న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ICC Women's World Cup 2021: ఫైనల్ మ్యాచ్‌కి ఆతిథ్యమిచ్చే నగరమిదే!

Hagley Oval in Christchurch to host ICC Womens World Cup final in 2021

హైదరాబాద్: 2021లో జరిగే ఐసీసీ మహిళల వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిచ్చే నగరాల జాబితాను ఐసీసీ గురువారం విడుదల చేసింది. న్యూజిలాండ్ ఆతిథ్యమిస్తోన్న ఈ మెగా టోర్నీకి మొత్తం ఆరు నగరాలు ఆక్లాండ్, వెల్లింగ్టన్, హామిల్టన్, టౌరంగా, డునెడిన్. క్రైస్ట్‌ చర్చ్‌ల్లో మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి 6 నుంచి మార్చి 7 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీలో మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్‌కి క్రైస్ట్‌ చర్చ్‌‌లోని హాగ్లీ ఓవల్ స్టేడియం ఆతిథ్యమిస్తుండగా... హామిల్టన్, టౌరంగాల్లో సెమీఫైనల్ మ్యాచ్‌లు ఆతిథ్యమివ్వనున్నాయి. దీనిపై ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది.

మహిళల ప్రపంచ కప్ సీఈఓ ఆండ్రియా నెల్సన్ మాట్లాడుతూ "ఆరు నగరాలను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. ఉత్తమ వేదికలలో మొత్తం 31 మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ మ్యాచ్‌లు న్యూజిలాండ్ క్రీడా అభిమానులను వీలైనంత ఎక్కువ మంది టోర్నీలో పాల్గొనడానికి వీలు కల్పిస్తుంది" అని చెప్పారు.

"ఈ నగరాలను ఎంపిక చేయడానికి మేము ప్రక్రియను అవలంభించాం. ఈ ప్రక్రియ యొక్క ఫలితాలతో ఇప్పుడు లాక్ చేయబడిన నగరాలతో మేము పూర్తిగా ఆశ్చర్యానికి లోనయ్యాం" అని ఆమె తెలిపారు. కాగా, ఈ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది.

2017లో లార్డ్స్ వేదికగా భారత మహిళల జట్టుతో జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్ ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీకి సంబంధించిన పూర్తి స్థాయి మ్యాచ్ షెడ్యూల్ మార్చిలో అధికారికంగా ప్రారంభించినప్పుడు ప్రకటించబడుతుందని ఆమె చెప్పుకొచ్చారు.

Story first published: Thursday, January 23, 2020, 15:10 [IST]
Other articles published on Jan 23, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X