న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్ టెస్ట్‌లను సరికొత్తగా మార్చేస్తుంది.. ముందుంది ఇండియాతో అసలు మజా.. దినేష్ కార్తీక్ ట్వీట్..!

England Vs Newzealnad Test Series: Dinesh Karthik Praised The way Of England Test Cricket

లీడ్స్‌లోని హెడింగ్లీలో జరిగిన టెస్ట్ సిరీస్లో న్యూజిలాండ్‌‌ను ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ సిరీస్ విజయంపై భారత వికెట్ కీపర్, కమ్ ఫినిషర్ దినేష్ కార్తీక్ స్పందించాడు. ఇంగ్లాండ్‌ విజయంపై ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లాండ్ జట్టు టెస్ట్ క్రికెట్‌ను సరికొత్తగా మార్చేస్తుంది అంటూ కొనియాడాడు. ఇక చివరి మ్యాచ్ చివరి రోజున 113పరుగులు చేయాల్సి రాగా.. ఇంగ్లాండ్ బ్యాటర్ ఓలీ పోప్ 82పరుగుల వద్ద తన మొదటి ఓవర్‌లోనే ఔటయ్యాడు. ఇక ఈ సంతోషం న్యూజిలాండ్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. క్రీజులోకి జానీ బెయిర్‌స్టో దిగి విధ్వంసం రేపాడు. టెస్ట్ క్రికెట్‌లో రెండో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ చేసి స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. బెయిర్‌స్టో కేవలం 30బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం గమనార్హం. అతనికి తోడు రూట్ అజేయంగా నిలిచాడు. దీంతో చివరి రోజు ఇంగ్లాండ్ కేవలం 15.2ఓవర్లలోనే 113పరుగులు ఛేదించి సిరీస్ 3-0తో వైట్ వాష్ చేసింది. ఇక బెయిర్‌స్టో (71పరుగులు), రూట్ (86 పరుగులు) కడవరకు క్రీజులో ఉండి లాంఛనాన్ని పూర్తి చేశారు.

ఇకపోతే ఇంగ్లాండ్ విజయం పట్ల చాలా మంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా భారత స్టార్ దినేష్ కార్తీక్ ఇంగ్లాండ్ విజయం మీద ట్విట్టరులో స్పందించాడు. ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా వికెట్ కీపర్ కమ్ ఫినిషర్ రోల్‌లో దినేష్ కార్తీక్ నిమగ్నమయ్యాడు. 'ఇంగ్లాండ్ టెస్టుల ఆట తీరును పూర్తిగా కొత్తగా మార్చేస్తుంది. ఈ టెస్ట్ సిరీస్ చూడ్డానికి పూర్తి ఆకర్షణీయంగా, ఆనందదాయకంగా ఉంది. #BazBall. ఇకపోతే భారత్ మరియు ఇంగ్లాండ్‌ల మధ్య అద్భుతమైన టెస్ట్ మ్యాచ్ జరగడం ఖాయంగా కన్పిస్తుంది' అంటూ దినేష్ కార్తీక్ ట్వీట్ చేశాడు.

ఇక కొత్త కోచ్ బ్రెండన్ మెకల్లమ్, కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్‌ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్లో పలు మార్పులు జరిగాయి. అలాగే టెస్ట్ క్రికెట్ ఆడే విధానంలోనూ ఒక కొత్త ఒరవడిని ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు తీసుకొచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా టెస్ట్ క్రికెట్లో కూడా ఇంత మజా ఉంటుందని తెలిపేలా ఓ రివల్యూషన్‌ను ఇంగ్లాండ్ జట్టు చూపిస్తోంది. ఇకపోతే జులై 1న ఇండియాతో ఇంగ్లాండ్ సిరీస్లోని రీషెడ్యూల్ చేసిన అయిదో టెస్ట్ ఆడబోతుంది. ఇక ఈ మ్యాచ్‌లో కూడా తన ఎటాకింగ్ వ్యూహంతో ఇంగ్లాండ్ బరిలోకి దిగే అవకాశముంది. ముఖ్యంగా మూడు మ్యాచ్‌ల సిరీస్లో 3-0తో వైట్ వాష్ చేశాక ఇంగ్లాండ్ ఆత్మస్థైర్యం మామూలుగా పెరగలేదు. ఇక ఈ టెస్ట్‌కు ముందే అభిమానులను ఎంటర్ టైన్ చేయడానికి తన ప్లేయర్లకు పక్కా సూచనలు ఇచ్చానంటూ బెన్ స్టోక్స్ పేర్కొన్న సంగతి తెలిసిందే.

Story first published: Monday, June 27, 2022, 22:12 [IST]
Other articles published on Jun 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X