న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

యువరాజ్‌ కోసం మందుబిల్లలు కొనాలనుకున్న హర్భజన్‌

Harbhajan Singh and Yuvraj Singh have a hilariously intellectual discussion on ‘farts’

ముంబై: హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ దశాబ్దానికి పైగా భారత జట్టులో కొనసాగారు. 2000 సంవత్సరంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నాయకత్వంలో వీరిద్దరూ అద్భుతంగా రాణించారు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో హర్భజన్ ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ సాధించగా, 2000 ఐసీసీ నాకౌట్స్ ట్రోఫీలో యువరాజ్ అర్ధ సెంచరీ సాధించి సత్తా చాటాడు. ఇక దక్షిణాఫ్రికాలో 2007 జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సాధించిన విజయంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. యువరాజ్ 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇక 2011 ప్రపంచకప్‌లో కూడా యువరాజ్ తన ఆల్ రౌండ్ ప్రదర్శనకు 'మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్' అందుకున్నాడు. మరోవైపు హర్భజన్ కూడా మన మార్క్ చూపించాడు.

దినేష్ కార్తీక్ అభిమాన కబడ్డీ ప్లేయర్ ఎవరో తెలుసా?

హర్భజన్, యువరాజ్‌లు ఆటలోనే కాదు డ్రస్సింగ్‌ రూమ్‌లో కూడా తన మార్క్ చూపిస్తారు. వీరిద్దరూ మైదానంలో ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవలకు దిగినా.. డ్రస్సింగ్‌ రూమ్‌లో ఉంటే మాత్రం నవ్వులే నవ్వులు. వీరి జోకులకు డ్రస్సింగ్‌ రూమ్‌లోని ఆటగాళ్లు హాయిగా నవ్వుకుంటారు. కెప్టెన్ సౌరవ్‌ గంగూలీని కూడా ఆటపట్టించారు. ఇద్దరు పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించడంతో సోదరులుగా కలిసిపోయారు.

తాజాగా ట్విటర్‌లో 'ఫ్యాక్ట్‌' అనే పేజీ 'మీరు వదిలే గ్యాస్‌ గులాబీ, చాక్లెట్‌ పరిమళం రావాలంటే ఈ మందు బిల్లలు కొనుగోలు చేయొచ్చు' అని రాసుకొచ్చింది. 'నిజమా?​​​ యువరాజ్‌ కోసం కొన్ని ఆర్డర్‌ చేయనా' అని భజ్జీ ట్వీట్ చేసాడు. 'అవును నాకోసం ఆర్డర్ చేయి. ఆ తర్వాత ఇద్దరం కలిసి పంచుకుందాం' అని యువీ స్పందించాడు. ఈ ట్వీట్ చూసిన క్రికెట్ అభిమానుంతా నవ్వుకుంటున్నారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ.. గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో తన బ్యాట్ పవర్ చూపించాడు.

Story first published: Monday, August 19, 2019, 16:32 [IST]
Other articles published on Aug 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X