న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అతడి బౌలింగ్‌లో భయపడ్డా: హనుమ విహారి

Hanuma Vihari Reveals the Toughest Bowler he has Faced

హైదరాబాద్: హనుమ విహారి.... ఇప్పుడిప్పుడే భారత టెస్టు క్రికెట్‌లో వినిపిస్తోన్న తెలుగు తేజం పేరు. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనతో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఆడుతున్నాడు. అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రోహిత్ శర్మ గాయపడటంతో అతడి స్థానంలో పెర్త్ టెస్టులో చోటు దక్కించుకున్నాడు.

విహారికి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలి, వరుస సిరీస్‌లలో విఫలమే కారణంవిహారికి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వాలి, వరుస సిరీస్‌లలో విఫలమే కారణం

పెర్త్ టెస్టులో హనుమ విహారి రెండు ఇన్నింగ్స్‌ల్లో (20, 28) పరుగులు చేయడంతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు తీసి ఫరవాలేదనిపించాడు. అయితే, ఈ టెస్టులో టీమిండియా 146 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ 1-1తో సమం అయింది. గత మంగళవారం జైపూర్ వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో కనీసధర రూ. 50 లక్షలు ఉన్న విహారిని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది.

సన్ రైజర్స్ తరుపున ఐపీఎల్ అరంగేట్రం

సన్ రైజర్స్ తరుపున ఐపీఎల్ అరంగేట్రం

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన హనుమ విహారి ఇప్పటివరకు ఐపీఎల్‌లో 22 మ్యాచ్‌లాడి 280 పరుగులు చేశాడు. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఇప్పటివరకు తాను ఎదుర్కొన్న పేస్‌ బౌలర్లలో డేల్‌ స్టెయిన్‌ (దక్షిణాఫ్రికా) అత్యంత ప్రమాదకారని తెలుగు క్రికెటర్‌ హనుమ విహారి చెప్పాడు.

 అతడి బౌలింగ్‌ను దగ్గర్నుంచి పరిశీలించా

అతడి బౌలింగ్‌ను దగ్గర్నుంచి పరిశీలించా

2013 ఐపీఎల్‌ సీజన్లో స్టెయిన్‌తో కలిసి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడినప్పుడు అతడి బౌలింగ్‌ను చాలా దగ్గర్నుంచి పరిశీలించానని తెలిపాడు. స్టెయిన్‌ బౌలింగ్‌లో ఆడినప్పుడు ఒకటి.. రెండుసార్లు భయపడ్డానన్నా డు. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విహారి 2015 తర్వాత ఐపీఎల్‌కు దూరంగా ఉన్నాడు.

ఓపెనర్‌గా హనుమ విహారికి ప్రమోషన్!

ఓపెనర్‌గా హనుమ విహారికి ప్రమోషన్!

ఆసీస్ పర్యటనలో వరుసగా వైఫల్యాలు ఎదుర్కొంటున్న ఓపెనర్లను తప్పించాలని వారి స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ టెస్టుల్లోకి తీసుకోవాలంటూ సీనియర్లు సూచిస్తున్నారు. మాజీ క్రికెటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ మాత్రం మురళీ విజయ్‌ను ఓపెనర్‌గా కొనసాగిస్తూనే.. అతడికి జోడీగా మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారికి ప్రమోషన్‌ ఇవ్వాలని అన్నాడు.

మంచి టెక్నిక్‌తోపాటు ఓర్పుగా క్రీజులో నిలబడతాడు

మంచి టెక్నిక్‌తోపాటు ఓర్పుగా క్రీజులో నిలబడతాడు

మంచి టెక్నిక్‌తోపాటు ఓర్పుగా క్రీజులో నిలబడడం హనుమకు ప్లస్‌ అని చెప్పాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య మూడో టెస్టు జనవరి 26 నుంచి మెల్ బోర్న్ వేదికగా జరగనుంది. ఇప్పటికే ముగిసిన రెండు టెస్టుల్లో చెరోకటి విజయం సాధించడంతో సిరిస్ 1-1తో సమం అయింది.

Story first published: Saturday, December 22, 2018, 11:35 [IST]
Other articles published on Dec 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X