న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ద్రవిడ్ పుట్టినరోజు: సెహ్వాగ్ ట్వీట్ అదుర్స్, నెటిజన్లు సైతం మెచ్చారు

Happy Birthday Rahul Dravid: Virender Sehwag’s wish for ‘The Wall’ is winning hearts online

హైదరాబాద్: భారత క్రికెట్‌కు బీసీసీఐ అందించిన అత్యుత్తమ ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ ఒకరు. టీమిండియాకు 16 ఏళ్ల పాటు సేవలందించిన రాహుల్ ద్రవిడ్‌ను అభిమానులు ముద్దుగా ద వాల్, మిస్టర్ డిపెండ‌బుల్, కెప్టెన్ కూల్‌గా పిలుచుకుంటారు. అలాంటి ద్రవిడ్ శుక్రవారం 46వ పుట్టినరోజుని జరుపుకుంటున్నారు.

బ్రాండ్‌ విలువ రూ.1200 కోట్లు: కోహ్లీనే టాప్‌, 12వ స్థానంలో ధోనిబ్రాండ్‌ విలువ రూ.1200 కోట్లు: కోహ్లీనే టాప్‌, 12వ స్థానంలో ధోని

ఈ సందర్భంగా ద్రవిడ్‌కు అటు క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక, ద్రవిడ్‌ పుట్టినరోజు సందర్భంగా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ తనదైన స్టయిల్‌లో శుభాకాంక్షలు తెలిపారు. "గోడకు కూడా చెవులుంటాయి అంటారు. ఈ గోడకు స్వచ్ఛమైన మనసు, హృదయం కూడా ఉన్నాయి. అతనితో కలిసి ఆడిన క్షణాలు అద్భుతమైన మధురానుభూతులు" అంటూ సెహ్వాగ్ చేసిన వైరల్ అయింది.

హర్భజన్‌ సింగ్‌

హ్యాపీ బర్త్‌డే జామ్‌.. మీరు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి. యువ క్రికెటర్లను తీర్చిదిద్దుతూ ఉండాలి. వారికి దొరికిన ఎంతో ఉత్తమమైన వ్యక్తి మీరు. మీతో ఎన్నో అద్భుత క్షణాలను పంచుకున్నాం. ఇంకా పంచుకుంటూనే ఉండాలని కోరుకుంటున్నానని హర్భజన్‌ సింగ్‌ ట్వీట్ చేశాడు.

వీవీఎస్‌ లక్ష్మణ్‌

నా స్నేహితుడు రాహుల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. దేశీయ క్రికెట్‌కు ఆయన ఇంకా తన సేవలందించాలి. క్రికెటర్లకు మాత్రమే కాదు దేశంలోని ప్రతి యువతకు ఆదర్శంగా నిలవాలి అంటూ లక్ష్మణ్‌ ట్వీట్ చేశాడు.

సురేశ్‌ రైనా

హ్యాపీ బర్త్‌డే రాహుల్‌ భాయ్‌. మీతో డ్రెసింగ్‌ రూంను పంచుకునే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నా. దాన్ని ఎన్నటికీ మర్చిపోలేను. మీ లాంటి లెజెండ్‌లు ఆడటం వల్లే జెంటిల్‌మెన్ గేమ్‌ అంటారు. మీరు ఓ మంచి స్నేహితుడు, మార్గదర్శకుడు, సారధి. ది వాల్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్రికెట్ అంటూ రైనా ట్వీట్ చేశాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 24,208 ప‌రుగులు చేసిన ద్రవిడ్

2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ద్రవిడ్ మొత్తం 24,208 ప‌రుగులు నమోదు చేశాడు. టెస్టుల్లో 13288 పరుగులు చేశాడు. అందులో 36 సెంచరీలు ఉన్నాయి. క్రికెట్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆరో బ్యాట్స్‌మ‌న్‌గా రికార్డు నమోదు చేశాడు. ఇక వన్డేల్లో 86 అర్ధసెంచరీలు చేసిన ద్రవిడ్ 2003 నుంచి 2007 వరకు టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా చేపట్టాడు.

2003లో విజేతా పెండ్రేకర్‌ను వివాహం చేసుకున్న ద్రవిడ్

వన్డే ఫార్మాట్‌లో అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు చేసిన‌వారిలో నాలుగోస్థానంలో ఉన్నాడు. 2003లో రాహుల్ నాగపూర్‌నకు చెందిన విజేతా పెండ్రేకర్‌ను వివాహం చేసుకున్నాడు. ద్రవిడ్‌కు ఇద్దరు కుమారులు. 2007 వరల్డ్ కప్ తొలి రౌండ్లోనే టీమిండియా ఇంటిదారి పట్టడంతో ఆ తర్వాత కెప్టెన్సీకి రాజీనామా చేసి ప్లేయర్‌గా కొనసాగాడు.

ప్రస్తుతం ఆండర్-19 జట్టు కోచ్‌గా

రిటైరైన తర్వాత టీమిండియా కోచ్ పదవితోపాటు కొన్ని కీలక బాధ్యతలు ఇవ్వడానికి బీసీసీఐ సిద్ధంగా ఉన్నా ద్రవిడ్ వాటిని స్వీకరించలేదు. ప్రస్తుతం ఇండియా ఏ, అండర్-19 జట్లకు కోచ్‌గా యువ క్రికెటర్లకు మెరుగులు దిద్దుతూ భారత క్రికెట్‌కు మార్గదర్శిగా నిలుస్తున్నాడు. గతేడాది అండర్ 19 ప్రపంచ కప్‌ను సునాయాసంగా కైవసం చేసుకున్నారు.

Story first published: Friday, January 11, 2019, 13:21 [IST]
Other articles published on Jan 11, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X