న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Hardik Pandya throwback pic: ట్రక్‌లో క్లబ్ క్రికెటర్‌గా!

Hardik Pandya shares major throwback pic on his Instagram

హైదరాబాద్: మొహాలీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా కీలక సమయంలో డేవిడ్ మిల్లర్ వికెట్ తీసి మంచి శుభారంభాన్నిచ్చాడు. ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత టీమిండియా వెస్టిండిస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

ఈ పర్యటన నుంచి సెలక్టర్లు హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చారు. సఫారీ పర్యటనలో భాగంగా జాతీయ జట్టులో తిరిగి చోటు దక్కించుకుని హార్దిక్ పాండ్యా తీసిన తొలి వికెట్ ఇదే కావడం విశేషం. రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో మూడు టీ20ల సిరిస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

ఆర్చర్‌ బౌన్సర్‌ను ఎదుర్కొనడంలో స్మిత్‌ చేసిన పొరపాటిదే: సచిన్ విశ్లేషణఆర్చర్‌ బౌన్సర్‌ను ఎదుర్కొనడంలో స్మిత్‌ చేసిన పొరపాటిదే: సచిన్ విశ్లేషణ

హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన

హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత జట్టు తరుపున అరంగేట్రం చేసినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేస్తూనే ఉన్నాడు. అటు బ్యాట్‌తో పాటు. ఇటు బంతితో కూడా టీమిండియా సాధించిన అనేక విజయాల్లో కీలకప్తార పోషించాడు. ప్రస్తుతం భారత జట్టులో అత్యుత్తమ ఆల్ రౌండర్‌గా పాండ్యా కొనియాడబడుతున్నాడు.

క్లబ్ క్రికెటర్‌గా రాణిస్తోన్న రోజుల్లో

తాజాగా, టీనేజర్‌గా ఉన్న సమయంలో క్లబ్ క్రికెటర్‌గా రాణిస్తోన్న రోజులకు సంబంధించిన ఫోటోను హార్దిక్ పాండ్యా గురువారం తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. "లోకల్ మ్యాచ్‌లు ఆడేందుకు ట్రక్‌లో ప్రయాణిస్తోన్న రోజులవి. ఆ రోజులు నాకెంతో నేర్పించాయి. అదొక అద్భుతమైన జర్నీ. అవును, క్రికెట్ అంటే నాకెంతో ఇష్టం" అని కామెంట్ పెట్టాడు.

ట్రక్‌లో టోపీ పెట్టుకుని మరీ

ట్రక్‌లో టోపీ పెట్టుకుని మరీ

ఆ ఫోటోలో పాండ్యా ఓ ట్రక్‌లో టోఫీ పెట్టుకుని ఉన్నాడు. అంతేకాదు ట్రాక్ ప్యాయింట్ ధరించి బ్లాక్ టీషర్ట్ కూడా వేసుకున్నాడు. అయితే, ప్రస్తుతం హార్ధిక్ పాండ్యా భారత జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. మిడిలార్డర్‌లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. కాగా, ఈ ఏడాది జనవరిలో ఓ చాట్ షోలో పాల్గొన్న హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్‌లు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండ్‌కు గురయ్యాడు.

నిషేధానికి కూడా గురయ్యాడు

నిషేధానికి కూడా గురయ్యాడు

తనపై విధించిన నిషేధం ఎత్తివేసిన తర్వాత హార్దిక్ పాండ్యా తిరిగి తుది జట్టులో చోటు దక్కించుకుని అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా ఐపీఎల్‌ 2019 సీజన్‌లో హార్దిక్ పాండ్యా మొత్తం 15 ఇన్నింగ్స్‌ల్లో 402 పరుగులతో చెలరేగాడు. దీంతో పాటు 14 వికెట్లు కూడా పడగొట్టాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే ఏకంగా 17 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా సెమీఫైనల్‌కు చేరడంతో హార్ధిక్ పాండ్యా పాత్ర ఎంతో కీలకం.

Story first published: Friday, September 20, 2019, 12:43 [IST]
Other articles published on Sep 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X