న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENG vs PAK: టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారి.. 600 వికెట్లు పడగొట్టిన జేమ్స్ అండర్సన్!!

England vs Pakistan: James Anderson Becomes Fourth Bowler to Take 600 Test Wickets

సౌతాంప్టన్‌: ఇంగ్లండ్ సీనియర్ పేస్ బౌలర్, స్వింగ్ కింగ్ జేమ్స్‌ అండర్సన్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ ఫార్మాట్‌లో అండర్సన్‌ 600 వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో 600 వికెట్లు పడగొట్టిన నాలుగో బౌలర్‌గా జిమ్మీ రికార్డుల్లోకి ఎక్కాడు. సౌతాంప్టన్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అజర్ అలీ (31) వికెట్ పడగొట్టడంతో.. అండర్సన్‌ ఖాతాలో 600వ వికెట్ చేరింది. అలీ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్స్‌లో ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ పట్టాడు.

IPL 2020: అయ్యబాబోయ్.. సన్‌రైజర్స్ జట్టుకు 13 మంది స్పాన్సర్లు!!IPL 2020: అయ్యబాబోయ్.. సన్‌రైజర్స్ జట్టుకు 13 మంది స్పాన్సర్లు!!

600 వికెట్లు:

600 వికెట్లు:

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 600 వికెట్లు పడగొట్టిన తొలి పేస్ బౌలర్‌గా జేమ్స్‌ అండర్సన్ నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్‌ రెండో స్థానంలో ఉన్నాడు. మెక్‌గ్రాత్‌ 563 వికెట్లు తీశాడు. 2018లోనే మెక్‌గ్రాత్‌ను అండర్సన్ అధిగమించాడు. 600లకు పైగా వికెట్లు తీసిన జాబితాలో అండర్సన్ కంటే ముందున్న ముగ్గురు కూడా స్పిన్నర్లే. ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708), అనిల్ కుంబ్లే (619) వరుసగా ఆ జాబితాలో ఉన్నారు.

తొలి బౌలర్‌గా:

తొలి బౌలర్‌గా:

మరోవైపు టెస్ట్ క్రికెట్ చరిత్రలో 150వ టెస్ట్ మ్యాచ్ ఆడిన తొలి బౌలర్‌గా జేమ్స్ అండర్సన్‌ ఇదివరకే రికార్డుల్లోకి ఎక్కాడు. 2019 డిసెంబర్ నెలలో సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ ద్వారానే ఆ మార్క్ అందుకున్నాడు. ఇప్పటివరకు ఏ బౌలర్ కూడా 150 టెస్ట్ మ్యాచ్‌లు ఆడలేదు. వార్న్ (145), మురళీధరన్ (133), కుంబ్లే (132), మెక్‌గ్రాత్ (124) లాంటి దిగ్గజాలకు సాధ్యం కాని రికార్డును 38 ఏళ్ల జేమ్స్‌ అండర్సన్‌ అందుకున్నాడు. ఒక పేస్ బౌలర్ 150 టెస్ట్ మ్యాచ్‌లు ఆడడం విశేషం. ఇక క్రికెట్‌ చరిత్రలో ఇప్పటి వరకు 9 మంది మాత్రమే టెస్ట్ ఫార్మాట్‌లో 150 మ్యాచ్‌లు ఆడారు. ఈ జాబితాలో భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ (200) అగ్ర స్థానంలో ఉన్నాడు.

2003లో ఎంట్రీ:

2003లో ఎంట్రీ:

ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రధాన బౌలర్ అయిన జేమ్స్ అండర్సన్.. ఇప్పటి వరకు 157 టెస్టులు ఆడాడు. 2.86 ఎకానమీ, 56.5 స్ట్రైక్ రేట్‌తో 600 వికెట్లు పడగొట్టాడు. ఐదు వికెట్లు 29 సార్లు పడగొట్టాడు. 194 వన్డేల్లో 269 వికెట్లు తీసుకున్నాడు. ఇక 19 టీ20లో 18 వికెట్లు కూల్చాడు. జిమ్మీ పరిమిత ఓవర్ల ఫార్మాట్ కంటే సాంప్రదాయ ఫార్మాట్‌లోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. 2003లో ఇంగ్లీష్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అండర్సన్.. 17 ఏళ్ల పాటు కెరీర్ కొనసాగిస్తున్నాడు.

రిటైర్‌మెంట్ ఆలోచనే లేదు:

రిటైర్‌మెంట్ ఆలోచనే లేదు:

ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జేమ్స్ అండ‌ర్స‌న్ తన రిటైర్మెంట్ వార్తలపై ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. ఇప్పట్లో రిటైర్‌మెంట్ ఆలోచనే లేదని, ఇంకొన్నాళ్లు కొనసాగుతా అని స్పష్టం చేశాడు. 2021-22 యాషెస్ సిరీస్ ఆడుతానని చెప్పకనే చెప్పాడు. కరోనా వైరస్ లాక్‌డౌన్ అనంతరం తన బౌలింగ్‌ లయ తప్పిన మాట వాస్తవమేనని, అయితే పాకిస్తాన్‌తో టెస్టుల్లో బాగా ఆడేందుకు కృషి చేస్తానని జిమ్మీ అన్నాడు.

Story first published: Tuesday, August 25, 2020, 23:06 [IST]
Other articles published on Aug 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X