న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'బీసీసీఐలో అవినీతిని అడ్డుకోవడానికి ఆదివారం సెలవేమో?'

Gautam Gambhir fumes at BCCI, CAB for honouring corrupt Azharuddin at Eden Gardens

హైదరాబాద్: భారత వెటరన్ క్రికెటర్ గౌతం గంభీర్ బీసీసీఐపై నిప్పులు చెరుగుతున్నాడు. పనిలో పనిగా క్రికెట్ అసోసియేషన్ బెంగాల్(సీఏబీ), సుప్రీం కోర్టుచే నియమితమైన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్(సీఓఏ)లకు సైతం చురకలు అంటించాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో భారత్ తలపడిన టీ20కారణంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ఆరంభించడానికి అన్నట్లుగా ముందుగా బెల్ మోగించి సిగ్నల్ ఇచ్చాడు భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ అజారుద్దీన్.

 గౌతం గంభీర్‌కు ఏ మాత్రం రుచించకపోవడంతో:

గౌతం గంభీర్‌కు ఏ మాత్రం రుచించకపోవడంతో:

ఇలా అజారుద్దీన్ చేతుల మీదుగా ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ ఆరంభమవడం ఢిల్లీ క్రికెటర్ గౌతం గంభీర్‌కు ఏ మాత్రం రుచించలేదు. ఈ నేపథ్యంలోనే గంభీర్.. తన ట్విట్టర్ ఖాతా ద్వారా సీఓఏను, బీసీసీఐను, టీమిండియా మాజీ కెప్టెన్ నేతృత్వంలో నడుస్తోన్న క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్‌ను కలిపి ఏకరవు పెట్టేశాడు. గౌతం గంభీర్‌కు ఈడెన్ గార్డెన్స్ స్టేడియానికి చాలా అవినాభావ సంభందమే ఉంది. ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కత్తా నైట్ రైడర్స్ జట్టు సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్ వేదికగా గంభీర్ రెండు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను అందుకున్నాడు.

ఇవాళ భారత్ గెలవచ్చేమో.. కానీ, నన్ను క్షమించు...

'ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఇవాళ భారత్ గెలవచ్చేమో.. కానీ, నన్ను క్షమించు... బీసీసీఐ, సీఓఏ, సీఏబీ. నాకు తెలిసి ఆదివారం రోజుల్లో లంచగొండిల నిషేదం ఏమైనా సడలింపులు ఉన్నాయేమో బీసీసీఐకి. అజారుద్దీన్ హెచ్‌సీఏ ఎన్నికల్లో పోటీచేసేందుకు అనుమతి వచ్చిన సంగతి తెలుసు కానీ, ఇది ఒక షాకింగ్‌గా అనిపిస్తోంది. ఏవో అదృశ్య శక్తులు ఉంటే అవి కచ్చితంగా వింటాయి ' అంటూ పోస్టు చేశాడు.

2000వ సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడి:

2000వ సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడి:

సౌరవ్ గంగూలీ కంటే ముందు అత్యంత విజయవంతమైన కెప్టెన్ అజారుద్దీన్.. 1993 హీరో కప్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్‌ను వెస్టిండీస్‌పై గెలిచాడు. అజారుద్దీన్ తన కెరీర్‌లో 99టెస్టులను 334వన్డేలను ఆడి 2000వ సంవత్సరంలో జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ విషయంలో నిషేదానికి గురైయ్యాడు. అదే నిషేదం 2012వరకూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నడుస్తూనే ఉంది.

ముందు నిరాకరించిన బీసీసీఐ

ముందు నిరాకరించిన బీసీసీఐ

కొంతకాలం ముందు మొహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు పోటీ చేసేందుకు ప్రయత్నించగా బీసీసీఐ దానికి నిరాకరించింది. ఇన్నేళ్లకు అతని నిషేదాన్ని మరింతకాలం పొడిగించలేమంటూ బీసీసీఐ చేతులెత్తేసింది. దీంతో ఈ సంవత్సరారంభంలో మళ్లీ అతను పోటీ చేసేందుకు సిద్ధమైయ్యాడు.

Story first published: Monday, November 5, 2018, 14:58 [IST]
Other articles published on Nov 5, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X