న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చేతిలో 3వికెట్లు ఉన్నా, గెలుపుకు 10బంతుల్లో 5పరుగులే అయినా.. ఇంగ్లాండ్ ఓటమి..! పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ అద్భుతం

Even Though Having 3Wickets in Hand and 5 Needed In 10Balls, England Lost To Pak As Haris Rauf stunns

తీవ్ర ఉత్కంఠగా సాగిన ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్థాన్ 4వ టీ20లో ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్, పేసర్ హరీస్ రవూఫ్ రాణించడంతో పాకిస్థాన్ 3పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఈ విజయంతో పాకిస్థాన్ ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-2తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్.. ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్ (88పరుగులు 67బంతుల్లో 9ఫోర్లు, 1 సిక్సర్లు), బాబర్ ఆజామ్ ( 36పరుగులు 28బంతుల్లో 3ఫోర్లు) పాక్‌కు శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 97పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. లియామ్ డాసన్ 11వ ఓవర్లో బాబర్ ఆజామ్‌ను ఔట్ చేసి ఇంగ్లాండ్‌కు తొలి బ్రేక్త్రూ అందించాడు. కానీ రిజ్వాన్ క్రీజులో పాతుకుపోయి.. చక్కటి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

ఆజామ్ ఔటయ్యాక స్కోరు బోర్డుకు బ్రేకులు

ఆజామ్ నిష్క్రమణ తర్వాత షాన్ మసూద్ (21పరుగులు) రిజ్వాన్‌కు అవసరమైన సహకారాన్ని అందించాడు. మసూద్‌ను డేవిడ్ విల్లీ, ఖుష్దిల్ షా, రిజ్వాన్‌లను రీస్ టాప్లీ ఔట్ చేయడంతో స్కోరు కార్డుకు కాస్త బ్రేకులు పడ్డాయి. అయితే చివర్లో ఆసిఫ్ అలీ కేవలం మూడు బంతుల్లో 13పరుగులు చేయడంతో పాకిస్థాన్ నిర్ణీత 20ఓవర్లలో 4వికెట్ల నష్టానికి 166పరుగులు చేయగలిగింది.

14పరుగులకే 3వికెట్లు కోల్పోయి..

ఇక ఇంగ్లాండ్ 167పరుగుల ఛేదనకు దిగి పేలవ ఆరంభాన్ని పొందింది. మహ్మద్ నవాజ్ తొలి ఓవర్‌లోనే ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ (8)ను ఔట్ చేసి పాక్‌కు బ్రేక్ త్రూ అందించాడు. మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ (5) సైతం మహమ్మద్ హస్నైన్ బౌలింగ్లో పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత విల్ జాక్స్ (0)ను హస్నైన్ డకౌట్ చేశాడు. 14పరుగులకే 3వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడ్డ పాకిస్థాన్‌ను బెన్ డకెట్ (33పరుగులు 24బంతుల్లో 5ఫోర్లు), హ్యారీ బ్రూక్ (34పరుగులు 29బంతుల్లో 2ఫోర్లు, 1సిక్సర్) ఆదుకున్నారు. వీరిద్దరి 43పరుగుల భాగస్వామ్యాన్ని మరోసారి నవాజ్ దెబ్బతీస్తూ బెన్ డకెట్‌ను ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ పంపించాడు.

లియామ్ డాసన్ అనూహ్య ఇన్నింగ్స్

అయితే కెప్టెన్ మొయిన్ అలీ (29పరుగులు 20బంతుల్లో 3ఫోర్లు, 1సిక్సర్), హ్యారీ బ్రూక్‌తో కలిసి 49పరుగుల భాగస్వామ్యం జోడించి ఇంగ్లాండ్‌ను మళ్లీ రేసులోకి తీసుకొచ్చాడు. వీరిద్దరు తక్కువ పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో ఇంగ్లాండ్ ఓటమి ఖాయమనిపించింది. కానీ లియామ్ డాసన్ (17 బంతుల్లో 34 పరుగులు, 5ఫోర్లు, 1సిక్సర్) మ్యాచ్ స్వరూపాన్నే మార్చే‌శాడు. దీంతో మ్యాచ్ మళ్లీ టఫ్ అండ్ టఫ్ వచ్చింది. ఇక ఇంగ్లాండ్ గెలుపు లాంఛనమే అనిపించింది.

హరీస్ రౌఫ్ అద్భుత బౌలింగ్..

హరీస్ రౌఫ్ అద్భుత బౌలింగ్..

చేతిలో మూడు వికెట్లు ఉండగా.. 12 బంతుల్లో ఇంగ్లాండ్ విజయానికి కేవలం 9 పరుగులు మాత్రమే అవసరమైంది. అయితే 19వ ఓవర్లో హారిస్ రౌఫ్ అద్భుతం చేశాడు. 2వ బంతికి ఫోర్ ఇచ్చాడు. దీంతో 10బంతుల్లో 5మాత్రమే కావాల్సొచ్చింది. అయితే 3, 4 బంతుల్లో డాసన్‌ను, ఆలీ స్టోన్‌లను ఔట్ చేసి ఇంగ్లాండ్‌కు షాకిచ్చాడు. ఇక చివరి ఓవర్లో 4పరుగులు కావాల్సిన తరుణంలో.. మహమ్మద్ వసీమ్ జూనియర్ బౌలింగ్‌కు దిగాడు. రెండో బంతికి రీస్ టోప్లీ రనౌట్ కావడంతో ఇంగ్లాండ్ ఆలౌటైంది. దీంతో జస్ట్ మూడు పరుగుల తేడాతో పాక్ గెలుపొందింది. ఈ మ్యాచ్ విజయంతో ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 2-2తో సమమైంది. సిరీస్‌లోని మిగిలిన మూడు టీ20లు లాహోర్ వేదికగా జరగనున్నాయి.

Story first published: Monday, September 26, 2022, 10:25 [IST]
Other articles published on Sep 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X