న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'హార్దిక్ పాండ్యాకు ఆల్ రౌండర్ తీసేయండి'

India V/S England : Harbhajan Singh Talks About Hardik Pandya
Hardik Pandya not an all-rounder, wont become Kapil Dev overnight: Harbhajan Singh

న్యూఢిల్లీ: హర్భజన్ సింగ్ టీమిండియాలో ఉన్నప్పటి దానికంటే ప్రస్తుత క్రికెటర్లను విమర్శించేందుకే చురుకుదనం చూపిస్తున్నాడు. ఇంగ్లాండ్ చేతిలో తొలి రెండు టెస్టుల్లో ఓటమిపాలైన భారత జట్టుపై విమర్శలు గుప్పిస్తున్న మాజీలతో కలిసిపోయాడు. లార్డ్స్ టెస్టులో ఇన్నింగ్స్ 159 పరుగుల భారీ తేడాతో ఓడటం ఎవరికీ రుచించడం లేదు. మాజీ దిగ్గజ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్‌తో పోలుస్తున్నప్పటికీ.. హార్దిక్ పాండ్య అసలు ఆల్‌రౌండరే కాదని హర్భజన్ సింగ్ ఎద్దేవా చేశాడు.

'ఇంగ్లిష్ ఆల్‌రౌండర్లు బెన్ స్టోక్స్, శామ్ కర్రాన్, క్రిస్ వోక్స్‌లతో పోలిస్తే.. పాండ్య చాలా వెనుకబడి ఉన్నాడని భజ్జీ అభిప్రాయపడ్డాడు. ఆల్‌రౌండర్ అంటే స్టోక్స్, కర్రాన్ తొలి టెస్టులో ఎలా ఆడారో.. లార్డ్స్‌లో వోక్స్ ఎలా ఆడాడో.. అలా ఆడాలి. హార్దిక్ నుంచి కూడా అదే ఆశించాం. అతడు ఓవర్‌నైట్‌లో కపిల్ దేవ్ కాలేడు. అతడికి ఉన్న ఆల్‌రౌండర్ ట్యాగ్ తొలగించాల'ని భజ్జీ సూచించాడు.

హార్దిక్ నుంచి ఆల్‌రౌండర్ ట్యాగ్ తొలగించాలని అతడితో కలిసి ఐపీఎల్ ఆడిన భజ్జీ తెలిపాడు. 'హార్దిక్ బ్యాట్స్‌మెన్‌గా ఎక్కువ పరుగులేం చేయలేదు. అతడి బౌలింగ్ పట్ల కెప్టెన్‌కు నమ్మకం ఉన్నట్టు కనిపించడం లేదు. ఇంగ్లాండ్‌లో ఉన్న పరిస్థితుల్లో అతడు బౌలింగ్ చేయకపోతే.. అది అతడికి, భారత క్రికెట్ జట్టు భవిష్యత్తుకి ఇబ్బంది' అని భజ్జీ ఘాటుగా వ్యాఖ్యానించాడు.

పేస్‌కు అనుకూలిస్తే మాత్రం బంతితో సత్తా చాటుతున్న పాండ్యను కోహ్లీ మూడో టెస్టుకు తీసుకుంటాడా.. అనేది ప్రశ్నార్థకంగా మారింది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ మూడో టెస్టులో టీమిండియా ఎంపిక ఎలా ఉంటుందనేది అందరికీ ప్రశ్నార్థకంగా మారింది. బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలం కావడంతో మార్పులు తప్పవనిపిస్తోంది. పైగా కోహ్లీ ఆడిన టెస్టు మ్యాచ్‌లలో ప్రతి మ్యాచ్‌కు జట్టును మార్చుకోకుండా బరిలోకి దిగింది లేదు.

Story first published: Thursday, August 16, 2018, 17:21 [IST]
Other articles published on Aug 16, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X