న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కారును పంపించి మరి ద్రవిడ్‌ నాతో మాట్లాడాడు..అతని స్థానంలోనే నాకు ఆడే అవకాశం వచ్చింది:పాక్ మాజీ క్రికెటర్‌

Former Pakistan pacer Yasir Arafat remembers Rahul Dravids gesture in 2014 England tour
Inzamam-ul-Haq Seeks India-Pak Bilateral Series For 'Betterment' Of Cricket | Oneindia Telugu

కరాచీ: టీమిండియా మాజీ కెప్టెన్, జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్ రాహుల్‌ ద్రవిడ్‌పై పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ యాసిర్‌ అరాఫత్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ద్రవిడ్‌ చాలా మంచి వ్యక్తి అని, తనతో మాట్లాడేందుకు కారు దిగి రావడం సంతోషకరమన్నాడు. పిలవగానే తన గొంతు విని దగ్గరకు రావడం అతడి హుందాతనమని వెల్లడించారు. ఈ ఘటన 2014లో జరిగిందని అరాఫత్‌ తెలిపారు. లార్డ్స్‌ వేదికగా 2014లో జరిగిన భారత్, ఇంగ్లండ్ రెండో టెస్టుకు ద్రవిడ్‌ వెళ్లారు. మ్యాచ్‌ ఆరంభంలో గంట మోగించారు. ఆ తర్వాత వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఆ సమయంలోనే ద్రవిడ్‌ను అరాఫత్‌ కలిశారు.

స్పోర్ట్స్ యారి యూట్యూబ్ ఛానెల్‌లో యాసిర్‌ అరాఫత్‌ తాజాగా మాట్లాడాడు. '2014లో జరిగిన భారత్, ఇంగ్లండ్ రెండో టెస్టు మ్యాచ్‌కు వ్యాఖ్యానం చేసేందుకు రాహుల్‌ ద్రవిడ్‌ లార్డ్స్‌కు వచ్చారు. ఆట ముగిశాక స్టేడియం బయటకు వచ్చి.. కారును పిలిచి అందులోకి ఎక్కబోతున్నారు. రాహుల్‌ భాయ్‌ అంటూ దూరం నుంచి నేను పిలవడంతో ఆగిపోయారు. నా గొంతు విని కారును పంపించేశారు. నిజానికి పాకిస్తాన్ తరఫున నేను ఎక్కువగా క్రికెట్‌ ఆడలేదు. అయినప్పటికీ రాహుల్‌ నాతో 10-15 నిమిషాలు మాట్లాడారు. నా క్రికెట్‌ కెరీర్‌, కుటుంబం గురించి వివరాలు అడిగారు. ఆ సమయంలో నిజంగా నాకెంతో సంతోషం వేసింది' అని అరాఫత్‌ తెలిపారు.

బాగా ఆడినా ఎంపిక చేయలేదు.. చాలా బాధగా ఉంది! ఆటకు వయసు అడ్డుగా కనిపిస్తే నేను ఏం చేయలేను!బాగా ఆడినా ఎంపిక చేయలేదు.. చాలా బాధగా ఉంది! ఆటకు వయసు అడ్డుగా కనిపిస్తే నేను ఏం చేయలేను!

అంతర్జాతీయ కెరీర్లో తన తొలి వికెట్‌ రాహుల్‌ ద్రవిడ్‌దే కావడం గొప్ప గుర్తింపని యాసిర్‌ అరాఫత్‌ పేర్కొన్నారు. కౌంటీ క్రికెట్లో రాహుల్‌ స్థానంలోనే తనకు అవకాశం వచ్చిందని గుర్తుతెచ్చుకున్నారు. '2003లో రాహుల్‌ ద్రవిడ్‌ స్కాంట్లాండ్‌ తరఫున కౌంటీ క్రికెట్‌ ఆడేవారు. వ్యక్తిగత కారణాల వల్ల 2004 ఎడిషన్‌ ఆడలేదు. నిర్వాహకులు అతడి స్థానంలో నన్ను తీసుకున్నారు. నిజానికి భాయ్ స్థానంలోనే నాకు ఆడే అవకాశం వచ్చింది. ద్రవిడ్‌ ఆ ఎడిషన్‌ ఆడుంటే.. నేను ఆడేవాడిని కాకపోవచ్చు' అని అరాఫత్‌ పేర్కొన్నాడు.

'పాకిస్తాన్ తరఫున నేనాడింది మూడు టెస్టులే. 2007 డిసెంబర్లో భారత్‌పై అరంగేట్రం చేశాను. ఐదు వికెట్ల ఘనత అందుకున్నాను. టెస్టుల్లో రాహుల్‌ ద్రవిడ్‌దే నా తొలి వికెట్‌ కావడం అద్భుతం. నా కెరీర్లోనే తీసిన అత్యంత అమూల్యమైన వికెట్‌ అని కచ్చితంగా చెప్పగలను' అని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ యాసిర్‌ అరాఫత్‌ వెల్లడించారు. 39 ఏళ్ల అరాఫత్ తరఫున తన కెరీర్‌లో 3 టెస్టులు, 11 వన్డేలు, మరియు 13 టీ20లు పాక్ తరఫున ఆడారు. కౌంటీ క్రికెట్‌లో మాత్రం రెగ్యులర్‌గా ఆడేవారు. సస్సెక్స్, సర్రే, హాంప్‌షైర్ మరియు సోమర్సెట్ జట్లకు అతడు ఆడాడు.

Story first published: Friday, June 11, 2021, 16:48 [IST]
Other articles published on Jun 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X