న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీకి గంభీర్‌ మద్దతు.. గంగూలీ సారథ్యంలోనే విదేశాల్లో విజయ పరంపర!!

Gautam Gambhir Backs Virat Kohli, Says India Is Carrying Sourav Ganguly’s Legacy || Oneindia Telugu
Gautam Gambhir supports Virat Kohli: No doubt India started winning more away from home under Sourav Ganguly


ముంబై:
భారత జట్టుకు దూకుడు నేర్పి విజయాలు బాట పట్టించింది మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీనే, దాన్నే మేము కొనసాగిస్తున్నాం అని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్‌తో చారిత్రక డే/నైట్‌ టెస్టు విజయం అనంతరం అన్న విషయం తెలిసిందే. కోహ్లీ అభిప్రాయంను భారత దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ విభేదించగా.. మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ మాత్రం ఏకీభవించాడు. దేశాల్లో టీమిండియా విజయ పరంపర గంగూలీ సారథ్యంలోనే ప్రారంభం అయింది అని అన్నాడు.

ట్విటర్‌కు సచిన్‌ ఫిర్యాదు: అన్నీ ఫేక్ అకౌంట్లు.. చర్యలు తీసుకోండి!!ట్విటర్‌కు సచిన్‌ ఫిర్యాదు: అన్నీ ఫేక్ అకౌంట్లు.. చర్యలు తీసుకోండి!!

కోహ్లీతో ఏకీభవించిన గంభీర్‌:

కోహ్లీతో ఏకీభవించిన గంభీర్‌:

తాజాగా గంభీర్ మాట్లాడుతూ... 'అది కోహ్లీ వ్యక్తిగత ఆలోచన. గంగూలీ సారథ్యంలోనే విదేశాల్లో మన జట్టు విజయ పరంపర ప్రారంభం అయింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. మాజీ కెప్టెన్‌లు సునీల్‌ గావస్కర్‌, కపిల్‌ దేవ్‌, ఆ తర్వాత కెప్టెన్‌ల నేతృత్వంలో టీమిండియా స్వదేశంలో ఆధిపత్యం కనబరిచేది. అయితే గంగూలీ నాయకత్వంలో మనం విదేశాల్లో గెలవడం మొదలైంది. గంగూలీ వారసత్వాన్ని కొనసాగిస్తున్నామన్న కోహ్లీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా' అని పేర్కొన్నాడు.

దూకుడు నేర్పిందే దాదా:

దూకుడు నేర్పిందే దాదా:

టెస్ట్ విజయం తర్వాత కోహ్లీ మాట్లాడుతూ... 'భారత జట్టుకు దూకుడు నేర్పి విజయాలు బాట పట్టించింది గంగూలీనే, దాన్నే మేము కొనసాగిస్తున్నాం. మ్యాచ్‌లను ఎలా జయించాలో గంగూలీనే పరిచయం చేశాడు. గత మూడు-నాలుగేళ్ల నుంచి తాము జట్టుగా ఎంతో కృషి చేస్తూ ఉండటమే తాజా వరుస విజయాలకు కారణం. టెస్టు క్రికెట్‌ అనేది మానసిక యుద్ధం. దాన్ని ఎలా జయించాలో దాదా నుంచి నేర్చుకున్నాం' అని కోహ్లీ తెలిపాడు.

అప్పటికీ కోహ్లీ పుట్టలేదు:

అప్పటికీ కోహ్లీ పుట్టలేదు:

గావస్కర్‌ మాట్లాడుతూ... 'డే/నైట్‌ అద్భుతమైన విజయం. జట్టులోని అందరూ బాగా ఆడారు. అయితే భారత జట్టు విజయ పరంపర 2000 నుంచి దాదా జట్టుతో మొదలైందని విరాట్ కోహ్లీ అన్నాడు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడని తెలుసు. కాబట్టి దాదా గురించి కోహ్లీ బాగా మాట్లాడాడు. టీమిండియా 1970, 80ల్లోనే విజయాలను నమోదు చేసింది. అప్పటికీ కోహ్లీ పుట్టలేదు' అని అన్నాడు.

అప్పట్లోనే విదేశీ గడ్డపై సిరీస్‌లు డ్రా చేసుకున్నాం:

అప్పట్లోనే విదేశీ గడ్డపై సిరీస్‌లు డ్రా చేసుకున్నాం:

'2000ల్లోనే క్రికెట్‌ ప్రారంభమైందని ఇప్పటికీ చాలా మంది భావిస్తున్నారు. కానీ.. భారత జట్టు 70ల్లోనే విదేశాల్లో విజయాలు నమోదు చేసింది. 1986లోనూ గెలుపొందింది. అప్పట్లోనే విదేశీ గడ్డపై సిరీస్‌లు డ్రా చేసుకుంది. ఇతర జట్లలాగే ఓటమిపాలైంది' అని గావస్కర్‌ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, November 28, 2019, 11:40 [IST]
Other articles published on Nov 28, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X