న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsAUS : గిల్ బ్యాటింగ్‌తో రాహుల్‌పై ఒత్తిడి.. డేంజర్‌లో ఓపెనింగ్ స్థానం?

Former legend says KL Rahul will be in pressure because of Gill form

టీమిండియా వెటరన్ బ్యాటర్ కేఎల్ రాహుల్‌పై ఒత్తిడి పెరుగుతోందా? అతను రాణించకుంటే జట్టులో చోటు కష్టమేనా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అన్ని ఫార్మాట్లలో మూడంకెల స్కోరు అందుకున్నాడు. వన్డేల్లో అయితే డబుల్ సెంచరీ కూడా చేశాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో రాహుల్ స్థానంలో అతనితో ఓపెనింగ్ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది.

దీనిపై మాజీ లెజెండ్ మహమ్మద్ కైఫ్ స్పందించాడు. గిల్ ఫామ్ వల్ల రాహుల్‌పై ఒత్తిడి పడటం సహజమేనని కైఫ్ అన్నాడు. 'రాహుల్ మొదటి మ్యాచు నుంచే నిలకడగా రాణించాల్సి ఉంటుంది. తొలి రెండు ఇన్నింగ్సుల్లో అతను ఫెయిలైతే.. గిల్ ఓపెనింగ్ చేయడం ఖాయమని చెప్పాలి. గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ టెస్టు సిరీస్‌లో గిల్ ఆడటం గ్యారంటీ.

Former legend says KL Rahul will be in pressure because of Gill form

అయితే అది ఓపెనర్‌గా కుదరదు. కాబట్టి ఐదు లేదా ఆరో స్థానంలో ఆడతాడు. రోహిత్, రాహుల్ ఓపెనర్లుగా వస్తారు. పుజారా, కోహ్లీ.. మూడు. నాలుగు స్థానాల్లో ఆడతారు. ఆ తర్వాత శ్రేయాస్ ఫిట్‌గా లేడు కాబట్టి ఐదు, ఆరు స్థానాల్లో గిల్ ఆడే అవకాశం ఉంది' అని కైఫ్ వివరించాడు.

గిల్ ప్రస్తుతం సూప్ ఫామ్‌లో ఉన్నాడని మరీ మరీ చెప్పిన కైఫ్.. బంగ్లాదేశ్‌పై అతను తొలి టెస్టు సెంచరీ చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. ఆ తర్వాత గిల్ బ్యాటు మళ్లీ ఎక్కడా ఆగలేదని, ధారాళంగా పరుగులు చేస్తూనే ఉందని వివరించాడు. గిల్ వంటి ఆటగాడిని పదకొండు మందిలో చూడటానికి అందరూ ఇష్టపడతారని చెప్పాడు. కాబట్టి అతనికి ఏదో ఒక స్థానంలో ఆడే అవకాశం దక్కుతుందని తేల్చేశాడు. గిల్ క్లాస్ బ్యాటర్ అని, ఫామ్ కూడా అతనితో ఉందని కొనియాడాడు. అన్నిటికన్నా ముఖ్యంగా గిల్ ఆటలో సింప్లిసిటీ ఉందన్నాడు.

Story first published: Thursday, February 2, 2023, 18:33 [IST]
Other articles published on Feb 2, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X