న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'హ్యాప్ బర్త్ డే సచిన్': క్రికెట్ దేవుడి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు

By Nageshwara Rao
Happy Birthday Sachin Tendulkar: 20 interesting facts for ultimate fans of God of Cricket

హైదరాబాద్: సచిన్ టెండూల్కర్.... అంతర్జాతీయ క్రికెట్‌కు పరిచయం అక్కర్లేని పేరు. గాడ్ ఆఫ్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ లెజెండ్ ఇలా ఎన్ని పేర్లతో పిలుచుకున్నప్పటికీ, సచిన్ ఎప్పటికీ సచినే. 'భారత్‌లో క్రికెట్ ఓ మతమైతే సచిన్ దేవుడు' అనే నానుడి ఉంది.

ఈ ఒక్కటి చాలు సచిన్ టెండూల్కర్‌కు ఉన్న క్రేజ్‌ గురించి చెప్పడానికి. తన 23 ఏళ్ల సుదీర్ఘమైన క్రికెట్ కెరీర్‌లో ఎవరికీ సాధ్యం కానటువంటి ఎన్నో అద్భుతమైన రికార్డులను తన పేరిట నెలకొల్పాడు. సెంచరీల సెంచరీ పూర్తి చేసుకున్న సచిన్ 2013 నవంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

అయినప్పటికీ ఆటకు మాత్రం దూరం కాలేదు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు మెంటార్‌గా వ్యవహారిస్తున్నాడు. భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేసిన సచిన్ టెండూల్కర్ ఏప్రిల్ 24న 45వ ఏట అడుగుపెట్టాడు. సచిన్ బర్త్ డే సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలు మీకోసం..


1987 వరల్డ్ కప్‌లో భారత్, జింబాబ్వే జట్ల మధ్య వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సచిన్ బాల్ బాయ్‌గా పని చేశాడు. అప్పుడు సచిన్ వయసు 14 ఏళ్లు.


1988లో పాకిస్థాన్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సచిన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆడాడు. బ్రబౌర్న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.


జూనియర్ క్రికెట్ ఆడే రోజుల్లో సచిన్ టెండూల్కర్ క్రికెట్ కిట్‌‌ను పక్కలో ఉంచుకొని నిద్రపోయేవాడు.


సచిన్ సొంతం చేసుకున్న మొదటి కారు మారుతి 800.


థర్డ్ అంపైర్ అవుటిచ్చిన తొలి అంతర్జాతీయ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్. 1992లో డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌ రెండో రోజు జాంటీ రోడ్స్ సచిన్‌ను రనౌట్ చేశాడు. టీవీలో రిప్లే చూశాక థర్డ్ అంపైర్ కార్ల్ లిబెన్‌బెర్గ్ ఔటిచ్చాడు.


తన 19వ ఏట సచిన్ కౌంటీల్లో ఆడాడు. కౌంటీ క్రికెట్ ఆడిన పిన్న వయస్కుడైన భారతీయుడిగా సచిన్ అరుదైన రికార్డు సృష్టించాడు.

ఎవరు తనను గుర్తు పట్టొద్దనే ఉద్దేశంతో గడ్డం మీసాలు అతికించుకొని సచిన్ రోజా సినిమా చూసేందుకు వెళ్లాడు. 1995లో ఈ ఘటన జరగ్గా.. సినిమా హాల్లో ఆయన కళ్లద్దాలు జారిపడిపోవడంతో.. గుర్తుపట్టిన జనం ఆయన చుట్టుముట్టారు.


చిన్నప్పుడు సచిన్ మహా తుంటరి. వేసవి కాలంలో ఓ రోజు సాయంత్రం చెటెక్కి కింద పడిపోయాడు. దీంతో పనిష్మెంట్‌గా ఆయన అన్న అజిత్ సచిన్‌ను క్రికెట్ కోచింగ్ క్లాస్‌లో చేర్పించాడు.


సునీల్ గవాస్కర్ బహుమతిగా ఇచ్చిన ప్యాడ్స్‌తో తన అరంగేట్రం మ్యాచ్‌లో సచిన్ పాకిస్థాన్‌పై బరిలో దిగాడు.

మిగతా క్రీడలకు చెందిన చాలా మంది ఆటగాళ్లు అయిన పీట్ సంప్రాస్, బోరిస్ బెకర్, అర్జెంటీనా పుట్ బాల్ దిగ్గజం డిగో మారడోనాలకు సచిన్ టెండూల్కర్ రోల్ మోడల్‌గా ఉన్నారు.


వర్షం పడే సమయంలో సచిన్‌కు టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడటం అంటే ఎంతో ఇష్టం.


సచిన్‌కు అలనాటి సింగర్ కిషోర్ కుమార్, రాక్ గ్రూప్ డైర్ స్ట్రెయిట్స్ అంటే ఎంతో ఇష్టం.


గంగూలీని సచిన్ బాబూ మోషాయ్ అని పిలిస్తే.. సచిన్‌ను దాదా చోటా బాబూ అని పిలుస్తాడు.


సచిన్‌కు టెన్నిస్ మాజీ దిగ్గజం జాన్ మెకన్రోయ్ అంటే పిచ్చి. అతడిలాగే జుట్టు పెంచి దాని చుట్టూ ఓ బ్యాండ్ కట్టేవాడు.


సచిన్ రంజీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీల్లో అరంగేట్రం మ్యాచ్‌ల్లోనే సెంచరీలు సాధించాడు.


సచిన్‌కు పెర్‌ఫ్యూమ్స్, వాచీలు కలెక్ట్ చేయడమంటే ఇష్టం.


సచిన్ తొలిసారిగా కనిపించింది 'బూస్ట్' ప్రకటనలో. ఆ తర్వాత 1990ల్లో కపిల్ దేవ్‌తో కలిసి అనేక యాడ్ ఫిల్మ్స్‌లో సచిన్ టెండూల్కర్ నటించాడు.

Story first published: Tuesday, April 24, 2018, 14:37 [IST]
Other articles published on Apr 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X