న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కుంబ్లే 48వ పుట్టిన రోజు శుభాకాంక్షలతో..

న్యూ ఢిల్లీ: రిటైర్మెంట్ ప్రకటించి దశాబ్దం గడుస్తున్నా.. భారత్ తరఫున టెస్టుల్లో 600 వికెట్లు, వన్డేల్లో 300 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి, ఏకైక భారత బౌలర్‌గా ఇప్పటికీ నెం.1 స్థానంలో మాజీ కెప్టెన్ కుంబ్లే కొనసాగుతుండటం విశేషం. బెంగళూరులోని కృష్ణస్వామి, సరోజ దంపతులకు అక్టోబరు 17, 1970లో జన్మించిన అనిల్ కుంబ్లే.. తన 48వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.

1989లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన కుంబ్లే.. అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు. అక్కడా బంతితో పాటు బ్యాట్‌తోనూ రాణించి సెంచరీ చేయగలిగాడు. దీంతో.. ఏడాది తిరిగేలోపే భారత జట్టు నుంచి పిలుపొచ్చింది.

కోహ్లీ వికెట్ అలా పడగొట్టేశా: పాక్ బౌలర్ కోహ్లీ వికెట్ అలా పడగొట్టేశా: పాక్ బౌలర్

1996 వన్డే ప్రపంచకప్‌లో 16 వికెట్లతో

1996 వన్డే ప్రపంచకప్‌లో 16 వికెట్లతో

ఏప్రిల్ 25, 1990లో భారత జట్టు తరఫున వన్డేలోకి అరంగేట్రం చేసిన అనిల్ కుంబ్లే.. ఆ తర్వాత ఏ దశలోనూ వెనుదిరిగిన చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. జట్టులో పెద్దన్నగా అందర్నీ కలుపుకుంటూనే సుదీర్ఘకాలం భారత జట్టుకి ఒంటిచేత్తో విజయాల్ని అందిస్తూ వచ్చాడు. టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్‌గా సరికొత్త రికార్డుల్లో నిలిచిన కుంబ్లే 1996 వన్డే ప్రపంచకప్‌లో ఏకంగా 16 వికెట్లతో సత్తాచాటాడు.

భారత్ తరఫున 14 టెస్టులకి నాయకత్వం

భారత్ తరఫున 14 టెస్టులకి నాయకత్వం

2002లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో తలకి గాయమైనా.. బ్యాండేజ్‌తో బౌలింగ్ చేయడం, 2008లో చేతి వేలు చిట్లినా అలానే బ్యాటింగ్‌ చేయడం అతడిలోని పోరాటస్ఫూర్తిని చాటింది. బౌలర్‌గా సక్సెస్ అయిన అనిల్ కుంబ్లే.. కెప్టెన్‌గా మాత్రం రాణించలేకపోయాడు. భారత్ తరఫున 14 టెస్టులకి అతను నాయకత్వం వహించగా.. మూడు గెలిచి, ఐదు ఓడి.. ఆరు డ్రాగా ముగిశాయి.

ఆస్ట్రేలియా పర్యటనలో వర్ణ వివక్ష వివాదం

ఆస్ట్రేలియా పర్యటనలో వర్ణ వివక్ష వివాదం

2007-08 ఆస్ట్రేలియా పర్యటనలో అతని కెప్టెన్సీలోని భారత్ జట్టును ‘వర్ణ వివక్ష' వివాదం నుంచి కుంబ్లే చాకచక్యంతో బయపడేశాడు. ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌ని భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ కోతితో పోల్చాడంటూ ఆరోపణలు రావడంతో ‘మంకీగేట్' వివాదం చెలరేగింది. కానీ.. ఆ సమయంలో కెప్టెన్‌గా చాకచక్యంగా వ్యవహరించిన అనిల్ కుంబ్లే.. మ్యాచ్ తర్వాత ఒక జట్టు మాత్రమే ‘క్రీడాస్ఫూర్తి'తో ఆడిందనడం గర్వించదగ్గ విషయం.

 హుందాగా పదవి నుంచి తప్పుకుని జెంటిల్‌మన్

హుందాగా పదవి నుంచి తప్పుకుని జెంటిల్‌మన్

భారత జట్టుకి కోచ్‌గానూ ఏడాది కాలం పనిచేసిన అనిల్ కుంబ్లే.. అనూహ్య పరిణామాల మధ్య ఆ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి ఆటగాళ్లు అందరూ అతడ్ని ‘హెడ్ మాస్టర్'తో పోలుస్తూ బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. కానీ.. అనిల్ కుంబ్లే మాత్రం.. ఏ ఒక్క ఆటగాడి గురించి వ్యక్తిగతంగా మాట్లాడటం, ఫిర్యాదు చేయడం లాంటివి చేయలేదు. హుందాగా ఆ పదవి నుంచి తప్పుకుని ‘జెంటిల్‌మన్' అనిపించుకున్నాడు.

Story first published: Wednesday, October 17, 2018, 15:03 [IST]
Other articles published on Oct 17, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X