న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ENG vs PAK: జాక్‌ క్రాలీ శతకం.. ఇంగ్లండ్‌ భారీ స్కోరు!!

England vs Pakistan 3rd Test Day 1: Zak Crawley ton, Jos Buttler fifty drive England

సౌతాంప్టన్‌: పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌ భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఇంగ్లండ్‌ తడబడి నిలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లీష్ జట్టు సగం ఆట వరకు ఒడుదొడులకు ఎదుర్కొన్నప్పటికీ.. తర్వాత పుంజుకుని ఆట నిలిచేసమయానికి పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఎనిమిదో టెస్టు ఆడుతూ.. కెరీర్లో తొలి సెంచరీ సాధించిన ఇంగ్లండ్‌ యువ బ్యాట్స్‌మన్‌ జాక్‌ క్రాలీ (171; 269 బంతుల్లో 194) జట్టుకు భారీ స్కోర్ అందించాడు. శుక్రవారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 90 ఓవర్లలో 4 వికెట్లకు 332 పరుగులు చేసింది.

ఇంగ్లండ్‌కు ఓపెనర్‌ రోరీ బర్న్స్ ‌(6) రూపంలో ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. షహీన్‌ షా అఫ్రిది బౌలింగ్‌లో బర్న్స్‌.. మసూద్‌ క్యాచ్‌తో ఔట్‌ కావడంతో ఇంగ్లండ్‌ 12 పరుగులకే తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన జాక్‌ క్రాలీతో మరో ఓపెనర్ డొమినిక్ సిబ్లే (22) 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. యాషిర్ షా బ్యాటింగ్‌లో సిబ్లే వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆపై కెప్టెన్‌ జో రూట్ ‌(29).. క్రాలీతో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. లంచ్‌ విరామానికి స్కోరు 91/2.

1
46764

రెండో సెషల్లో ఇంగ్లండ్‌కు కష్టాలు మొదలయ్యాయి. కొద్ది వ్యవధిలోనే జో రూట్, ఓలీ పోప్ (3) వెనుదిరగడంతో ఓ దశలో ఇంగ్లండ్‌ 127 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. కానీ క్రాలీ, జోస్‌ బట్లర్‌ (87 బ్యాటింగ్‌; 148 బంతుల్లో 94, 26) జోడీ పట్టుదలతో నిలబడి.. పాక్‌కు ఇంకొక్క వికెట్‌ కూడా దక్కకుండా చేసింది. ఈ క్రమంలోనే క్రాలీ సెంచరీ చేశాడు. బట్లర్‌తో కలిసి క్రాలీ.. ఇన్నింగ్స్‌ను గాడిలో పడేశాడు. వీరిద్దరు కలిసి పాక్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ సాధికారిక ఇన్నింగ్స్‌ ఆడారు. వీళ్లిద్దరూ అభేద్యమైన ఐదో వికెట్‌కు 205 పరుగులు జోడించారు. చివరి సెషన్‌ పూర్తిగా ఈ జోడీ ఎదురుదాడికి దిగడంతో పరుగులు వేగంగా వచ్చాయి.

క్రాలీ భారీ సెంచరీ, బట్లర్‌ అర్ధ శతకంతో ఇంగ్లండ్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి పటిష్ట స్థితిలో నిలిచింది. ఇంగ్లండ్‌ 90 ఓవర్లలో 4 వికెట్లకు 332 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో షహీన్‌ షా అఫ్రిది ఒక వికెట్ తీయగా.. యాసిర్‌ షా రెండు వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఇప్పటికే 1-0తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్టులో విజయం దక్కకపోయినా.. కనీసం డ్రా చేసుకున్నా సిరీస్‌ ఇంగ్లండ్‌ వశం కానుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలిస్తే ప్రపంచ టెస్టు చాంపియన్‌ షిప్‌లో రెండో స్థానానికి ఎగబాకుతుంది.

'ఎంఎస్ ధోనీ ఓ సుప్రీమ్.. మహీకి ఎవరూ సాటిరారు''ఎంఎస్ ధోనీ ఓ సుప్రీమ్.. మహీకి ఎవరూ సాటిరారు'

Story first published: Saturday, August 22, 2020, 8:27 [IST]
Other articles published on Aug 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X