న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అతడి వల్ల కాదు... సారథ్య బాధ్యతల నుంచి తప్పించండి'

Former Pakistan captains want Sarfraz Ahmed to be removed as Pakistan Test captain

హైదరాబాద్: పాకిస్థాన్ టెస్టు జట్టు సారథ్య బాధ్యతల నుంచి సర్ఫరాజ్ అహ్మద్ తప్పుకోవాలని మాజీ కెప్టెన్లు జహీర్ అబ్బాస్, షాహిద్ అఫ్రిదిలు వ్యాఖ్యానించారు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అతడు కెప్టెన్‌గా ఉన్నా ఫరవాలేదు గానీ... టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటే అతడికి, పాక్‌ క్రికెట్‌కు ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు.

కరాచీలో షాహిద్ అఫ్రిది మీడియాతో మాట్లాడుతూ వన్డే, టీ20లకు కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ విజయంతమయ్యాడని... అయితే, టెస్టు క్రికెట్‌కు అతడు కరెక్ట్ ఛాయిస్ కాదని అన్నాడు. సర్ఫరాజే స్వయంగా టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుని పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెడితే బాగుంటుందని అఫ్రిది ఈ సందర్భంగా వెల్లడించాడు.

టీ20ల్లో కోహ్లీ మరో రికార్డు: 45 శాతం పరుగులు చేధనలోనే!టీ20ల్లో కోహ్లీ మరో రికార్డు: 45 శాతం పరుగులు చేధనలోనే!

ఆఫ్రిది మాట్లాడుతూ "టెస్టు సారథ్య బాధ్యతల నుంచి సర్ఫరాజ్‌ తనకు తానుగా తప్పుకుంటే మంచిది. మూడు ఫార్మట్లకు కెప్టెన్‌గా వ్యవహరించడమనేది అధిక భారంతో కూడుకున్నది. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అతడు విజయవంతమైన కెప్టెన్. టెస్టు జట్టు సారథిగా సర్ఫరాజ్‌ ఎంపిక సరైనది కాదు" అని అన్నాడు.

2017లో మిస్బా ఉల్ హాక్ రిటైర్మెంట్ తర్వాత మూడు ఫార్మాట్లకు సర్ఫరాజే కెప్టెన్‌గా వ్వవహారిస్తున్నాడు. సర్ఫరాజ్ నాయకత్వంలో జట్టు టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం 7వ స్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టెస్టు సారథ్యం నుంచి సర్ఫరాజ్ తప్పుకోవాలనే వాదన తెరపైకి వచ్చింది.

మూడు ఫార్మాట్లకు సర్ఫరాజ్ కెప్టెన్‌గా వ్వవహారించడం ఒత్తిడితో కూడుకుని ఉంటుందని మాజీ క్రికెటర్ జహీర్‌ అబ్బాస్‌ అభిప్రాయపడ్డాడు. టెస్టు క్రికెట్‌ చాలా కఠినమైనదని... ఈ ఫార్మట్‌లో కెప్టెన్‌గా వ్యవహరించడమనేది సవాల్‌తో కూడుకున్నదని.. ఆ సత్తా సర్ఫరాజ్‌కు లేదని జహీర్ అబ్బాస్ చెప్పుకొచ్చాడు.

మరోవైపు మిస్బా ఉల్ హక్‌కే రెండు పదవులు కట్టబెట్టిన సెలక్టర్లపై జహీర్ అబ్బాస్ మండిపడ్డాడు. మిస్బావుల్‌ హక్‌ను చీఫ్‌ సెలక్టర్‌గా, ప్రధాన కోచ్‌గా నియమించడం సరైనది కాదని అభిప్రాయపడ్డాడు. రెండు పదవులు మిస్బావుల్‌కు అప్పగించడంతో అతడిపై అధిక భారం పడుతుందని తెలిపాడు.

Story first published: Friday, September 20, 2019, 20:02 [IST]
Other articles published on Sep 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X