న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా కూతురు డిగ్రీ పూర్తి చేసేందుకు టైమ్ ఇవ్వండి: హర్మన్ తండ్రి

Harmanpreet can complete her graduation if govt gives her time, says father

హైదరాబాద్: మహిళల జట్టు టీ20 కెప్టెన్‌గా కొనసాగుతోన్న హర్మన్‌ప్రీత్‌పై ఫేక్ డిగ్రీ సమర్పించిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో పాటు ఆమెకు ప్రభుత్వం గౌరవ సూచికంగా డీఎస్పీ పదవిని కూడా కట్టబెట్టింది. అయితే అవేమీ పనికిరావని నకిలీ సర్టిఫికేట్లతో పంజాబ్‌ పోలీసు శాఖలో డీఎస్పీ ఉద్యోగాన్ని సంపాదించిట్లు ఆరోపణలు పుట్టుకొచ్చాయి. ఈ విషయంపై హర్మన్‌ప్రీత్ వివరణ ఇచ్చింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌.. డిగ్రీ సర్టిఫికెట్లు నకిలీవి కాదని, అదే డిగ్రీ సర్టిఫికెట్లతో తాను పీజీకి కూడా దరఖాస్తు చేసుకున్నట్లు హర్మన్‌ తెలిపింది.

 పూర్తిగా అడ్మినిస్ట్రేషన్‌ తప్పిదం.

పూర్తిగా అడ్మినిస్ట్రేషన్‌ తప్పిదం.

‘ఇది పూర్తిగా అడ్మినిస్ట్రేషన్‌ తప్పిదం. మనం ఎవరైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తి అయిన తర్వాత ప్రధాన కార్యాలయానికి వెళ్లి మన ఎన్‌రోల్‌మెంట్‌ నంబర్‌ను చెక్‌ చేసుకుంటామా? లేదు కదా. నేను అదే చేశాను. నేను క్రీడాకారిణిని కాబట్టి నా దృష్టంతా ఎక్కువ ఆటపైనే ఉంటుంది. మరో పక్క గ్రాడ్యుయేషన్‌ చేయాలనుకుని దాన్ని పూర్తి చేశాను.

పోస్టు గ్రాడ్యుయేషన్‌కు అడ్మిషన్‌ కూడా

పోస్టు గ్రాడ్యుయేషన్‌కు అడ్మిషన్‌ కూడా

గ్రాడ్యుయేషన్‌ తర్వాత అదే సర్టిఫికెట్ల ఆధారంగా మరో విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్‌కు అడ్మిషన్‌ కూడా పొందాను. కానీ, పరీక్షలు రాయలేకపోయాను. ఎందుకంటే మ్యాచ్‌ల కోసం విదేశాలకు వెళ్లాల్సి వచ్చి. కానీ, ఇప్పుడు అదే డిగ్రీని నకిలీదని అంటున్నారు. కొద్ది రోజులుగా పత్రికల్లో వస్తోన్న వార్తలు చూసి బాధపడ్డాను. దీనిపై డిపార్టుమెంటు వారు ఏం మాట్లాడతారా అని ఎదురుచూశాను. వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఫర్వాలేదు' అని హర్మన్‌ప్రీత్‌ చెప్పింది.

 డీఎస్పీ పదవి నుంచి కానిస్టేబుల్‌ ఉద్యోగం

డీఎస్పీ పదవి నుంచి కానిస్టేబుల్‌ ఉద్యోగం

పంజాబ్‌ ప్రభుత్వం డీఎస్పీ పదవి నుంచి తొలగించి కానిస్టేబుల్‌ ఉద్యోగం ఇచ్చినట్లు వస్తోన్న వార్తలపై ఆమెను వివరణ కోరగా... అలాంటిదేమీ లేదని... ఇప్పటి వరకు తనకు ఎలాంటి సమాచారం అందలేదని బదులిచ్చింది. భారత్‌ తరఫున అద్భుత ప్రదర్శనలు చేసినందుకు పంజాబ్‌ ప్రభుత్వం హర్మన్‌కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చి గౌరవించింది. ఈ ఏడాది మార్చి 1న ఆమె డీఎస్పీగా పదవి బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

కాస్త సమయం ఇస్తే డిగ్రీ పూర్తి చేసేస్తుందని

కాస్త సమయం ఇస్తే డిగ్రీ పూర్తి చేసేస్తుందని

ఇదిలా ఉంటే హర్మన్ ప్రీత్ తండ్రి హరేందర్ సింగ్ మాట్లాడుతూ.. 'అయిందేదో అయిపోయింది. కాస్త సమయం ఇప్పిస్తే తన కూతురు డిగ్రీ పూర్తి చేసేస్తుందని చెప్పుకొస్తున్నాడు. హర్మన్ డిగ్రీ చేసిందే లేదో తనకు స్పష్టంగా తెలీదని ఆ వ్యవహారాలన్నీ తన కోచ్ చూసుకునే వాడని తెలిపాడు. అప్పట్లో మీరట్‌లో కౌర్ పరీక్షలు రాసినట్లుగా గుర్తుందని పేర్కొన్నాడు.

Story first published: Thursday, July 12, 2018, 16:43 [IST]
Other articles published on Jul 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X