న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: ప్రముఖ క్రికెట్ కామెంటేటర్‌ హర్షా భోగ్లేపై దాడి? లైవ్‌ జరుగుతుండగానే..?

Harsha Bhogle says Sorry to have got you worried over his viral Instagram live

న్యూఢిల్లీ: ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, తెలుగు వ్యక్తి హర్షా భోగ్లేపై దాడి జరిగిందన్న వార్త గత 24 గంటలుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ అభిమానులంతా హర్షాకు ఏమైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2022 సీజన్ నేపథ్యంలో క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ అనే చానెల్‌ నిర్వహించిన ఇన్‌స్టా లైవ్‌లో చీఫ్ గెస్ట్‌గా పాల్గొన్న హర్షా అకస్మాత్తుగా స్క్రీన్‌పై కనిపించకుండా పోయాడు. అతనిపై ఎవరో దాడి చేసినట్టు అరుపులు, కేకలు వినిపించడంతో అందరూ ఒక్కసారి షాక్‌కు గురయ్యారు. ఆ చానెల్ హోస్ట్ సైతం హర్షాపై ఎవరో దాడి చేసినట్లున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంతా టెన్షన్ పడ్డారు.

హర్షాకు ఏమైందంటూ..

హర్షా భోగ్లేకు ఏమైంది అంటూ నెటిజన్లు ఆరాతీయడం మొదలు పెట్టారు. హర్షాపై ఎవరు దాడి చేశారు..? ఎందుకు చేశారు..? అని ట్వీట్స్ చేశారు. దీనికి మరింత హైప్‌ పెంచుతూ క్రికెట్ స్పోర్ట్ వాక్ ఇన్ ఛానెల్.. 'హర్షా భోగ్లేకి ఏమైందో, అక్కడేం జరిగిందో మాకు తెలియదు. తెలుసుకునేందుకు హర్షా భోగ్లేటీమ్‌తో సంప్రదింపులు చేస్తున్నాం. త్వరలో మీకు సమాచారం ఇస్తాం'అంటూ ట్వీట్ చేసి అభిమానుల ఆందోళనను రెట్టింపు చేసింది. చివరకు ఇదంతా ఓ ప్రాంక్ అని తేలింది. చానెల్‌కు హైప్ తెచ్చేందుకు హర్షాతో కలిసి ఆ ప్రోగ్రామ్ నిర్వాహకులు ప్లే చేసిన చీప్ ట్రిక్ అని తెలిసింది.

క్షమాపణలు చెప్పిన హర్షా..

క్షమాపణలు చెప్పిన హర్షా..

ఇక ఈ వ్యవహారంపై స్పందించిన హర్షా అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. తనపై ఎలాంటి దాడి జరగలేదని క్లారిటీ ఇచ్చాడు.'నేను క్షేమంగానే ఉన్నాను. ఎవ్వరూ ఆందోళన చెందకండి. వాస్తవానికి నాపై ఎలాంటి దాడి జరగలేదు. సదరు వీడియోలో మేము అనుకున్నది ఒకటైతే, మరొకటి జరిగింది. ఉద్దేశపూర్వకంగా ఎవ్వరిని ఇబ్బంది పెట్టాలని ఇలా చేయలేదు. ఏది ఏమైనప్పటికీ అందరిని క్షమాపణలు కోరుతున్నాను, నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నా. మీ ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు. సారీ అండ్ ఛీర్స్' అంటూ హర్షా ట్వీట్ చేశాడు.

మన హైదరాబాదే..

మన హైదరాబాదే..

హర్షా భోగ్లే హైదరాబాద్‌కు చెందిన వ్యక్తనే విషయం తెలిసిందే. మరాఠీ కుటుంబంలో పుట్టిన అతను హైదరాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌‌లో ప్రాథమిక విద్య, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నత విద్యను పూర్తి చేశాడు. హర్షా తెలుగులో సైతం అనర్గళంగా మాట్లాడగలడు. గత సీజన్ ఐపీఎల్ సందర్భంగా దినేశ్ కార్తీక్‌ను తెలుగులో ఇంటర్వ్యూ చేసి అభిమానులను ఆకట్టుకున్నాడు.

Story first published: Friday, March 25, 2022, 13:54 [IST]
Other articles published on Mar 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X