న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్యాట్స్‌మన్‌గానే కాదు.. కెప్టెన్‌గానూ వందశాతం విజయవంతమే!!

Gautam Gambhir The Only Indian Captain Have 100 Percent Win Record | Oneindia Telugu
Gautam Gambhir have 100% win record as captain

న్యూ ఢిల్లీ: బ్యాట్స్‌మెన్‌గానే కాదు కెప్టెన్‌గా కూడా గౌతం గంభీర్ వంద శాతం విజయాన్ని సాధించాడు. టీమిండియాలో బ్యాట్స్‌మన్‌గా రాణించిన గంభీర్ కొన్ని సందర్భాల్లో కెప్టెన్‌గా వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులను అందుకున్న గౌతీ కెప్టెన్సీలో వంద శాతం విజయవంతమైయ్యాడు. ఈ క్రమంలో 2010లో న్యూజిలాండ్‌తో ఆడిన వన్డే మ్యాచ్‌లో భారత్ పర్యాటక జట్టును 5-0తేడాతో చిత్తుగా ఓడించింది.

6వన్డేలకు ఆరింటిలోనూ విజయం

6వన్డేలకు ఆరింటిలోనూ విజయం

ఫైనల్‌ మ్యాచ్‌ను చెన్నైలో గెలిచింది. ధోనీ గైర్హాజరీతో జట్టును విజయవంతంగా నడిపించడంలో తొలిసారి విజయాన్ని అందుకున్నాడు గంభీర్. సంవత్సరం తర్వాత అదే వేదికగా వెస్టిండీస్‌తో ఆడిన మ్యాచ్‌లో మరోసారి ఆడి గెలిచి సత్తా చాటుకున్నాడు. ఇలా గంభీర్ 6వన్డేలకు నాయకత్వం వహించి ఆరింటిలోనూ విజయం సాధించాడు. ఇలా ఒకే ఒక్క టీమిండియా కెప్టెన్ ఆడిన అన్నీ మ్యాచ్‌లను వంద శాతం విజయాలతో ముగించాడు.

2003లో ఏప్రిల్‌లో తొలిసారి

2003లో ఏప్రిల్‌లో తొలిసారి

దురదృష్టవశాత్తు గంభీర్‌కు టీ20, టెస్టులలో కెప్టెన్సీ వహించేందుకు అవకాశం దొరకలేదు. 2003లో ఏప్రిల్‌లో తొలిసారి భారత జట్టు తరఫున ఆడిన గంభీర్‌... 2016 నవంబర్‌లో రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌పై తన ఆఖరి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. అతని టి20 కెరీర్‌ 2012లో, వన్డే కెరీర్‌ 2013లోనే ముగిసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేలకు పైగా పరుగులు చేసిన గంభీర్‌ తన వీడ్కోలుపై.. ఆంధ్రతో ఢిల్లీ ఆడబోయే తర్వాతి రంజీ మ్యాచే నా కెరీర్‌లో ఆఖరిది.

ఇక సెలవు

ఇక సెలవు

నా కెరీర్‌ మొదలైన ఫిరోజ్‌ షా కోట్లాలోనే నా ప్రస్ధానం ముగియనుంది. రిటైర్మెంట్‌ ఆలోచన కొంతకాలంగా నన్ను వెంటాడుతోంది. చికాకు పరిచే అదనపు సరంజామాగా విమానాల్లోనూ నాతో ప్రయాణించింది. నాతోపాటు సాధనకూ వచ్చింది. నన్ను వెక్కిరిస్తూనే ఉంది. ఎవరో నా కథ రాస్తున్నారనేది నా భావన. ఐతే ఇప్పుడు సిరా అయిపోయింది. కానీ ఈ క్రమంలో కొన్ని మనోహరమైన అధ్యాయాలు రాశాడు. న్యూజిలాండ్‌లో సిరీస్‌ విజయం, ఆస్ట్రేలియాలో సీబీ సిరీస్‌ విజయం నా కథలో మధుర అధ్యాయాలే.

Story first published: Wednesday, December 5, 2018, 16:18 [IST]
Other articles published on Dec 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X