న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Team India : ఆ ముగ్గుర్నీ తీసేసి.. కొత్త వాళ్లను తీసుకోవాల్సిందే అంటున్న మాజీ క్రికెటర్!

Former cricketer wants to see changes in top order of Team India in T20Is

టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు ఓటమి తర్వాత జట్టు ఆటతీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా టీమిండియా టాప్-3 బ్యాటర్ల భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మెగా టోర్నీలో రోహిత్ శర్మ 106 స్ట్రైక్‌రేటుతో, కేఎల్ రాహుల్ 120 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశారు. ఇద్దరి యావరేజ్‌లు కూడా 20ల దగ్గర్లో ఉండటం గమనార్హం. విరాట్ కోహ్లీ ఒక్కడే మెగా టోర్నీలో 296 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతని యావరేజ్ 98.6 కాగా, స్ట్రైక్ రేటు 136.4గా ఉంది.

అందరూ ముప్పైల్లో ఉన్నారు

అందరూ ముప్పైల్లో ఉన్నారు

ప్రపంచకప్‌లో ఈ ముగ్గురి ఆటతీరుపై స్పందించిన మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా.. 'వీళ్లు ముగ్గురూ కూడా ముప్పైల్లో ఉన్నారు. వచ్చే వరల్డ్ కప్‌ నాటికి వీళ్ల వయసు మరింత పెరుగుతుంది. కాబట్టి నిజంగా కొత్త ఫలితాలు ఆశిస్తే కొత్త వాళ్లను ఆడించాలి. ఇప్పుడు వెళ్తున్న దారిని వదిలేసి, మరో మార్గం వైపు నడవాలి' ని చోప్రా సూచించాడు.

ప్రస్తుతం రోహిత్ వయసు 35, కోహ్లీ వయసు 34, రాహుల్ వయసు 30 సంవత్సరాలు. రాహుల్ ఇంకా కొంత కాలం ఆడతాడు. కానీ పలువురు మాజీలు అతను పొట్టి ఫార్మాట్‌కు పనికిరాడని, బంతిని ఎదుర్కోవడానికి భయపడుతున్నాడని అంటున్నారు.

పవర్‌ప్లే ప్రాబ్లమ్స్

పవర్‌ప్లే ప్రాబ్లమ్స్

టీ20 ప్రపంచకప్ ఆడిన అన్ని జట్లలో పవర్‌ప్లేలో అత్యంత నిదానంగా బ్యాటింగ్ చేసిన జట్టు టీమిండియానే. ఇదే విషయాన్ని ఎత్తి చూపిన ఆకాష్ చోప్రా.. 'మనం మొదటి ఓవర్‌ను మెయిడెన్ ఆడాం. అంటే అది కేవలం 19 ఓవర్ల మ్యాచ్ అయిపోతోంది. పిచ్ బౌలర్లకు సహకరిస్తోంది. బ్యాటింగ్ కష్టంగా ఉంది అని చెప్పొద్దు. మిగతా జట్లు కూడా అదే పరిస్థితుల్లో ఆడుతున్నాయి కదా' అని చోప్రా అన్నాడు.

కొత్త వాళ్లను తీసుకోవాలి

కొత్త వాళ్లను తీసుకోవాలి

ఈ క్రమంలో జట్టులో మార్పులు చేయాలని ఆకాష్ చోప్రా అన్నాడు. 'జట్టులో మార్పులు చేయాలని నాకు అనిపిస్తోంది. మన గమ్యం మారాలంటే దారి కూడా మారాలి కదా. కొత్త ఆటగాళ్లను తీసుకోవాలి. ఎందుకంటే తర్వాతి టీ20 వరల్డ్ కప్ రెండేళ్ల తర్వాత వస్తుంది' అని చెప్పాడు. ఇప్పటికే న్యూజిల్యాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, November 19, 2022, 12:19 [IST]
Other articles published on Nov 19, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X