న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చిన్నారి పట్ల హర్మన్ సమయస్పూర్తి: నెటిజన్ల ప్రశంసల వర్షం (వీడియో)

Harmanpreet Kaur makes sure the ill-mascot is in safe hands after the national anthem

హైదరాబాద్: భారత మహిళల టీ20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే, ఈసారి వార్తల్లో నిలిచింది పరుగుల వరద పారించినందుకు కాదు. మైదానంలో సమయస్పూర్తితో వ్యవరించి అభిమానుల మనసు గెలుచుకున్నందుకు. ప్రస్తుతం హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు కరేబియన్ దీవుల్లో పర్యటిస్తోంది.

<strong>మెరుగైన స్థానాల్లోకి కుల్దీప్, రోహిత్‌లు.. కోహ్లీ 15వ స్థానంలోకి.. </strong>మెరుగైన స్థానాల్లోకి కుల్దీప్, రోహిత్‌లు.. కోహ్లీ 15వ స్థానంలోకి..

కారణం... ఐసీసీ మహిళల వరల్డ్ టీ20 టోర్నీ కోసం. టోర్నీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలిమ్యాచ్‌లోనే హర్మన్‌‌ప్రీత్‌ కౌర్‌ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించడంతో మహిళల టీ20 వరల్డ్ కప్‌లో సెంచరీ సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకుంది‌.

51 బంతుల్లో సెంచరీ సాధించిన హర్మన్‌ప్రీత్

51 బంతుల్లో సెంచరీ సాధించిన హర్మన్‌ప్రీత్

ఈ మ్యాచ్‌లో హర్మన్‌‌ప్రీత్ కౌర్ మొత్తం 51 బంతుల్లో సెంచరీ సాధించింది. ఆ తర్వాత టోర్నీలో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాక్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో ఓపెనర్ మిథాలీరాజ్ హాఫ్ సెంచరీతో రాణించడంతో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర సంఘటన ఆమెపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురింపించేలా చేసింది.

రు జట్లు జాతీయ గీతం పాడడానికి

రు జట్లు జాతీయ గీతం పాడడానికి

సాధారణంగా మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లకు సంబంధించిన జాతీయ గీతాలను ఆలపించడం ఎప్పటి నుంచో ఆనవాయితీ వస్తోంది. ఇరు జట్లు జాతీయ గీతం పాడడానికి మైదానంలో నిల్చున్న సమయంలో ఎప్పటిలానే ఒక్కోక్కరి ముందు ఒక్కో చిన్నారి నిల్చున్నారు. చిన్నారులందరూ టీ20 వరల్డ్‌కప్ మస్కట్‌ ఉన్న టీషర్టులు ధరించి క్రికెటర్ల ముందు నిల్చున్నారు.

జాతీయగీతం అయిపోయేంత వరకు చిన్నారిని చేతితోనే

జాతీయగీతం అయిపోయేంత వరకు చిన్నారిని చేతితోనే

భారత జాతీయ గీతం ప్రారంభమయ్యే సమయంలో తన ముందు నిల్చున్న చిన్నారి అనారోగ్యానికి గురవడాన్ని హర్మన్‌‌ప్రీత్‌ కౌర్‌ గమనించింది. జాతీయగీతం అయిపోయేంత వరకు సదరు చిన్నారిని చేతితో పట్టుకుంది. జాతీయ గీతాలాపన పూర్తయిన వెంటనే చేతులతో చిన్నారిని ఎత్తుకుని వెంటనే పెవిలియన్‌వైపు తీసుకెళ్లింది.

హర్మన్‌‌ప్రీత్ సమయస్పూర్తికి నెటిజన్లు ప్రశంసల వర్షం

ఓ వైపు జాతీయ గీతాన్ని ఆలకిస్తూనే, మరోవైపు చిన్నారిని కిందపడకుండా హర్మన్‌‌ప్రీత్ చక్కటి సమయస్పూర్తితో వ్యవహరించంటూ ఆమెపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Monday, November 12, 2018, 18:00 [IST]
Other articles published on Nov 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X