Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బీసీసీఐ దెబ్బకు దిగొచ్చిన హర్భజన్: నిబంధనలు తెలుసంటూ బుకాయింపు!

Harbhajan Singh Says He’ll Withdraw From The Hundred Draft || Oneindia Telugu
 Harbhajan Singh: IPL and Chennai Super Kings remain priorities, will withdraw my name from The Hundred Draft

హైదరాబాద్: వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌ వేదికగా జరుగనున్న 'ద హండ్రెడ్‌ లీగ్‌' లో తాను ఆడుతున్నానంటూ వచ్చిన వార్తలపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. వచ్చే ఏడాది 'ద హండ్రెడ్‌ లీగ్‌'ను నిర్వహించడానికి ఈసీబీ రంగం సిద్ధం చేయగా, అందులో హర్భజన్‌ సింగ్‌ పేరు ఉండడటం చర్చనీయాంశమైంది.

ఈ నేపథ్యంలో 'ద హండ్రెడ్‌ లీగ్‌' డ్రాఫ్ట్‌‌లో తన పేరు ఉండటంపై భజ్జీ స్పందించాడు. హర్భజన్ మాట్లాడుతూ "నేను ఆ లీగ్‌లో ఆడటానికి ఆసక్తిగా లేను. ఐపీఎల్‌ ఆడతావా లేక ద హండ్రెడ్‌ ఆడతావా అంటే ఐపీఎల్‌కే మొగ్గుచూపుతా. ఐపీఎల్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌కే నా తొలి ప్రాధాన్యత. చెన్నై తరఫున రెండు మంచి సీజన్లు ఆడా" అని తెలిపాడు.

"ఆ రెండు సార్లు మేం ఫైనల్‌కు వెళ్లాం. ఇప్పుడు మూడో సీజన్‌పై దృష్టి పెట్టా. నాకు భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు నిబంధనలు తెలుసు. నేనెప్పుడూ నిబంధనలను ఉల్లంఘించలేదు. డ్రాఫ్ట్‌ నుంచి నా పేరును ఉపసంహరించుకుంటా. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పి ద హండ్రెడ్‌ ఆడాల్సిన అవసరం నాకు ప్రస్తుతం లేదు" అని భజ్జీ పేర్కొన్నాడు.

2016లో చివరిసారి భారత జెర్సీ ధరించిన హర్భజన్‌ సింగ్‌.. గత రెండేళ్లుగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో భజ్జీ మొత్తం 16 వికెట్లు తీశాడు.

Story first published: Saturday, October 5, 2019, 13:38 [IST]
Other articles published on Oct 5, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+