న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ గడ్డపై అత్యుత్తమ ప్రదర్శన చేసిన టాప్-5 క్రికెటర్లు వీరే

Five most inspiring Indian performances in Australia

న్యూ ఢిల్లీ: ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్ జట్టును ఓడించాలని టీమిండియా తాపత్రయం ఈ నాటిది కాదు. ప్రపంచ వ్యాప్తంగా టాప్ జట్లలో ఒకటిగా వెలుగొందుతున్న టీమిండియా ఈ సారి ఎలాగైనా సిరీస్ గెలవాలనే ఆశయంతో డిసెంబరు 6న అడిలైడ్ వేదికగా జరగనున్న తొలి టెస్టుకు సిద్ధమవుతోంది. ఇద్దరు సుప్రీం బ్యాట్స్‌మెన్‌లు జట్టుకు దూరమైన సందర్భంగా ఇదే మంచి అవకాశమంటూ సీనియర్లు కితాబిస్తున్నారు. అయితే అది అనుకున్నంత సులువు కాదు.

సొంత గడ్డపై ఆస్టేలియాను ఓడించడం కాస్త కష్టంతో కూడుకున్న పనే. ఈ క్రమంలో 12 సార్లుగా ఆస్ట్రేలియా పర్యటన చేసిన టీమిండియాలో టాప్ 5గా పేరొందిన ప్లేయర్ల గురించి చెప్పాలంటే..

అడిలైడ్ వేదికగా రెచ్చిపోయిన విజయ్ హజారే:

అడిలైడ్ వేదికగా రెచ్చిపోయిన విజయ్ హజారే:

1948వ సంవత్సరంలో భారత జట్టు లాలా అమర్‌నాథ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాలో పర్యటించింది. అడిలైడ్ వేదికగా నాలుగో టెస్టుకు ఆడుతున్న మ్యాచ్‌లో 0-2తో భారత్ బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. డాన్ బ్రాడ్‌మన్ విజృంభించి డబుల్ సెంచరీ బాదేశాడు. లిండ్సే హస్సెట్ 198, సిద్ బార్నెస్ 112పరుగుల సహాయంతో భారత్‌పై 674 పరుగులు చేశారు. ఈ మ్యాచ్‌లో డాన్ బ్రాడ్‌మన్‌ను 201 పరుగులకు హజారే అవుట్ చేశాడు. అంతటి భారీ టార్గెట్‌ను చేధించే క్రమంలో 133/5 పరుగుల సమయంలో హజారే బరిలోకి దిగాడు. దత్తు ఫాడ్కర్‌తో కలిసి 188 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. భారత్ ఆ తర్వాత 374 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఈ క్రమంలో హజారే 116పరుగులు.. ఫాడ్కర్ 123 పరుగులు చేశాడు.

1980-81 పర్యటనలో మెల్‌బౌర్న్ వేదికగా కపిల్‌దేవ్

1980-81 పర్యటనలో మెల్‌బౌర్న్ వేదికగా కపిల్‌దేవ్

ముందుగా ఇండియా బ్యాటింగ్ చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 143 చేధన లక్ష్యంగా బరిలోకి దిగింది. నాలుగో రోజు మ్యాచ్‌కు 24/3తో ఆస్ట్రేలియా బరిలో ఉంది. ఆ సమయంలో అప్పటికే ఆరోగ్యం మందగించిన కపిల్ దేవ్ పలు పెయిన్ కిల్లింగ్ ఇంజక్షన్లు తీసుకుని మ్యాచ్‌కు వచ్చాడు. మెల్‌బౌర్న్ వేదికగా విజృంభించాడు. 5/28స్కోరుతో ఆస్ట్రేలియాను గడగడలాడించాడు. ఈ ధాటికి 83 పరుగులకే ఆస్ట్రేలియా అలౌట్ అయింది. దీంతో 59పరుగుల తేడాతో భారత్ గెలిచి తన కలను సాకారం చేసుకుంది.

2003-04 పర్యటనలో రెచ్చిపోయిన సౌరవ్ గంగూలీ

2003-04 పర్యటనలో రెచ్చిపోయిన సౌరవ్ గంగూలీ

ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బా స్టేడియంలో గంగూలీ కెప్టెన్సీ అదరగొట్టింది. ఆ పర్యటనకు అదే తొలి టెస్టు.. అందరిలో ఉత్కంఠ. ఈ క్రమంలో టాస్ గెలిచి ఆసీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు గంగూలీ. జహీర్ ఖాన్, అజిత్ అగార్కర్ తమ స్థాయి ప్రదర్శన చేసి 324కు కట్టడి చేశారు. ఆ తర్వాత చేధనకు దిగిన భారత్ 60పరుగుల వరకూ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా నిలకడగానే ఆడింది. ఆ తర్వాత వరుసగా రెండు పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోవడంతో ఆ తర్వాత బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి గంగూలీ వచ్చాడు. అసమానమైన శైలిని ప్రదర్శించి 144పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా రికార్డు నమోదు చేశాడు. ఆ తర్వాత అడిలైడ్ వేదికగా రాహుల్ ద్రవిడ్ ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

 2007-08 పర్యటనలో సిడ్నీ వేదికగా రాహుల్ ద్రవిడ్

2007-08 పర్యటనలో సిడ్నీ వేదికగా రాహుల్ ద్రవిడ్

అనిల్ కుంబ్లే కెప్టెన్సీలో పర్యటించిన టీమిండియా.. తొలి టెస్టును మెల్‌బౌర్న్ వేదికగా ఓటమికి గురైంది. అనంతరం రెండో టెస్టును సిడ్నీ క్రికెట్‌లో ఆడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 330 పరుగులు చేసింది. ఇందులో రాహుల్ ద్రవిడ్ 93 పరుగుల చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నమోదైయ్యాడు. ఆ తర్వాత చేధనకు దిగిన ఆసీస్‌ను ఆర్పీ సింగ్ వంటి బౌలర్లు కట్టడి చేసి 212 పరుగులకే ఆల్ అవుట్ చేశారు. ఈ తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగుల ఆధిక్యం సంపాదించింది టీమిండియా. ఆ తర్వాత బ్యాటింగ్ చేసి మొత్తానికి 413 పరుగుల టార్గెట్‌ను ఆసీస్ ముందుంచడంతో.. ఆ లక్ష్యానికి ఇంకా 72 పరుగుల ముందే ఓటమి పాలైంది.

2011-12 పర్యటనలో ఆసీస్‌పై విరుచుకుపడ్డ విరాట్

2011-12 పర్యటనలో ఆసీస్‌పై విరుచుకుపడ్డ విరాట్

ఈ పర్యటనలో కోహ్లీని తీసుకుని జట్టులో కొనసాగించాలా.. వద్దా.. అని అనుమానం పడ్డ జట్టు మేనేజ్‌మెంట్ కోహ్లీని కొనసాగేలా ప్రదర్శన చేశాడు విరాట్. తొలి ఇన్నింగ్స్‌లో 43 పరుగులు చేశాడు కోహ్లీ. అతని స్థానంపై సందేహం నెలకొనడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. పెర్తె వేదికగా మూడో టెస్టులో మిచెల్ స్టార్క్, బెన్ హైఫెన్‌హాస్, పీటర్ సిడిల్‌లు అప్పటికే రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లను పెవిలియన్‌కు పంపేశారు. విరాట్ కోహ్లీ మాత్రం నిలిచి 44పరుగుల చేయడంతో టీమిండియా 161పరుగులకే ఆల్ అవుట్ అయింది.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో 171 పరుగులు చేసిన భారత్‌లో కోహ్లీ ఒక్కడే 75 పరుగులు చేశాడు. ఆ తర్వాతి మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీ కొట్టేశాడు. దీంతో ఆపర్యటన మొత్తంలో సెంచరీ చేసిన ఒకే ఒక్క ఇండియన్ ప్లేయర్‌గా ఘనత సాధించాడు.

Story first published: Tuesday, December 4, 2018, 18:15 [IST]
Other articles published on Dec 4, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X