న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హ్యాపీ బర్త్‌డే వెంకటేశ్ ప్రసాద్: అరుదైన వీడియోని షేర్ చేసిన బీసీసీఐ

By Nageshwara Rao
Happy birthday Venkatesh Prasad: BCCI recalls Venky-Sohail rivalry on his birthday

హైదరాబాద్: భారత జట్టు అందించిన అత్యుత్తమ ఆల్ టైమ్ ఫాస్ట్ బౌలర్లలో వెంకటేశ్ ప్రసాద్ ఒకడు. జవగళ్ శ్రీనాథ్‌తో కలిసి టీమిండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు. ఆగస్టు 5(ఆదివారం) వెంకటేశ్ ప్రసాద్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ బీసీసీఐ ఓ అద్భుతమైన వీడియోను ట్వీట్‌ చేసింది.

అది 1996 వరల్డ్‌ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌. సెమీస్ బెర్త్ కోసం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఎంతో కీలకమ్యాచ్ కావడంతో ఈ పోరును ప్రపంచం మొత్తం ఆసక్తిగా తిలకిస్తోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 286 పరుగులు చేసింది.

అనంతరం భారత్ నిర్దేశించిన 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఓపెనర్లు సయ్యద్‌ అన్వర్, అమీర్‌ సోహైల్ తొలి 10 ఓవర్లలో 84 పరుగులు చేశారు. అన్వర్‌ ఔటైన తర్వాత సోహైల్‌ మరింత దూకుడు పెంచాడు. ఈ క్రమంలో సోహైల్ వరుస బౌండరీలు బాది వెంకటేష్‌ ప్రసాద్‌ను రెచ్చగొట్టాడు.

ఈ క్రమంలో వెంకటేశ్ ప్రసాద్ వేసిన బంతిని ఎక్స్‌ట్రా కవర్స్‌లో కొట్టి 'మళ్లీ అక్కడికే కొడతా... వెళ్లి తెచ్చుకో' అంటూ బ్యాట్‌ను అతడి ముఖంవైపు చూపుతూ ఎగతాళి చేశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ప్రసాద్ ఆ తర్వాతి బంతిని ఆఫ్‌ స్టంప్ బయటకు వేశాడు. అంతే బంతిని టచ్ చేయబోయిన సోహైల్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.

ఒక్కసారిగా పట్టరాని ఆవేశంతో వెంకటేశ్ ప్రసాద్ 'బాస్టర్డ్... గో హోమ్' అంటూ పెవిలియన్ వైపు దారి చూపించాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 39 పరుగులు తేడాతో విజయం సాధించింది. తాజాగా, వెంకటేశ్ ప్రసాద్ పుట్టినరోజుని పురస్కరించుకుని అప్పటి వీడియోని అభిమానుల కోసం బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్టు చేసింది.

Story first published: Sunday, August 5, 2018, 14:05 [IST]
Other articles published on Aug 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X