న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీ కెరీర్ ఇంకా ముగియలేదు.. అతడిని అర్థం చేసుకోవడం అసాధ్యం'

Former India wicketkeeper Vijay Dahiya said MS Dhoni is not finished yet

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ఇంకా ముగిసిపోలేదని భారత మాజీ వికెట్ కీపర్ విజయ్ దాహియా పేర్కొన్నారు. ధోనీ మనసులో ఏముందో ఎవరూ కనిపెట్టలేరన్నారు. మహీతో దాదాపు 30 ఏళ్లపాటు కలిసి ఉన్న వారు కూడా అతడి మనసును చదవలేరని, ధోనీ తనంతతానుగా బయటపెట్టేవరకు తెలుసుకోలేరని దహియా చెప్పుకొచ్చారు. భారత్ తరఫున విజయ్ దాహియా రెండు టెస్టులు, 19 వన్డే మ్యాచ్‌లాడారు. కేవలం ఏడాదిలోనే దాహియా కెరీర్ ముగిసింది. ఆ తర్వాత కోచ్‌గా స్థిరపడ్డారు.

'శాంసన్‌ రెండు ఐపీఎల్‌లలో రాణిస్తే.. 2021 టీ20 ప్రపంచకప్‌ ఆడతాడు''శాంసన్‌ రెండు ఐపీఎల్‌లలో రాణిస్తే.. 2021 టీ20 ప్రపంచకప్‌ ఆడతాడు'

ధోనీ కెరీర్ ఇంకా ముగియలేదు:

ధోనీ కెరీర్ ఇంకా ముగియలేదు:

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ దాహియా భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 'ఎంఎస్ ధోనీతో కలిసి 30 ఏళ్లు జీవించిన వాళ్లు కూడా.. అతని ఆలోచనలు ఏంటి? ఏం చేయబోతున్నాడు? అనే విషయాల్ని తెలుసుకోలేరు. ధోనీ అంటే అదే మరి. ఏ విషయం అతడు చెప్పేవరకు బయటకు రాదు. భారత క్రికెట్‌కి గురించి మాట్లాడిన ప్రతిసారి.. ధోనీ గురించి తప్పకుండా ప్రస్తావన వస్తుంది. అతని గొప్పతనం అలాంటిది. నా అంచనా ప్రకారం అతని కెరీర్ ఇంకా ముగియలేదు' అని దాహియా అన్నారు.

అప్పటినుండి మళ్లీ బ్యాట్ పట్టిందిలేదు:

అప్పటినుండి మళ్లీ బ్యాట్ పట్టిందిలేదు:

ఎంఎస్ ధోనీ మళ్లీ భారత్‌ తరపున మళ్లీ క్రికెట్ ఆడతాడా? లేదా? అని సగటు భారత క్రికెట్ అభిమాని మనసులో మెదులుతున్న ప్రశ్న. 2019 ప్రపంచకప్ సెమీ ఫైనల్ ఓటమి తరువాత ధోనీ మళ్లీ బ్యాట్ పట్టింది లేదు. దాంతో కొన్ని నెలల క్రితం బీసీసీఐ ప్లేయర్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి కూడా ధోనీని తొలగించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ 2020తో పునరాగమనం చేద్దామనుకున్న ధోనీకి కరోనా వైరస్ ఆశాభంగం కలిగించింది. లాక్‌డౌన్‌ కారణంగా నిరవధికంగా వాయిదా పడిన ఐపీఎల్‌ 13వ సీజన్‌పై స్పష్టత రావడంతో.. అందరి కళ్లూ ఇప్పుడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి ధోనీపై పడ్డాయి.

చెన్నైలో సాధన:

చెన్నైలో సాధన:

మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత మార్చిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ నిర్వహించిన శిక్షణా శిబిరంలో సాధన చేశాడు. ప్రాక్టీస్ సమయంలో భారీ సిక్సర్లు కూడా బాదాడు. మహీని చూడడానికి చిదంబరం మైదానంకు భారీ స్థాయిలో అభిమానులు క్యూ కట్టారు. ఆపై వైరస్ కారణంగా రాంచికి వెళ్ళిపోయాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ఎంఎస్ ధోనీ ఇప్పటివరకు 90 టెస్టుల్లో, 350 వన్డేల్లో, 98 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. టెస్టుల్లో 4876, వన్డేల్లో 10773, టీ20ల్లో 1617 రన్స్ చేశాడు.

వారం ముందే యూఏఈకి:

వారం ముందే యూఏఈకి:

యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని జట్టు ఆగస్టు మూడో వారంలో యూఏఈ పయనం కానున్నాయి. అయితే ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం మరో వారం ముందే యూఏఈలో అడుగుపెట్టనుంది. ఆగస్టు రెండో వారంలోనే యూఏఈ చేరుకునేందుకు చెన్నై ప్రాంచైజీ సన్నాహాలు చేస్తోందని సమాచారం తెలుస్తోంది. మిగతా ఫ్రాంచైజీలు ఆగస్టు మూడో వారంలో యూఏఈలో కాలుమోపనున్నాయి.

Story first published: Saturday, August 1, 2020, 17:04 [IST]
Other articles published on Aug 1, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X