న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్‌తో ఛారిటీ మ్యాచ్ ఆడబోతున్న ఇంగ్లాండ్.. కెప్టెన్‌గా మోర్గాన్

Eoin Morgan to lead ICC World XI against West Indies in charity match

హైదరాబాద్: ఐసీసీ వరల్డ్ XI జట్టుకు ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ నాయకత్వం వహిస్తాడని ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) గురువారం ప్రకటించింది. వచ్చే మే 31న ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో వెస్టిండీస్ జట్టుతో టీ20 మ్యాచ్ జరగనుంది. గతేడాది హరికేన్, ఇర్మా తుఫానుల దెబ్బకు కరీబియన్ దీవులు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే.

కొత్త AI powered cameraతో OPPO F7, 25 ఎంపీ AI సెల్ఫీ కెమెరాతో..

వీటి ధాటికి విండీస్‌కు చెందిన రెండు స్టేడియాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో వాటి పునరుద్ధరణకు కావాల్సిన నిధులను సేకరించేందుకు ఈ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. డిఫెండింగ్ ఐసీసీ వరల్డ్ టీ20 ఛాంపియన్ వెస్టిండీస్ ప్రపంచ స్టార్ క్రికెటర్లు చోటు దక్కించుకున్న వరల్డ్ ఎలెవన్‌తో తలపడనుంది. ఈ సందర్భంగా మోర్గాన్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

లార్డ్స్ వేదికగా వచ్చే మేలో వెస్టిండీస్‌తో జరిగే పోరులో పాల్గొనే జట్టుకు కెప్టెన్‌గా ఎంపికకావడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఈ ఛారిటీ మ్యాచ్‌లో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడు సమాజానికి చేయూతనిచ్చేందుకు క్రికెట్ ఎప్పుడూ ముందుంటుంది. ఈ విపత్తు నుంచి ఆదుకోవడానికి మాకు ప్రజలు కూడా సహకరించాలని కోరుతున్నాం' అని అభిప్రాయపడ్డాడు.

నెల జీతం సరిపోవడం లేదు: చిన్నారి కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

ఐసీసీ XI జట్టుకు తొలిసారిగా ఈయోన్ మొర్గాన్ కెప్టెన్‌గా ఎన్నుకోబడ్డాడు. ప్రపంచ వ్యాప్తంగా దీనికి సహకరించే క్రికెటర్లను కోరుతున్నాం. మేలో జరగబోతున్న క్రికెట్ మ్యాచ్ అత్యంత ఆకర్షణీయవంతమైనదిగా ఉంటే అంతే స్థాయిలో అభిమానులు వీక్షిస్తారనేది నా అభిప్రాయమని ఆయన పేర్కొన్నాడు. భారీ సంఖ్యలో క్రికెట్ అభిమానులు తరలివచ్చి మ్యాచ్‌ను విజయవంతం చేస్తారని భావిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Story first published: Friday, March 23, 2018, 16:21 [IST]
Other articles published on Mar 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X