న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsBAN: ద్రావిడ్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు.. టీమిండియాను నాశనం చేస్తున్న కోచ్!

Fans question Team India coach Rahul Dravid ways after loosing Bangladesh series.

నిన్నమొన్నటి వరకు ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా బలమైన జట్టు. కానీ ఇప్పుడు కనీసం బంగ్లాదేశ్‌ను కూడా ఓడించలేకపోతున్న సాధారణ టీం. టీ20 వరల్డ్ కప్‌ నుంచి అవమానకర రీతిలో ఇంటి దారి పట్టిన ఫెయిల్యూర్ జట్టు. టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టు పరిస్థితి దిగజారిందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే ద్రావిడ్ హయాంలో తలెత్తిన కొన్ని సమస్యలు ఏంటో చూస్తే..

ఒక జట్టు లేదు..

ఒక జట్టు లేదు..

టీ20 వరల్డ్ కప్ మరో ఏడాదిలో ఉందనగా ద్రావిడ్‌కు జట్టును అప్పగించారు. ఆ ఏడాదిలో ఒక బలమైన జట్టును తయారు చేయడంలో ద్రావిడ్ విఫలమయ్యాడు. ఒకప్పుడు టీమిండియా అంటే.. పదకొండు మంది ఆటగాళ్ల పేర్లనూ చటుక్కున చెప్పేయొచ్చు. సగటు అభిమాని కూడా ఎవరెవరు ఆడతారో చెప్పే పరిస్థితి ఉండేది. కానీ రాహుల్ ద్రావిడ్ జట్టు కోచ్‌గా వచ్చిన తర్వాత భారత జట్టు ఏదో చెప్పడం కష్టంగా మారింది. ఒక స్థిరమైన జట్టు లేకుండా ప్రతి మ్యాచులో ప్రయోగాలతో జట్టును చెడగొట్టేశాడీ మాజీ క్రికెటర్. ఈ క్రమంలో నిఖార్సయిన జట్టును తయారు చేయడంలో విఫలమయ్యాడు. ఇప్పటికీ రోహిత్, రాహుల్, కోహ్లీ తప్ప మిగతా ఆటగాళ్లు ఎవరు ఆడతారనేది ప్రశ్నార్థకంగానే ఉంది. దీని వల్ల ఒక బలమైన జట్టును తయారు చేయడంలో ద్రావిడ్ విఫలమయ్యాడని చెప్పొచ్చు.

అసలు ప్లాన్ ఏంటి?

అసలు ప్లాన్ ఏంటి?

బలమైన జట్టును నిర్మించడంలో రాహుల్ ద్రావిడ్ ఎంచుకున్న మార్గం ఏదో కూడా ఎవరికీ తెలియడం లేదు. ఆటగాళ్ల వర్క్ లోడ్ మేనేజ్‌మెంట్ పేరిట ఒక సిరీస్ ఆడిన వారిని మరో సిరీస్‌ ఆడనివ్వడం లేదు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన తర్వాత సీనియర్లకు కివీస్ పర్యటనలో విశ్రాంతి ఇచ్చేశాడు. బంగ్లాదేశ్ పర్యటనకు మాత్రం అందరినీ ఆడించాడు. అంటే కివీస్ కన్నా బంగ్లాదేశ్‌ పర్యటన ముఖ్యమని సంకేతాలు పంపినట్లే కదా. అసలు టీమిండియా ఎటు పోతోంది? అని సగటు అభిమాని ప్రశ్నించేలా ఉన్నాయి ద్రావిడ్ విధానాలు. ఈ ఏడాది కాలంలో ఎంతమంది కుర్రాళ్లు అరంగేట్రం చేశారు? మూడు ఫార్మాట్లలో ఎంత మంది కెప్టెన్లు మారారు? అనే లెక్కలు ఫ్యాన్స్‌కు తలనొప్పి తెప్పించేలా ఉన్నాయి. ఇలా ఒక క్లారిటీ లేని జట్టుతో వన్డే వరల్డ్ కప్ ఎలా గెలుస్తారు? అసలు ద్రావిడ్ ఎలాంటి ప్లాన్‌తో ముందుకు వెళ్తుంది ఏమాత్రం అర్థం కావడం లేదు.

వెంటాడుతున్న గాయాలు..

వెంటాడుతున్న గాయాలు..

ద్రావిడ్‌ను మరీ అంతగా విమర్శించలేకపోవడానికి కూడా ఒక కారణం ఉంది. అదేంటంటే అతను జట్టు కోచ్‌గా వచ్చిన తర్వాత టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. టీ20 వరల్డ్ కప్‌లో చాలా కీలకం అనుకున్న జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఇద్దరూ ఆ టోర్నీకి దూరమయ్యారు. గాయంతో జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్ పునరాగమనంలో ఆకట్టుకోలేదు. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో జిడ్డు బ్యాటింగ్‌తో తలనొప్పి తెప్పించాడు. తాజాగా బంగ్లా పర్యటనలో కూడా రోహిత్, దీపక్ చాహర్, కుల్దీప్ సేన్ ముగ్గురూ గాయపడ్డారు. వీళ్లు మూడో వన్డే ఆడటం కూడా అనుమానంగా ఉంది. ఇలా కీలకమైన ఆటగాళ్లంతా గాయాల బారిన పడటంతో ద్రావిడ్ హయాంలో ఫిట్‌నెస్ పరీక్షలపై కూడా సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఆటగాళ్లకు యో-యో టెస్టులైనా చేస్తున్నారా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.

Story first published: Friday, December 9, 2022, 10:04 [IST]
Other articles published on Dec 9, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X