న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

7000 ODI Runs: తొలి క్రికెటర్‌గా ఇయాన్ మోర్గాన్ చరిత్ర

Eoin Morgan Scored 7000 ODI Runs: Becomes Leading Run Scorer and Most Capped ODI Player For England

హైదరాబాద్: ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన వరల్డ్‌కప్ ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో మోర్గాన్ 60 బంతుల్లో 57(4 ఫోర్లు, 3 సిక్సులు) హాఫ్ సెంచరీతో రాణించిన సంగతి తెలిసిందే. ఫలితంగా మోర్గాన్ ఖాతాలో ఏడు వేల పరుగులు చేరాయి.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో ఇంగ్లాండ్ తరుపున వన్డేల్లో 7000 పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్‌గా ఇయాన్ మోర్గాన్ చరిత్ర సృష్టించాడు. లుంగి ఎంగిడి వేసిన 26వ ఓవర్‌లో సిక్స్‌తో ఇయాన్ మోర్గాన్ ఈ మైలురాయిని అందుకున్నాడు. దీంతో పాటు మోర్గాన్ ఖాతాలో మరో రికార్డు కూడా చేరింది.

ఇంగ్లాండ్ తరుపున మోర్గాన్‌కి 200వ వన్డే

ఇంగ్లాండ్ తరుపున మోర్గాన్‌కి 200వ వన్డే

దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్ మోర్గాన్‌కి 200వ వన్డే కావడం విశేషం. దీంతో ఇంగ్లాండ్ తరపున అత్యధిక వన్డేలు ఆడిన క్రికెటర్‌గా మోర్గాన్ అరుదైన రికార్డు సాధించాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ తరపున అత్యధిక వన్డేలాడిన రికార్డు మాజీ కెప్టెన్ పాల్ కాలింగ్ వుడ్ పేరిట ఉంది. ఇప్పుడు ఆ రికార్డుని మోర్గాన్ అధిగమించాడు.

ఐర్లాండ్ జట్టు తరుపున కూడా

ఐర్లాండ్ జట్టు తరుపున కూడా

మోర్గాన్‌కి మొత్తంగా ఇది 223వ వన్డే. అయితే, మిగతా 23 వన్డేలను మోర్గాన్ ఐర్లాండ్ జట్టు తరుపున ఆడాడు. మోర్గాన్ తర్వాత జేమ్స్ ఆండర్సన్(194), అలెక్స్ స్టివార్ట్(170), ఇయాన్ బెల్(161) ఈ జాబితాలో ఉన్నారు. ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల జట్టు కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ జట్టు అద్భుత ప్రదర్శన చేస్తోంది.

ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానం

ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానం

ఐసీసీ ర్యాంకుల్లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. 2015 వరల్డ్‌కప్ తర్వాత నుంచి కూడా అ జట్టులో మేటి ఆటగాళ్లతో కళకళలాడుతోంది. 2016లో టీ20 వరల్డ్‌కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత 2017లో సొంతగడ్డపై జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీపైనల్‌ వరకు వచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్‌లో సైతం ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరేట్లలో ఒకటి.

50 ఓవర్లలో 8 వికెట్లకు 311 పరుగులు

50 ఓవర్లలో 8 వికెట్లకు 311 పరుగులు

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 311 పరుగులు చేసింది. స్టోక్స్ 79 బంతుల్లో 89 (9 ఫోర్లు), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (57; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), జాసన్ రాయ్ (54; 8 ఫోర్లు), రూట్ (51; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. సఫారీ బౌలర్లలో లుంగి ఎంగిడి మూడు, ఇమ్రాన్ తాహిర్, రబాడ చెరో రెండు వికెట్లు తీశారు.

దక్షిణాఫ్రికా 39.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్

దక్షిణాఫ్రికా 39.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్

అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 39.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ డికాక్ 74 బంతుల్లో 68 (6 ఫోర్లు, 2 సిక్సర్లు), మిడిలార్డర్లో డసన్ 61 బంతుల్లో 50 (4 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతావారు చేతులెత్తేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్ (3/27), స్టోక్స్ (2/12), ప్లంకెట్ (2/37) రాణించారు. బెన్ స్టోక్స్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ

ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ

మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ "దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో మా ఆట సంతోషాన్నిచ్చింది. చాలా పరిణతితో ఆడాం. గత రెండేళ్లలో మేం ఎంత మెరుగయ్యామో ఈ ప్రదర్శన చూపించింది. ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్‌ ఆకట్టుకున్నాడు. ఆర్చర్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. మా ఫీల్డింగ్‌ గొప్పగా ఉంది" అని అన్నాడు.

Story first published: Friday, May 31, 2019, 12:27 [IST]
Other articles published on May 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X