న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మాజీ లెజెండరీ స్పిన్నర్ అబ్దుల్‌ ఖాదిర్‌ గుండెపోటుతో కన్నుమూత

 Former Pakistan leg-spin maestro Abdul Qadir dies of cardiac arrest; India-Pakistan players mourn his demise

హైదరాబాద్: పాకిస్థాన్ మాజీ లెజెండరీ స్పిన్నర్ అబ్దుల్‌ ఖాదిర్‌ (64) తీవ్రమైన గుండెపోటుతో శుక్రవారం కన్నుముశారు. ఆయనకు భార్య, నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఇంట్లో ఉన్న సమయంలో ఖాదిర్‌కు తీవ్రమైన గుండెనొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. లాహోర్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

<strong>4 బంతుల్లో 4 వికెట్లు: టీ20ల్లో లసిత్ మలింగ సంచలనం</strong>4 బంతుల్లో 4 వికెట్లు: టీ20ల్లో లసిత్ మలింగ సంచలనం

పాక్‌ తరఫున 67 టెస్టులు

పాక్‌ తరఫున 67 టెస్టులు ఆడిన ఖాదిర్‌ 32.80 సగటుతో 236 వికెట్లు పడగొట్టాడు. ఇక, 104 వన్డేల్లో 132 వికెట్లు తీశాడు. కుంబ్లేలు, వార్న్‌లు లెగ్‌స్పిన్‌కు కేరాఫ్‌ అడ్రస్‌లుగా మారకముందు 80వ దశకంలో తన మణికట్టు మాయాజాలంతో ఖాదిర్‌ పాక్‌ జట్టుకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు.

లెగ్‌స్పిన్‌ బౌలింగ్‌కు ప్రత్యేక గుర్తింపు

ఇక లెగ్‌స్పిన్‌ బౌలింగ్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఖాదిర్ గుగ్లీకి కూడా ఎంతో ప్రాచుర్యం తీసుకొచ్చాడు. 1987లో ఇంగ్లండ్‌పై ఒక ఇన్నింగ్స్‌లో ఖాదిర్‌ 56 పరుగులిచ్చి 9 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్‌ తరఫున ఇప్పటికీ ఇదే అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన కావడం విశేషం. అబ్దుల్‌ ఖాదిర్‌ బౌలింగ్‌ శైలిని అనుకరిస్తూ ముస్తాక్‌ అహ్మద్‌ అంతర్జాతీయ ఖ్యాతి పొందడం విశేషం.

ఖాదిర్‌ ఎప్పటికీ గుర్తుండిపోతాడు

ఖాదిర్‌ ఎప్పటికీ గుర్తుండిపోతాడు

ఇక భారత క్రికెట్‌ అభిమానులకు ఖాదిర్‌ ఎప్పటికీ గుర్తుండిపోతాడు. 1989లో ఓ ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లో ఖాదిర్‌ బౌలింగ్‌లో 16 ఏళ్ల సచిన్‌ టెండూల్కర్‌ (6, 0, 4, 6, 6, 6) విరుచుకుపడి ఏకంగా 28 పరుగులు రాబట్టాడు. 2009లో చీఫ్ సెలెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో పాక్‌ జట్టు ఇంగ్లండ్‌లో జరిగిన టీ20 వరల్డ్‌క్‌పను కైవసం చేసుకోవడం విశేషం.

ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు

ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు

ఖాదిర్‌ బాటలోనే క్రికెట్‌లోకి అడుగు పెట్టిన అతనికి నలుగురు కుమారులు రెహమాన్, ఇమ్రాన్, సులేమన్ , ఉస్మాన్‌ కూడా ఫస్ట్‌ క్లాస్‌ స్థాయిలో ఆడారు. ఉస్మాన్‌ కూడా గత సీజన్లో బిగ్ బాష్ టీ 20 లీగ్‌లో కనిపించాడు. ఉస్మాన్‌ త్వరలో ఆస్ట్రేలియా జట్టుకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం పాక్‌ జట్టుకు ఆడుతున్న ఉమర్ అక్మల్.. ఖాదిర్‌కు స్వయానా అల్లుడు. ఖాదిర్ మృతిపై మాజీ క్రికెటర్లు, అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

Story first published: Saturday, September 7, 2019, 10:01 [IST]
Other articles published on Sep 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X