ENGvsWI: మొదలైన మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్!!

England vs West Indies 2nd Test: West Indies have won the toss and have opted to field

మాంచెస్టర్‌: మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్-వెస్టిండీస్‌ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం అయింది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. వర్షం పడిన కారణంగా పిచ్‌పై ఉన్న తడిని ఉపయోగించుకోవాలని చూస్తున్నట్లు హోల్డర్ చెప్పాడు. మ్యాచ్ సమయానికి ముందు చిరు జల్లులు కురవడంతో.. మైదానం చిత్తడిగా మారింది. దీంతో టాస్‌ రెండు గంటలు ఆలస్యం అయింది. బ్యాటింగ్ చేస్తున్న ఇంగ్లండ్ 7 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. క్రీజులో రోరీ బర్న్స్ (1), డోమ్ సిబ్లీ (4) ఉన్నారు.

విండీస్ మొదటి టెస్టు జట్టునే కొనసాగించింది. తన భార్య ప్రసవ సమయంలో ఆమె చెంత ఉండాలని భావించి తొలి టెస్టుకి దూరమైన ఇంగ్లీష్ రెగ్యులర్ టెస్ట్ కెప్టెన్ జో రూట్.. మళ్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. సీనియర్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్, యువ పేసర్ శామ్ కరన్‌ కూడా టీమ్‌లోకి వచ్చారు. తొలి టెస్టులో రాణించలేకపోయిన ఫాస్ట్ బౌలర్లు జేమ్స్ అండర్సన్, మార్క్‌ వుడ్‌‌లపై వేటు పడింది. వారి స్థానాల్లో బ్రాడ్, కరన్‌లని తీసుకుంది. ఇక రూట్ జట్టులోకి రావడంతో.. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ జె డెన్లీని పక్కన పెట్టింది.

వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు తుది జట్టులో ఉన్న ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ బయో సెక్యూర్‌ ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించాడు. దీంతో ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) అతనిపై వేటు వేసింది. బయో సెక్యూర్‌ ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించాడని మ్యాచ్‌ ఆరంభానికి కొన్ని గంటల ముందు అతన్ని పక్కనపెట్టేశారు. ఆటగాళ్ల భద్రత కారణంగానే ఆర్చర్‌ను జట్టు నుంచి తప్పించామని ఈసీబీ తెలిపింది. అయితే ఆర్చర్‌ ఏ నిబంధనలను బ్రేక్‌ చేశాడనే దానిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

కరోనా వైరస్ లాక్‌డౌన్‌ తర్వాత జరిగిన తొలి అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ చివరి వరకు ఉత్కంఠరేపడం అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నది. ఆతిథ్య ఇంగ్లండ్ జట్టుకు ఊహించని షాకిచ్చిన విండీస్.. మూడు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంతో నిలిచింది. రెండో టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ సొంతం చేసుకోవాలని విండీస్‌ చూస్తుండగా.. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఇంగ్లీష్ జట్టు భావిస్తోంది. దీంతో ఈ మ్యాచ్ కూడా రసవత్తరంగా సాగనుంది.

Teams:

England (Playing XI): Rory Burns, Dominic Sibley, Zak Crawley, Joe Root(c), Ben Stokes, Ollie Pope, Jos Buttler(w), Chris Woakes, Sam Curran, Dominic Bess, Stuart Broad.

West Indies (Playing XI): Kraigg Brathwaite, John Campbell, Shai Hope, Shamarh Brooks, Roston Chase, Jermaine Blackwood, Shane Dowrich(w), Jason Holder(c), Alzarri Joseph, Kemar Roach, Shannon Gabriel

ENGvsWI: మరోసారి సేమ్ సీన్ రిపీట్.. రెండో టెస్టుకు వరుణుడి అడ్డంకి!!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, July 16, 2020, 17:42 [IST]
Other articles published on Jul 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more