న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే పృథ్వీ షా, చాహల్‌ను జట్టులోకి తీసుకోలేదు: హార్దిక్ పాండ్యా

Hardik Pandya Reveals The Reason Why Prithvi Shaw Not Playing In 1st T20 Against New Zealand

రాంచీ: న్యూజిలాండ్‌తో తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం ఉంటుందనే చేజింగ్‌కు మొగ్గు చూపానని టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు. పిచ్ చూడటానికి మంచి బ్యాటింగ్ ట్రాక్‌లా ఉందని, కానీ మంచు ప్రభావం కీలకం కానుందన్నాడు. ఈ క్రమంలోనే ముందుగా బౌలింగ్ తీసుకుంటున్నానని టాస్ సందర్భంగా హార్దిక్ పాండ్యా స్పష్టం చేశాడు. అత్యుత్తమ క్రికెట్ ఆడటంపైనే ఫోకస్ పెట్టామని చెప్పిన హార్దిక్.. ఇందో యంగ్ టీమ్ అని గుర్తు చేశాడు. వన్డేల ముందు టీ20లు ఆడటం చాలా సులువని, టీమ్‌లో అనుభవమైన ఆటగాళ్లు కూడా ఉన్నారని చెప్పాడు. టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే యుజ్వేంద్ర చాహల్, ముఖేశ్, జితేశ్, పృథ్వీ షాలను తీసుకోలేకపోయామని స్పష్టం చేశాడు.

న్యూజిలాండ్ తాత్కలిక సారథి మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. వన్డేల్లో భారత్‌కు సవాల్ విసిరామన్నాడు. భారత్‌లో ఆడిన అనుభవం తమ ఆటగాళ్లకు లేకపోవడంతో విజయాన్నందుకోలేకపోయామని తెలిపాడు. యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ మంచి ఎక్స్‌పీరియన్స్ అన్నాడు. డ్యూ ఉన్న నేపథ్యంలో ముందుగా బౌలింగ్ చేయడమం ఉత్తమమని, కానీ టాస్ మన చేతుల్లో లేనిదన్నాడు. భారీ స్కోర్ ప్రత్యర్థి ముందు పెట్టి సవాల్ విసురుతామన్నాడు. టామ్ లాథమ్, నికోల్స్ జట్టుకు దూరమయ్యారని, చాప్‌మన్, ఇష్ సోదీ జట్టులోకి వచ్చారని చెప్పాడు. న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో గెలిచిన టీమిండియా.. టీ20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని భావిస్తోంది.

తుది జట్లు

న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే(కీపర్), మార్క్ చాప్‌మన్, డారిల్ మిచెల్, గ్లేన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్(కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, జకోబ్ డఫ్ఫీ, ఇష్ సోదీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్‌నర్

భారత్: ఇషాన్ కిషన్(కీపర్), శుభ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్

Story first published: Friday, January 27, 2023, 18:58 [IST]
Other articles published on Jan 27, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X