఆటగాళ్లకు సహాయం అందడం లేదు. ప్రతిభపై డబ్బు పైచేయి సాధించింది' అని హెచ్‌సీఏ మాజీ తాత్కాలిక కార్యదర్శి ఎస్‌ వెంకటేశ్వరన్‌ అన్నారు.

అసహన క్రికెటర్‌:

అసహన క్రికెటర్‌:

'కేటీఆర్‌ సర్‌.. హెచ్‌సీఏలో పేరుకుపోయిన అవినీతిపై దృష్టి పెట్టి నిర్మూలించాలని కోరుతున్నా' అని రాయుడు ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ను కోరిన విషయం తెలిసిందే. డబ్బుతో పాటు ఎన్నో ఏసీబీ కేసులు ఎదుర్కొంటున్న అవినీతి పరుల ప్రభావం పడ్డ జట్టుతో హైదరాబాద్‌ క్రికెట్‌ గొప్పగా ఎలా ఎదుగుతుందని ప్రశ్నించాడు. ఈ ట్వీట్‌పై హెచ్‌సీఏ అధ్యక్షుడు మహమ్మద్ అజారుద్దీన్‌ స్పందిస్తూ... రాయుడు 'అసహన క్రికెటర్‌' అని అన్నాడు.

వ్యక్తిగతంగా తీసుకోవద్దు:

వ్యక్తిగతంగా తీసుకోవద్దు:

అజహరుద్దీన్‌ వ్యాఖ్యలపై రాయుడు స్పందించాడు. 'హాయ్‌ అజహరుద్దీన్‌. ఈ విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఇది మనిద్దరి కన్నా చాలా పెద్దది. హెచ్‌సీఏలో ఏం జరుగుతుందో మనిద్దరికీ తెలుసు. కుట్రలకు దూరంగా ఉంటూ నిపాక్షికంగా వ్యవహరిస్తారని నమ్ముతున్నా. హైదరాబాద్‌ క్రికెట్‌ను ప్రక్షాళన చేసే అవకాశం మీకుంది. భవిష్యత్‌ క్రికెటర్లను కాపాడతారని ఆశిస్తున్నా' అని ట్విటర్‌లో రాయుడు రాసుకొచ్చాడు.

Story first published: Thursday, November 28, 2019, 13:06 [IST]
Other articles published on Nov 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X