న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పురుషుల వన్డేకు మహిళా మ్యాచ్‌ రిఫరీ.. చరిత్ర సృష్టించనున్న ఆంధ్ర మాజీ క్రికెటర్‌ లక్ష్మి!!

Former India cricketer GS Laxmi becomes 1st ever female ICC match-referee

దుబాయ్‌: భారత మహిళా మాజీ క్రికెటర్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గండికోట సర్వ (జీఎస్‌) లక్ష్మి చరిత్ర సృష్టించబోతున్నారు. అంతర్జాతీయ పురుషుల వన్డే మ్యాచ్‌కు రిఫరీగా పనిచేయనున్న మొట్టమొదటి మహిళా మ్యాచ్‌ రిఫరీగా లక్ష్మి రికార్డు నెలకొల్పనున్నారు. ఈ ఏడాది 'మే'లో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) మ్యాచ్‌ రిఫరీల ప్యానల్‌లో చోటు దక్కించుకున్న తొలి మహిళగా 51 ఏళ్ల లక్ష్మి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

నేడు భారత్-వెస్టిండీస్‌ తొలి టీ20.. రాహుల్‌, పంత్‌పైనే దృష్టి!!నేడు భారత్-వెస్టిండీస్‌ తొలి టీ20.. రాహుల్‌, పంత్‌పైనే దృష్టి!!

యూఏఈ-అమెరికా మ్యాచ్‌కు రిఫరీగా:

యూఏఈ-అమెరికా మ్యాచ్‌కు రిఫరీగా:

ఐసీసీ పురుషుల క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ లీగ్‌-2 టోర్నీలో భాగంగా యూఏఈ వేదికగా ఆదివారం యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా (యూఎస్‌ఏ) జట్ల మధ్య జరిగే మ్యాచ్‌కు జీఎస్‌ లక్ష్మి మ్యాచ్‌ రిఫరీగా వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్ షార్జా క్రికెట్‌ స్టేడియంలో జరగనుంది. న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ జెఫ్‌ క్రోతో కలిసి ఈ ఏడాది పురుషుల టీ20 వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌కు లక్ష్మి అఫీషియల్‌గా బాధ్యతలు నిర్వహించారు.

2008-09లో కెరీర్‌ ఆరంభం:

2008-09లో కెరీర్‌ ఆరంభం:

జీఎస్‌ లక్ష్మి 2008-09లో మ్యాచ్‌ రెఫరీ కెరీర్‌ను ప్రారంభించారు. మొదటిసారి దేశవాళీ మహిళా క్రికెట్‌ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించారు. అంతర్జాతీయ స్థాయిలో ఇప్పటివరకు 3 మహిళల వన్డేలకు, 7 టీ20 మ్యాచ్‌లకు పనిచేశారు. ఇక 16 అంతర్జాతీయ పురుషుల టీ20లకు కూడా ఆమె రెఫరీగా వ్యవహరించారు.

ఎంతో గర్వంగా ఉంది:

ఎంతో గర్వంగా ఉంది:

పురుషుల వన్డేకు మ్యాచ్‌ రెఫరీగా వ్యవహరించనుండడం గొప్ప అనుభూతి అని లక్ష్మి చెప్పారు. 'ఈ అవకాశం రావడం చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎంతో గర్వంగా కూడా ఉంది. ఏదైనా మనతోనే మొదలైంది అని చెప్పుకోవడంలో ఓ ఆనందం ఉంటుంది. పలువురు మహిళలు రెఫరీ బాధ్యతల్లోకి వస్తారనుకుంటున్నా. ఐసీసీ టోర్నీలకు పనిచేయడం గొప్పగా ఉంటుంది' అని లక్ష్మి పేర్కొన్నారు.

Story first published: Friday, December 6, 2019, 10:47 [IST]
Other articles published on Dec 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X