న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాక్‌లో శ్రీలంక జట్టు: భద్రతా ఏర్పాట్లపై పట్ల కెప్టెన్ సంతృప్తి వ్యక్తం!

Happy to lead my team to Pakistan: Sri Lanka captain Dasun Shanaka satisfied with security arrangements

హైదరాబాద్: పాక్ పర్యటనలో శ్రీలంక జట్టు కోసం ఏర్పాటు చేసిన భద్రత పట్ల ఆ జట్టు కెప్టెన్ దాసున్ షణక సంతృప్తి వ్యక్తం చేశాడు. పాకిస్థాన్‌లో శ్రీలంక జట్టుని నడిపించడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. ద్వైపాక్షిక సిరిస్‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ కోసం మంగళవారం శ్రీలంక జట్టు బయల్దేరింది.

సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 9వ వరకు జరగనున్న ఈ పర్యటనలో శ్రీలంక జట్టు 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. అయితే, భద్రతా కారణాలు దృష్ట్యా ఈ సిరిస్‌లో పాల్గొనేందుకు పలువురు సీనియర్ క్రికెటర్లు నిరాకరించడంతో ద్వితీయ శ్రేణి యువ ఆటగాళ్లతో కూడిన జట్టుని శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది.

వన్డే జట్టుకు లాహిరు తిరుమన్నే సారథ్యం

వన్డే జట్టుకు లాహిరు తిరుమన్నే సారథ్యం

వన్డే జట్టుకు లాహిరు తిరుమన్నే సారథ్యం వహిస్తుండగా... టీ20లకు దాసున్ షణకను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. పాక్ పర్యటనకు బయల్దేరడానికి ముందు టీ20 కెప్టెన్ దాసున్ షణక మీడియాతో మాట్లాడుతూ "గతంలో పాక్‌లో ఆడాను. శ్రీలంక జట్టు కోసం ఏర్పాటు చేసిన భద్రత పట్ల సంతృప్తిగా ఉన్నాం. పాక్‌లో జట్టుని నడిపించడం సంతోషం" అని అన్నాడు.

బలమైన ఆతిథ్య జట్టుకు మంచి పోరాటం ఇస్తాం

బలమైన ఆతిథ్య జట్టుకు మంచి పోరాటం ఇస్తాం

"స్వదేశంలో పాక్ బలమైన జట్టు. దీంతో బలమైన ఆతిథ్య జట్టుకు మంచి పోరాటం ఇస్తామని ఆశిస్తున్నాం" అని దాసున్ షణక అన్నాడు. పాక్ పర్యటనకు బయల్దేరడానికి ముందు ఓ బుద్ధ సన్యాసి వారికి రక్షణగా తాయత్తులు కట్టాడు. కాగా, పాక్‌లో శ్రీలంక పర్యటన సందర్భంగా తమ ఆటగాళ్లను ఉగ్రవాదులు లక్ష్యంగా ఎంచుకునే ప్రమాదం ఉందంటూ తమకు హెచ్చరికలు వచ్చాయని శ్రీలంక బోర్డు పేర్కొన్న సంగతి తెలిసిందే.

2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి

2009లో శ్రీలంక జట్టుపై ఉగ్రదాడి

2009లో శ్రీలంక జట్టు పాక్ పర్యటనలో ఉన్నప్పుడు లాహోర్‌లో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో శ్రీలంకకు చెందిన ఏడుగురు ఆటగాళ్లు గాయపడగా.. ఆరుగురు పోలీసులు, ఇద్దరు సాధారణ పౌరులు చనిపోయారు. అప్పటి నుంచి భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్థాన్ హోం మ్యాచ్‌లను ఆ దేశ క్రికెట్ బోర్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహిస్తోంది.

కరాచీ వేదికగా సెప్టెంబర్ 27,29న రెండు వన్డేలు

కరాచీ వేదికగా సెప్టెంబర్ 27,29న రెండు వన్డేలు

అయితే, ఇన్నాళ్లకు మళ్లీ అదే శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటించేందుకు ముందుకొచ్చింది. కరాచీ వేదికగా సెప్టెంబర్ 27,29న రెండు వన్డేలు... అక్టోబర్ 3న లాహోర్ వేదికగా మూడో టీ20 జరగనుంది. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని శ్రీలంక కెప్టెన్లు దిముత్ క‌రుణ‌ర‌త్నే, ల‌సిత్ మ‌లింగ‌లతో పాటు సీనియర్ ఆటగాళ్లు పాక్‌కు వెళ్లేందుకు నిరాక‌రించారు.

యువ ఆటగాళ్లకు చోటు

యువ ఆటగాళ్లకు చోటు

ఈ నేపథ్యంలో వన్డే, టీ20 సిరిస్ కోసం ప్రకటించిన జట్లలో శ్రీలంక క్రికెట్ బోర్డు యువ ఆటగాళ్లకు చోటు కల్పించింది. ఇటీవలే ద్వైపాక్షిక సిరీస్‌ను తటస్థ వేదికకు మార్చాలని శ్రీలంక చేసిన విన్నపాన్ని పీసీబీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. పాక్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్వవైభవం తీసుకురావాలనే వారి ప్రణాళికలు ప్రమాదంలో పడుతాయని పీసీబీ ఈ నిర్ణయం తీసుకుంది.

పాకిస్థాన్‌లో శ్రీలంక పర్యటన షెడ్యూల్:

పాకిస్థాన్‌లో శ్రీలంక పర్యటన షెడ్యూల్:

వన్డేలు

1st ODI on September 27 in Karachi

2nd ODI on September 29 in Karachi

3rd ODI on October 3 in Karachi

టీ20లు

1st T20I on October 5 in Lahore

2nd T20I on October 7 in Lahore

3rd T20I on October 9 in Lahore

Story first published: Tuesday, September 24, 2019, 17:56 [IST]
Other articles published on Sep 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X